వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొన్నం సంచలనం : పార్టీ మారనని బాండ్, బీజేపీతో కలువనని రాసివ్వాలని కేసీఆర్‌కు సవాల్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. తాను పార్టీ మారానని, మారితే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన సోమవారం కరీంనగర్‌లో బాండ్ పేపర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

క్రిమినల్ కేసు పెట్టండి

క్రిమినల్ కేసు పెట్టండి

తాను బాధ్యతగల, కాంగ్రెస్ కార్యకర్తనని స్పష్టంచేశారు పొన్నం ప్రభాకర్. తన తల తెగిపడిన పార్టీ మారబోనని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఒకవేళ పార్టీ మారితే క్రిమినల్, చీటింగ్ కేసులు పెట్టాలని ప్రజలను కోరారు. ఈ బాండ్ లోక్‌సత్తా, ప్రజాసంఘాల వద్ద ఉంచతానని చెప్పారు. తనకు తమ పార్టీ, నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు.

బాండ్ ఎందుకంటే ?

బాండ్ ఎందుకంటే ?

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారం చేపట్టింది. పార్టీ గెలిచింది 88 స్థానాలే అయనా ... టీడీపీ, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 10 మంది సభ్యులు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో కలిసి 100కి చేరింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినా అభ్యర్థులు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. సో .. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పొన్నం ప్రభాకర్ పార్టీ మారడేంటీ అన్న సందేహాం వస్తుందనని గ్రహించి పొన్నం ప్రభాకర్ బాండ్ పేపర్ రిలీజ్ చేశారు.

కేసీఆర్‌కు సవాల్

కేసీఆర్‌కు సవాల్

ఎన్నికల కన్నా ముందే పార్టీ మారానని బాండ్ పేపర్ రాసిచ్చినా పొన్నం ప్రభాకర్, ఎన్నికల తర్వాత బీజేపీతో కలువనని అఫిడవిట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ కు విశ్వసనీయ లేదని, మాట నిలబడరని విమర్శించారు. అయినా చట్టం మీద ఉన్న గౌరవంతో బాండ్ పేపర్ మీద రాసివ్వాలని డిమాండ్ చేశారు.

English summary
Karimnagar Congress candidate Ponnam Prabhakar new strategy. The Bond Paper was given to people during the Lok Sabha elections. He said that he had not changed the party and wanted to take criminal actions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X