వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసిఆర్ అవమానాలను మర్చిపోవద్దు కామ్రేడ్స్ : ఉత్తమ్‌కుమార్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు ఇవ్వడంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. గత ఆరు సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ కమ్యునిస్టులను ఆనేక అవమానాలకు గురి చేసిందని గుర్తు చేసిన ఆయన కమ్యునిస్టులకు ఒట్లు ఎక్కడివి అని ఎగతాళి చేసిన విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కమ్యునిస్టులు మర్చిపోవద్దని కొరారు.

 మాకు మద్దతు ఇవ్వండి

మాకు మద్దతు ఇవ్వండి

ఈ నేపధ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ ఒటమి భయంతోనే సీపిఐ మద్దతు కోరే ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. కమ్యునిస్టులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. హుజుర్‌నగర్ నియోజవర్గానికి కాంగ్రెస్ హాయంలో వెయ్యి కొట్ల రుపాయలతో అభివృద్ది చేశామని వివరించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని ఓటమిపాలు చేసేందుకు సుమారు 700 మంది టీఆర్ఎస్ నాయకులు రంగంలోకి దిగారని ఆయన ఎద్దెవా చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన ఈ వాఖ్యలు చేశారు.

 సిపిఐ మినహా అన్ని పార్టీలు రంగంలోకి

సిపిఐ మినహా అన్ని పార్టీలు రంగంలోకి

కాగా హుజురాబాద్‌లో సిపిఐ మినహా అన్ని ప్రధాన పార్టీలు రంగంలో ఉన్న విషయం తెలిసిందే...కాంగ్రెస్ పార్టీ నుండి ఉత్తమ్ భార్య అయిన పద్మావతి రెడ్డి పోటి చేస్తుండగా, టీఆర్ఎస్ నుండి సైదిరెడ్డిని ఎంపిక చేశారు. మరోవైపు బీజేపీ సైతం పార్లెమెంట్ ఎన్నికల విజయంతో తన అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీతోపాటు మరో కమ్యునిస్టు పార్టీ అయిన సీపిఎం కూడ తమ అభ్యర్థులను రంగంలోకి దింపింది. బీసీ వర్గానికి చెందిన డాక్టర్ కోటా రామారావును నేడు ప్రకటించారు. మరోవైపు తెలంగాణలో తమ బలాన్ని నిరూపించుకునేందుకు టీడీపీ సైతం రంగంలోకి దిగింది. ఈనేపథ్యంలోనే చావా కిరణ్మయిని అభ్యర్థిగా ప్రకటించారు. మరోవైపు సీపీఎం అభ్యర్థిగా ఆరెపల్లి శేఖర్‌ రావును ప్రకటించారు. అయితే ఒక్క సిపిఐ మాత్రమే పోటి చేయడం లేదు.

టీఆర్ఎస్, సిపిఐ నేతల సమావేశం

టీఆర్ఎస్, సిపిఐ నేతల సమావేశం

ఇంతమంది పోటి చేస్తున్న నేపథ్యంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించేందుకు టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతుంది.ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌ కే కేశవరావు, లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్దూం భవన్‌కు వెళ్లి పార్టీ నేతలతో భేటి అయ్యారు. సానుకూల దృక్పథంతో చర్చలు జరిగాయని కేకే తెలిపారు. సిపిఐ మద్దతు ఇచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే పార్టీ మద్దతుపై ఆక్టోబర్ 1న పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

English summary
pcc chief uttam kumar reddy request to the cpi to support congress party in Huzurnagar by-elections,and reminded that the cm kcr insulted the cpi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X