వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తుంటే దాడులు చేస్తారా..? 23న బ్లాక్ డే పాటిస్తామంటున్న డాక్టర్లు..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ప్రశాంతంగా కనిపించే వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంటికి కనిపించని కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాపాయంలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్నట్టు డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. వైద్యం అందించడంలో చిన్న చిన్న పొరపాట్లు సహజంగా జరిగిపోతుంటాయని, అంత మాత్రాన డాక్టర్ల పై బౌతిక దాడులు చేయడం సమంజసం కాదని వైద్యులు చెప్పుకొస్తున్నారు.

ప్రాణాలు కాపాడిన డాక్టర్లను దేవుడితో పోల్చడం సహజంగా జరిగిపోతుందని, అలాంటి సందర్బంలో ఏదో ఒక సమయంలో రోగులకు జరగకూడనిది జరిగిపోయినంత మాత్రాన డాక్టర్లను విలన్లుగా ఎలా చిత్రీకరిస్తారని డాక్టర్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి సోకకుండా వైద్యం అందిస్తున్న సమయంలో రోగులు చేస్తున్న దాడులకు నిరసనగా బ్లాక్ డే పాటించాలని కార్యాచరణ రూపొందించుకున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు.

 Doctors conducting Black Day on 23rd of this month..!

ప్రపంచ దేశాలను కోవిద్-19 వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ శర వేగంగా విజృంభిస్తోంది. కరోనాపై పోరాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 23న బ్లాక్‌డే పాటించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది. ఈ మేరకు ఐఎంఏ గౌరవ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్వీ అశోకన్‌ ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ, ఓ ప్రకటనలో తెలిపారు.

కరోనా కట్టడికోసం అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులపై జరుగుతున్నా దాడులకు నిరసనగా, గురువారం రోజున దేశంలోని డాక్టర్లంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని కోరారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22 బుదవారం రాత్రి 9 గంటలకు ఆస్పత్రులలో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపాలని డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. దీంతో జరుగతున్న దాడుల పట్ల డాక్టర్ల సంఘం ఎంత ఆగ్రహంతో ఉన్నాో అర్ధమవుతోంది.

Recommended Video

Salute To Your Family, Telugu Short Film | Anchor Manjusha

English summary
The Indian Medical Association (IMA) has decided to observe a block day on the 23rd of this month in protest against the attacks on doctors who are serving their lives fighting against corona.IMA National President Dr Rajan Sharma and Honorary Principal Secretary Dr RV Asokan said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X