హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనాతో యుద్దానికి డీమార్ట్ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా సామాన్యులు మొదలు పారిశ్రామికవేత్తల వరకు ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా డీమార్ట్ వ్యవస్థాపకులు,అవెన్యూ సూపర్‌మార్కెట్స్ ప్రమోటర్ రాధాకృష్ణన్ దమని రూ.155కోట్లు విరాళం ప్రకటించారు.

Recommended Video

India Lock Down: Mukesh Ambani to Ratan Tata, Have A Look How Corporate India Helping by Donations

ఇందులో రూ.100కోట్లు పీఎం కేర్స్‌కు విరాళం ప్రకటించిన ఆయన.. మిగతా రూ.55కోట్లు కరోనా ప్రభావిత రాష్ట్రాలకు ప్రకటించారు. ఇందులో మహారాష్ట్ర,గుజరాత్‌లకు ఒక్కో రాష్ట్రానికి రూ.10 కోట్లు,ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,కర్ణాటక,రాజస్తాన్,పంజాబ్‌లకు ఒక్కో రాష్ట్రానికి రూ.5కోట్లు ప్రకటించారు. అలాగే తమిళనాడు,ఛత్తీస్‌ఘడ్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు 2.5కోట్లు ప్రకటించారు.

DMart founder Radhakishan Damani donates Rs 155 crore to fight against Coronavirus

'కరోనా బారి నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు మేము మద్దతు తెలుపుతున్నాం. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరూ మన సమాజం కోసం తమవంతు కృషి చేయాలి.' అని రాధాకృష్ణ పిలుపునిచ్చారు. కరోనాపై పోరాటానికి ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు,క్రీడాకారులు,సినీ హీరోలు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇందులో టాటా కంపెనీ మొత్తం రూ.1500 కోట్లు ప్రకటించగా.. రూ.500కోట్లు పీఎం కేర్స్‌కు విరాళంగా ఇచ్చింది. విప్రో గ్రూప్&అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1125కోట్లు విరాళంగా ఇచ్చింది. పారిశ్రామిక దిగ్గజం ముకేష్ అంబానీ కూడా రూ.500కోట్లు విరాళం ఇచ్చారు. అలాగే మహారాష్ట్ర,గుజరాత్‌లకు మరో రూ.5కోట్లు విరాళం ప్రకటించారు. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ రూ.220 కోట్లు,కోల్ ఇండియా రూ.220కోట్లు,ఐటీసీ రూ.150కోట్లు,కొటక్ మహీంద్రా రూ.50కోట్లు ప్రకటించాయి.

English summary
Radhakrishan Damani, promoter of Avenue Supermarts, which owns retail brand D-Mart, on Saturday donated Rs 155 crore for the fight against coronavirus. While Rs 100 crore was donated to the PM-CARES Fund.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X