వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భావోద్వేగాలు వ‌ద్దు..! ఆ విష‌యంలో హ‌రీష్ ను పార్టీ శ్రేణులు రెచ్చ‌గొట్టొద్దంటున్న ముఖ్య‌నేత‌లు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు తన త‌న‌యుడు కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కీలక భాద్యతలు అప్పజెప్పటం హరీష్ రావును తీవ్రంగా బాధించిందనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ భాద్యతలు కేటీఆర్ చేతిలో పడ్డాయి కాబట్టి ఇక హరీష్ రావు తన బావమరిది కేటీఆర్ కి స‌లాం కొట్టక తప్పదని, ఈ విషయం పైనే హ‌రీష్ అభిమానులు భావోద్వేగానికి లోనౌతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే అంశం పట్ల హ‌రీష్ వ‌ర్గం సంయ‌మ‌నం పాటించాల‌ని, లేక‌పోతే ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు వెళ్త‌య‌ని ముఖ్య‌నేత‌లు సూచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

కేటీఆర్ కి కీల‌క ప‌ద‌వి..! సునిశితంగా గ‌మ‌నిస్తున్న హ‌రీష్ అభిమానులు..!

కేటీఆర్ కి కీల‌క ప‌ద‌వి..! సునిశితంగా గ‌మ‌నిస్తున్న హ‌రీష్ అభిమానులు..!

వాస్త‌వానికి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు హరీష్ రావు. కేసీఆర్ చెప్పిన పనులన్నీ తూచా త‌ప్ప‌కుండా పాటించి పార్టీని బతికించిన వ్యక్తి హరీష్ రావు. టీఆర్ఎస్ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే కారణం తన్నీరు హరీష్ రావు మాత్రమే. ఇది బ‌హిరంగ స‌హ‌స్యం కూడా! కానీ ఇప్పుడు హరీష్ రావును పక్కన పెట్టి టీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కల్వకుంట్ల తారక రామారావుకు కేసీఆర్ బాధ్యతలు అప్పజెప్పటం పలు చర్చలకు దారితీస్తోంది. అర్థం చేసుకుని హ‌రీష్ సైలెంట్ గా ఉన్న‌ప్ప‌టికి ఆయ‌న అభిమానులు ఈ విష‌యాన్ని జీర్ణించుకోలేక‌పోతున్న‌ట్టు తెలుస్తోంది.

హ‌రీష్ వ‌ర్గం సంయ‌మ‌నంగా ఉండ‌వాలి..! ఏం చేసినా పార్టీ క్షేమం కోస‌మే అంటున్న నేత‌లు..!!

హ‌రీష్ వ‌ర్గం సంయ‌మ‌నంగా ఉండ‌వాలి..! ఏం చేసినా పార్టీ క్షేమం కోస‌మే అంటున్న నేత‌లు..!!

రెండో సారి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ప ష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారా? లేక తన కుమారుడిని హైలైట్ చేసేందుకే ఇలా చేస్తున్నారా? అనే కోణంలో చర్చలు ఊపందుకున్నాయి.
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను అమలు చేసేందుకు సమర్థుడికి పట్టం కట్టాలని కేసీఆర్ భావించిన‌ట్టు తెలుస్తోంది. ఆ క్రమం లోనే పార్టీలో నెంబ‌ర్ 2 స్థానానికి కేటీఆర్‌ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, టీఆర్ఎస్‌ను ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉంచే విషయంలో కేటీఆర్‌ అత్యంత సమర్థంగా ఉంటారు కాబ‌ట్టే కేసీఆర్ ఇలా నిర్ణయించారని పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

గ్రూపు రాజ‌కీయాలు వ‌ద్దు..! కేసీఆర్ కు అన్నీ తెలుసంటున్న ముఖ్య‌నేత‌లు..!!

గ్రూపు రాజ‌కీయాలు వ‌ద్దు..! కేసీఆర్ కు అన్నీ తెలుసంటున్న ముఖ్య‌నేత‌లు..!!

గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ బాధ్యతలను కేటీఆర్‌ తీసుకున్నారు. సీమాంధ్రుల మనసు గెలిచి, అసాధ్యమనుకున్న విజయాల్ని సుసాద్యం చేసి చూపించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించడం, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాల్సి ఉండడంతో కేసీఆర్ పై పనిభారం పెరుగుతున్న కారణంగా బాధ్యతలను బదిలీ చేయాలనుకున్నారు. పార్టీని తాను అనుకున్న విధంగా ముందుకు తీసుకెళ్లే బాధ్యతను, పార్టీలో తాను అత్యంత ఎక్కువగా విశ్వసించే కేటీఆర్ కు కేసీఆర్ అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హరీష్ స‌హ‌నం కోల్పోవ‌ద్దంటున్న నాయ‌కులు..! కేటీఆర్ స‌మ‌ర్థ‌త‌పై న‌మ్మ‌కం ఉంచాల‌ని సూచ‌న‌..!

హరీష్ స‌హ‌నం కోల్పోవ‌ద్దంటున్న నాయ‌కులు..! కేటీఆర్ స‌మ‌ర్థ‌త‌పై న‌మ్మ‌కం ఉంచాల‌ని సూచ‌న‌..!

సరిగ్గా ఇదే పాయింట్ హరీష్ రావు సన్నిహితులకు మింగుడు పడటం లేదట. హరీష్ రావు ఇప్పటికైతే కేసీఆర్ కు అనుకూలంగా, నిబద్ధతగానే ఉన్నారు. ఆయనపై తిరుగుబాటు చేసే అవకాశం, అవ‌స‌రం కూడా హ‌రీష్ కు నేన‌ట్టు తెలుస్తోంది. ఐతే హ‌రీష్ వ‌ర్గం మాత్రం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప‌ట్ల క‌ల‌త చెందుతున్న‌ట్టు తెలుస్తోంది. హ‌రీష్ కు కావాల‌నే ప్రాధాన్య‌త త‌గ్గిస్తున్నార‌న్న‌ది వారి వాద‌న గా తెలుస్తోంది. దీంతో తాజా పరిస్థుతుల దృష్ట్యా ముందు ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని ఆలోచనలో పడిపోయాయి రాజకీయ వర్గాలు. సున్నిత‌మైన అంశం ప‌ట్ల అభిమానులు భావోద్వేగాల‌కు గురి కావ‌ద్ద‌ని హ‌రీష్ వారించ‌డం కొస‌మెరుపుగా చెప్పుకోవ‌చ్చు.

English summary
KCR Handed over Key responsibilities as Party Working President for KTR. Harish Rao has been reported to have been severely hurt.Harish fans are feeling emotional. The mainstream indicates that the Harish category should follow the same aspect of the topic, or if the people do have false signals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X