వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద పదవే లక్ష్యం!: డీకే అరుణ మనసులో మాట

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరతారనే వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. అయితే, తాను టిఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని డీకే అరుణ పలుమార్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని తేల్చి చెప్పారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా ఆమె టిఆర్ఎస్ పార్టీలో చేరేది లేదని చెప్పారు. చాక్లెట్లు, బిస్కెట్లకు లొంగే వ్యక్తిత్వం తమది కాదని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లొంగబోమని తెలిపారు.

 DK Aruna on PCC post

అంతేగాక, కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తుకు భారీ ప్రణాళిక వేసుకున్నట్లు ఆ వ్యాఖ్యల్లో అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుస్తారా? అని ప్రశ్నించగా.. సీఎం అభ్యర్థి ఎవరన్నది హైకమాండ్ నిర్ణయిస్తుందని తెలిపారు.

అయితే, పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం పీసీసీ మార్పు ఉండదని చెప్పారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉన్నందున ఇప్పటికిప్పుడు మార్పులుంటాయని తాను అనుకోవడంలేదని డీకే అరుణ తెలిపారు.

ఎన్నికల సమయంలో మాత్రం పీసీసీ మార్పు తప్పనిసరిగా ఉండవచ్చని అన్నారు. అప్పుడు తప్పకుండా పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడతానని డీకే అరుణ చెప్పారు. పరోక్షంగా కాంగ్రెస్‌లో పెద్ద పదవినే అరుణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

English summary
It said that Congress MLA DK Aruna's eyes on PCC post chief post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X