dk aruna gift narendra modi mahabubnagar lok sabha elections 2019 polls voters telangana bjp డీకే అరుణ కానుక నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికలు 2019 ఓటర్లు తెలంగాణ బీజేపీ
మోడీ సైన్యంలో సైనికురాలిని.. పాలమూరును గెలిచి కానుకగా ఇద్దాం : డీకే అరుణ
మహబూబ్నగర్ : పాలమూరు పార్లమెంటరీ స్థానం గెలిచి.. ప్రధాని నరేంద్ర మోడీకి గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత డీకే అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదుర్కోవడమే గాకుండా.. సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందిస్తానని తెలిపారు. అందుకే మోడీ సైన్యంలో తానొక సైనికురాలిగా చేరినట్లు చెప్పారు.
ఎన్నికలకు ముందే గెలుపు బోణీ కొట్టిన బీజేపీ..! ఎలా అంటారా?
శుక్రవారం పాలమూరు వేదికగా దక్షిణాది ఎన్నికల శంఖారావం పూరించారు మోడీ. అందులో భాగంగా అమిస్తాన్పూర్లోని భూత్పూర్ ఐటీఐ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో డీకే అరుణ ప్రసంగించారు. ప్రపంచంలోనే మోడీ బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారని.. అదే క్రమంలో మన దేశాన్ని అగ్రభాగాన నిలిపారని కొనియాడారు.

జిల్లాలో పుట్టి పెరిగిన తాను.. ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశానని చెప్పుకొచ్చారు. దేశ ప్రజలంతా మోడీ వైపే చూస్తున్న ఈ తరుణంలో.. మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో బీజేపీని గెలిపించాలని కోరారు.