ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ లేఅవుట్లపై కొరడా .. రియల్టర్లకు, రాజకీయ నేతలకు చుక్కలు చూపిస్తున్న కలెక్టర్ దివ్య దేవరాజన్

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ పనితీరుపై ఆసక్తికర చర్చ జరుగుతుంది . ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ అక్రమ లేఅవుట్ల పై ఉక్కుపాదం మోపుతూ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులకు, రియల్టర్ల కు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు .ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం అక్రమ లేఅవుట్లు చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్ మాఫియా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. రెండు దశాబ్దాలుగా రెచ్చిపోయిన వ్యాపారుల ఆగడాలకు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ చెక్ పెడుతున్నారు. రియల్టర్లు రూ. 200 కోట్లు పెట్టుబడి పెట్టి చేసిన వ్యాపారంపై కలెక్టర్ గట్టి దెబ్బ కొట్టారు.

ఒక్కరోజులో వందల అక్రమ లేఅవుట్లు తొలగించి రియల్టర్లకు షాక్ ఇచ్చిన కలెక్టర్

ఒక్కరోజులో వందల అక్రమ లేఅవుట్లు తొలగించి రియల్టర్లకు షాక్ ఇచ్చిన కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కరోజులో వందల అక్రమ లేఅవుట్లు తొలగించి దివ్యా దేవరాజన్ సంచలనం సృష్టించారు. కలెక్టర్ దివ్యా దేవరాజన్ తీరు రాజకీయ నేతలకు ఏమాత్రం మింగుడు పడడం లేదు . ఎలాంటి అనుమతులు లేకుండా రైతుల వద్ద నుండి భూములను కొనుగోలు చేసి అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లు చేసి అమ్మి కొనుగోలు చేసిన వారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిలువునా మోసం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆరు వెంచర్లకు తప్ప, మిగతా అన్నింటికీ ఎలాంటి అనుమతులు లేవని గుర్తించిన అధికారులు వెంచర్ల లో ఉన్న రాళ్ళను పీకి భూమిని చదును చేశారు. ఒక్క రోజులో దాదాపు 135 వెంచర్లను తొలగించిన అధికారులు రికార్డు సృష్టించారు.

 ఎవరు చెప్పినా వినేది లేదని కఠినంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ దివ్యా దేవరాజన్

ఎవరు చెప్పినా వినేది లేదని కఠినంగా వ్యవహరిస్తున్న కలెక్టర్ దివ్యా దేవరాజన్

ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జిల్లా వ్యాప్తంగా అక్రమ లేఅవుట్ లను కూల్చివేయటం చర్చకు కారణమవుతోంది. అక్రమ లేఅవుట్ల పై ఉక్కుపాదం మోపుతున్న జిల్లా కలెక్టర్ అనుమతులు లేవని ముందస్తు నోటీసులు జారీ చేసి అనంతరం జెసిబి లతో అక్రమ లేఅవుట్లను తొలగించేస్తున్నారు. ఇక అంతే కాదు అక్రమ లేఅవుట్లను వేసిన ప్రబుద్ధులు ప్రభుత్వ స్థలాలు కబ్జా చెయ్యటం కూడా గమనార్హం . దీంతో కలెక్టర్ దివ్యా దేవరాజన్ ఎటువంటి రాజకీయ ఒత్తిడులకు తలొగ్గకుండా అక్రమ లేఅవుట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. అంతే కాదు ఎలాంటి అనుమతులు లేని లేఅవుట్లలో ప్లాట్లను కొనుగోలు చెయ్యొద్దని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించారు . ఇక అనుమతులు లేని లేఅవుట్ల ముందు టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు లేని ఫ్లాట్ లను ఎవరు కొనుగోలు చేయవద్దంటూ బ్యానర్లు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ప్లాట్లను కొనుగోలు చేసిన వారు కలెక్టర్ అక్రమ లేఅవుట్లలో రాళ్ళను తొలగించటంతో ఆందోళనలో ఉన్నారు. సదరు వెంచర్ చేసిన యజమానులను నిలదీస్తున్నారు.

Recommended Video

లవ్ జర్నీ.. ముంబై టు ఆదిలాబాద్.. ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా..!
రియల్ మాఫియా సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజులో కూల్చేసిన కలెక్టర్ .. జిల్లాలో తనమార్కు పాలన

రియల్ మాఫియా సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజులో కూల్చేసిన కలెక్టర్ .. జిల్లాలో తనమార్కు పాలన


అక్రమ లేఅవుట్ల తొలగింపు యాక్షన్ ప్లాన్ లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన దివ్య దేవరాజన్ ఆదిలాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల 20 ఏళ్ల సామ్రాజ్యాన్ని ఒకే ఒక్క రోజులో నాశనం చేశారు . ఎవరి మాట లెక్కచేయకుండా తన పని తాను చేసుకుపోతున్న కలెక్టర్ తీరు పట్ల గుర్రుగా ఉన్న రాజకీయ నేతలు ఆమెను ఎలాగైనా బదిలీ చేయించాలని చూస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే కొనుగోలు చేసిన ప్లాట్ల యజమానులు తమ ప్లాట్ల పరిస్థితి ఏంటని వెంచర్ చేసిన రియల్టర్లను ప్రశ్నిస్తుంటే రాళ్లే కదా పీకేసింది ,మళ్లీ వేద్దామని సర్ది చెబుతున్నారట. ఇక కలెక్టర్ తీరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేమని , ఆదిలాబాద్లోని రియల్టర్ లు తలలు పట్టుకుంటున్నారు . రాజకీయ నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. మొత్తానికి కలెక్టర్ దివ్య దేవరాజన్ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తూ అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతూ జిల్లా పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు.

English summary
The booming realty in Adilabad district is currently faced with a harsh reality after being exposed for what it is, an illegal business. An estimated ₹200 crore invested by developers and other investors are locked in the business as most of them are finding it difficult to go legitimate and function within the ambit of law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X