హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పుడు ఏం పీకినవ్ కేసీఆర్?, నీలా బ్రోకర్‌గిరి చేయలే.: డీకే అరుణ సవాల్

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేసీఆర్ పై డీకే అరుణ ధ్వజం

హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తిలో నిర్వహించిన సభలో కేసీఆర్ తనపై చేసిన విమర్శలకు ఆమె ఘాటుగా స్పందించారు.

 ఫొటోలు, వీడియోలు చూపించు

ఫొటోలు, వీడియోలు చూపించు

శనివారం ఉదయం డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. అనంతపురంకు ఇక్కడ్నుంచి నీళ్లు పోవాలని చెప్పినానా? రఘువీరాకు మంగళహారతులు పట్టి స్వాగతం పలికానా?.. అయితే ఫొటోలు, వీడియోలు చూపించూ అంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు డీకే అరుణ.

డీకే అరుణా! కాస్కో నీ బండారం బయటపెడతా, ఆధారాలు: కేసీఆర్ తిట్ల దండకండీకే అరుణా! కాస్కో నీ బండారం బయటపెడతా, ఆధారాలు: కేసీఆర్ తిట్ల దండకం

అప్పుడు ఏం పీకినవ్ కేసీఆర్?

అప్పుడు ఏం పీకినవ్ కేసీఆర్?

మీ పదవులు, కూర్చీల కోసం తప్ప ప్రజలను పట్టించుకున్నారా? అంటూ డీకే అరుణ.. కేసీఆర్‌ను నిలదీశారు. సీట్ల కోసం తన్లాట తప్ప తెలంగాణ ఉద్యమంలో ఏం చేశావని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ నేతలు మంత్రులయ్యారని, కేసీఆర్ కేంద్రమంత్రి అయ్యారని గుర్తు చేశారు. అప్పుడు ఏం పీకినవ్ అంటూ కేసీఆర్‌ను డీకే అరుణ నిలదీశారు.

అరుణమ్మ గురించి మాట్లాడతావా?

అరుణమ్మ గురించి మాట్లాడతావా?


కేసీఆర్‌కు ఎన్నికలంటే తమాషా అయ్యిందని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంటు మీద ముందస్తుకు వెళితే గెలుస్తామనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అరుణమ్మ గురించి నువ్వు మాట్లాడతావా? అంటూ మండిపడ్డారు.
అరుణను విమర్శించే అర్హత లేదంటూ కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 నీలా బ్రోకర్‌గిరి చేయలే..

నీలా బ్రోకర్‌గిరి చేయలే..

‘నీ చరిత్ర.. నా చరిత్ర పాలమూరు ప్రజలను అడుగుదామా? నీలా బ్రోకర్‌గిరి చేయలేదు. పాస్ పోర్టు స్కాంలు చేయలేదు. మీది దగాకోరు ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీలోనే నీ రాజకీయం ప్రారంభమైంది. పూటకో పార్టీని మార్చెటోనివి' అంటూ కేసీఆర్‌పై డీకే అరుణ ధ్వజమెత్తారు.

English summary
Congress senior leader DK Aruna Saturday takes on at Telangana CM K Chandrasekhar Rao and TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X