వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివాహిత కడుపులో ఉన్న కత్తిని గాంధీ ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి విజయవంతంగా బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ కు చెందిన స్వప్న అనే మహిళ కారగాయాలు తరిగే పదునైన కత్తిని నోట్లో పెట్టుకోవడంతో అది కడుపులోకి వెళ్లిపోయింది.

ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పకుండా చాలా రోజులు దాచిపెట్టింది. అయితే కొన్నాళ్లకు కడుపునొప్పితో అనారోగ్యానికి గురైంది. దీంతో స్ధానిక వైద్యులను సంప్రదించగా ఎక్సరేలో పదునైన ఆరంగుళాల కత్తి గొంతులో నుంచి కడుపులోకి చేరినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు.

దీంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీలో నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కె.వెంకటేశం కుమారుడు శ్రీనివాస్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు సహజసిద్ధంగా కడుపులోంచి కత్తి బయటకు వచ్చేలా ప్రయత్నించి అందుకు అనువైన ఆహారం అందించినా కత్తి కడుపులో అడ్డం తిరగింది.

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీనియర్‌ వైద్యుల సలహాతో సర్జరీ చేసి రెండు రోజుల కిందట కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని శ్రీనివాస్‌ తెలిపారు. గొంతు, అన్నవాహిక.. ఇలా కడుపులోకి చేరిన పదునైన కత్తివల్ల బాధితురాలికి ఇంతకాలం ఎక్కడా ఎలాంటి గాయం కాలేదు.

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ కు చెందిన స్వప్న అనే మహిళ కారగాయాలు తరిగే పదునైన కత్తిని నోట్లో పెట్టుకోవడంతో అది కడుపులోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పకుండా చాలా రోజులు దాచిపెట్టింది.

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

అయితే కొన్నాళ్లకు కడుపునొప్పితో అనారోగ్యానికి గురైంది. దీంతో స్ధానిక వైద్యులను సంప్రదించగా ఎక్సరేలో పదునైన ఆరంగుళాల కత్తి గొంతులో నుంచి కడుపులోకి చేరినట్టు డాక్టర్లు నిర్ధారణకు వచ్చారు. దీంతో వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

గాంధీలో నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ కె.వెంకటేశం కుమారుడు శ్రీనివాస్‌ డాక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. అంతకుముందు సహజసిద్ధంగా కడుపులోంచి కత్తి బయటకు వచ్చేలా ప్రయత్నించి అందుకు అనువైన ఆహారం అందించినా కత్తి కడుపులో అడ్డం తిరగింది.

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

కత్తిని మింగిన మహిళ: ఆపరేషన్ చేసి బయటకు తీశారు

దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సీనియర్‌ వైద్యుల సలహాతో సర్జరీ చేసి రెండు రోజుల కిందట కత్తిని తొలగించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని శ్రీనివాస్‌ తెలిపారు. గొంతు, అన్నవాహిక.. ఇలా కడుపులోకి చేరిన పదునైన కత్తివల్ల బాధితురాలికి ఇంతకాలం ఎక్కడా ఎలాంటి గాయం కాలేదు.

మహిళ కడుపులోకి కత్తి ఎలా వెళ్లిందో అంతుబట్టడం లేదు. దీనిపై సదరు మహిళను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్తుండటంతో ఆమె మానసిక పరిస్థితిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు

English summary
Doctors remove 'scissors' from woman's belly in hyderabad Gandhi Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X