హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎత్తు పెరిగేందుకు కాళ్లకు ఆపరేషన్: దిగొచ్చిన వైద్యులు, టెక్కీ నిఖిల్ తండ్రి ఇలా..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎత్తుపెంచుకునేందుకు శస్త్ర చికిత్స చేయించుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిఖిల్‌ రెడ్డి విషయంలో గ్లోబల్‌ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. నిఖిల్‌ రెడ్డికి ప్రతి శుక్ర, శనివారాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ఆస్పత్రి మేనేజర్‌ ఇన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ అనంతపాయ్‌ తెలిపారు.

గత నెల 27న నిఖిల్‌రెడ్డికి డాక్టర్‌ చంద్రభూషణ్‌ వైద్యం చేశారని, తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ ఆ డాక్టర్‌ను సస్పెండ్‌ చేయడంతో శుక్రవారం వైద్యం అందించలేకపోయామని చెప్పారు. ఇక నుంచి ప్రతివారం ఆర్థోసర్జన్‌ డాక్టర్‌ అరవింద్‌ గాంద్రీ, ఇతర నిపుణులతో నిఖిల్‌ రెడ్డికి వైద్యం అందిస్తామన్నారు.

నిఖిల్ రెడ్డికి గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు చికిత్సను నిలిపేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9.30 గంటలకు డాక్టర్‌ అనంతపాయ్‌, డాక్టర్‌ గాంద్రీలు కుత్బుల్లాపూర్‌ ఎంఎన్‌ రెడ్డినగర్‌లోని నిఖిల్‌ రెడ్డి ఇంటికి వెళ్లి అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స నిర్వహించిన అతని రెండు కాళ్లకు డ్రెసింగ్‌ చేశారు. ఎక్స్‌రేలను పరిశీలించారు.

నిఖిల్‌కు ఇన్‌ఫెక్షన్ సోకలేదు..

నిఖిల్‌కు ఇన్‌ఫెక్షన్ సోకలేదు..

నిఖిల్ రెడ్డికి ఇన్‌ఫెక్షన్‌ సోకలేదని, భయపడవద్దని వైద్యులు భరోసా ఇచ్చారు. అయితే నిఖిల్‌ రెడ్డి ఎప్పుడు మెరుగవుతాడు, రాడ్స్‌ను ఎప్పుడు తొలగిస్తారు అనే అంశంపై వైద్యులు స్పష్టత ఇవ్వలేదు. మరోమారు పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఏ విషయం చెప్పగలమని వైద్యులు వారు చెప్పలేదు.

ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వలేదని తండ్రి

ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వలేదని తండ్రి

నిఖిల్‌ రెడ్డికి వైద్యులు చికిత్స నిలిపివేయడంతో ఇన్‌ఫెక్షన్‌ సోకిందని, అక్కడంతా పుండ్లుగా మారి నొప్పులతో బాధపడుతున్నాడని అతని తండ్రి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. సోమవారం ఇంటికి వచ్చిన వైద్యులు తన కొడుకు ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వలేదన్నారు.

ఆ మందులు ఎందుకు రాశారు..

ఆ మందులు ఎందుకు రాశారు..

ఇన్‌ఫెక్షన్‌ సోకలేదని అంటున్న వైద్యులు 500ఎంజీ స్టెప్ర్టాటన్‌ మందులను ఎందుకు రాశారని, వాటిని నాలుగు రోజులపాటు వాడాలని ఎందుకు సూచించారని నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సర్జరీ తర్వాత నెల రోజుల్లో లేచి నడుస్తాడని అప్పట్లో వైద్యులు చెప్పారని, సర్జరీ జరిగి ఏడు నెలలు గడిచినా తన కుమారుడు మంచానికే పరిమితమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎవరూ మోసపోవద్దు...

ఎవరూ మోసపోవద్దు...

ఎత్తు పెంచుతామనే డాక్టర్ల మాట నమ్మి తన కొడుకులా ఎవరూ మోసపోవద్దని నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శస్త్రచికిత్స నిర్వహించిన డాక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ మెడికల్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

English summary
Hyderabad global hospitals doctors extended medical services to techie Nikhil Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X