వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితాలపై మీడియా కథనాలను నమ్మొద్దు..! ఎప్పుడు వెళ్లడిస్తామో మీడియా ద్వారా చెప్తామన్న ఇంటర్ బోర్డ్..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలపై మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని, ఎప్పుడు ఫలితాలు ప్రకటిస్తామో మీడియా ద్వారా వెళ్లడిస్తామని ఇంటర్ మీడియట్ బోర్డ్ అదికారులు తెలియజేసారు. ఏపిలో ఫలితాలు విడుదైలన క్రమంలో తెలంగాణ లో ఎందుకు విడుదల చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా ఫలితాలను విడుదల చేసి విద్యార్థులను గొందగోళానికి ఎక్కడ గురిచేస్తారోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఫలితాల్లో తేడా వస్తే విద్యార్థుల జీవితాలుకూడా నాశనం అవుతాయని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యలో మీడియా కధనాలను నమ్మొద్దని ఇంటర్ బోర్డ్ పేర్కొనడం విశేషం.

Do not believe media stories on the results..!will announce the dates through the media. says board.

ఇంటర్ ఫలితాల వెల్లడి తేదీలపై ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఫలితాల తేదీలను వెల్లడించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు తెలిపింది. ఫలితాల వెల్లడికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ తుదిదశలో ఉందని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

Do not believe media stories on the results..!will announce the dates through the media. says board.

వీలైనంత త్వరలో ఇంటర్ ఫలితాలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల నుంచి 9,42,719 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరానికి చెందిన విద్యార్థులు 4,52,550 మంది, ద్వితీయ సంవత్సరానికి చెందిన 4,90,169 మంది విద్యార్థీని విద్యార్థులు ఉన్నారు.

English summary
The intermediate board told the media that should not believe the stories coming in the media on the inter results.Inter board Officials says when the results dates will be announced by the media. parents question why they did not release in Telangana in order to be released in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X