ప్రజల కోసం ప్రధాని మోడీ సమావేశమైతే.. కేసీఆర్ మాత్రం డుమ్మాకొట్టేంత బిజీ: డీకే అరుణ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల సీఎం కేసీఆర్కు కనీసం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. గురువారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ముఖ్యమంత్రలు వీడియో కాన్ఫరెన్స్లో.. కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు
దేశ ప్రధాని ప్రజల కోసం సమయాన్ని కేటాయిస్తే.. కేసీఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారరని విమర్శించారు. సీఎం కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు.

కేంద్రంపై బురద చల్లే ముఖ్యమంత్రి.. దేశ ప్రధానమంత్రి ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థతులపై ఎలాంటి భారం పడకుండా చూడాలని రాష్ట్రాల సీఎంలకు సూచనలు ఇచ్చిన విషయం గురించి కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా కేసీఆర్కు లేదని డీకే అరుణ దుయ్యబట్టారు. దేశ ప్రధాని ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. కేసీఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ విమర్శించారు.
మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి తూట్లు పొడిచిందన్నారు బండి సంజయ్. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు 3వేల కోట్లు బకాయిలు పేరుకు పోయాయన్నారు. కాలేజీలు ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయన్నారు బండి సంజయ్. ప్రభుత్వ నిర్లక్ష్యంతో దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీలు నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు.