వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిశ ఎఫెక్ట్... మద్యం నిషేధించాలని నేతల డిమాండ్.... బీజేపీ అరుణ దీక్ష

|
Google Oneindia TeluguNews

Recommended Video

DK Aruna Exclusive Interview || ఈనెల 11,12 తేదిల్లో మద్యపాన నిషేధం దిశగా దీక్ష చేపట్టనున్న బీజేపీ !

దిశ హత్యాచారం సంఘటనతో మరోసారి తెలంగాణ మద్యం నిషేధం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా దిశను సంఘటనకు పాల్పడిన నిందితులు మద్యం మత్తులో ఏం చేస్తున్నామో తెలియలేదని వ్యాఖ్యానించారు. ఇలా యువకుల చేస్తున్న నేరాలకు మద్యం కూడ ఓ కారణం. మరోవైపు జాతీయ రహాదారులతో పాటు ఇతర ప్రాంతాల్లో విచ్చల విడిగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. మద్యం ప్రభావంతో ఘోరాలు జరుగుతున్నాయనే ఆలోచనకు పలు రాజకీయా పార్టీలు తెరమీదకు వచ్చాయి. దీంతో మద్య నిషేధాన్ని విధించాలనే భారీ డిమాండ్‌తో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టాయి..

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా డీకే అరుణ..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి జేజమ్మ..తెలంగాణ బీజేపీ చీఫ్‌గా డీకే అరుణ..? హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి జేజమ్మ..

ఇందిరాపార్క్ వద్ద డీకే అరుణ దీక్ష

ఇందిరాపార్క్ వద్ద డీకే అరుణ దీక్ష

ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు సిద్దం అయ్యారు. ఇటివల పార్టీలో చేరిన డికే అరుణ ప్రభుత్వంపై ఒత్తిడి కోసం స్కేచ్ వేశారు. తెలంగాణ మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ... రెండు రోజుల పాటు నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 11.12 వ తేదిల్లో ఇందిరాపార్క్ వద్ద దీక్షను చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఈ దీక్షకు మహిళా సంఘాలు ,ఇతర పార్టీలు మద్దతు పలకాలని ఆమె కోరారు. ఇందుకోసం పెద్ద ఎత్తున బీజేపీ మద్దతు దారులను కూడ తరలించాలని ఆమె యోచిస్తున్నారు.

మద్యాన్ని నియంత్రించాలని కాంగ్రెస్ నిర్ణయం

మద్యాన్ని నియంత్రించాలని కాంగ్రెస్ నిర్ణయం

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం మద్య నియంత్రణపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మద్య నియంత్రణపై చర్చించారు. దిశ సంఘటన నేపథ్యంలో రాష్ట్రంలో మహిళలపై దాడులతోపాటు మద్యం అమ్మకాలపై కూడ నియంత్రణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇందుకోసం బెల్టు షాపులు తోలగించాలని సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా మాత్రమే చూడకుండా.. సమాజాపరంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఆగిపోవాలని పార్టీ నిర్ణయించి, అందోళనలు చేపట్టాలని నిర్ణయించింది.

 తెలంగాణలో మరో రాజకీయ పోరాటం

తెలంగాణలో మరో రాజకీయ పోరాటం

అయితే తెలంగాణలో మద్యం విక్రయాలు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. దీని ద్వార ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో మద్య నిషేధం అనేది సాధ్యం కాని అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆర్ధిక మాంద్యం ఉన్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఏమేరకు దిగివస్తుందో వేచి చూడాలి. ఇక బీజేపీ నేతలు మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తుండడంతో మరోసారి బీజేపీ,తోపాటు కాంగ్రెస్ పార్టీ ,అధికార టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఆర్టీసీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ వైఫల్యం చెందింది. దీంతో అనేక ప్రభావాలు చూపే.. మద్య నిషేధంపై బీజేపీ పోరాటం చేస్తుండడంతో రాష్ట్రప్రభుత్వం ఏమేరకు స్పందిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీకి తోడు.. కాంగ్రెస్ కూడ మద్య నియంత్రణపై పోరాటం చేయడం ఏమేరకు ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.

English summary
BJP leader DK Aruna will go on a hunger strike demanding that ban on liquor in Telangana. It will be on December 11 and 12 at Indirapark.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X