వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మొండోడ్ని, బాబు ఏం చేయగలడు: లీడర్లపై కెసిఆర్ మార్క్ కామెంట్లు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పరాయి రాష్ట్రానికి (ఏపీ) చెందిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు వచ్చి చక్కిలిగింతలు పెడుతున్నాడని, బల్దియాను అభివృద్ధి చేయడానికి ఆయన ఏముందని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం నాడు మండిపడ్డారు.

సికింద్రాబాద్‌ పరేడ్ మైదానంలో జరిగిన టిఆర్ఎస్ ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాబు తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబుకు హైదరాబాద్‌పై ఎంత ప్రేమ ఉందో ఇక్కడివారికి తెలియంది కాదని, బషీర్‌బాగ్‌లో నీవు కాల్చిన రైతుల రక్తపు ముద్ర, అంగన్‌వాడీ మహిళలను గుర్రంతో తొక్కించిన ముద్ర, ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు.

కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, సిపిఐ నారాయణ తదితరుల పైన కెసిఆర్ తనదైన శైలిలో చురకలు అంటించారు. అధికారంలోకి రాగానే తెలంగాణకు చెందిన ఏడు మండలాలను చంద్రబాబు గుంజుకున్నారని, వెంకయ్య గుంజి ఇచ్చారని కెసిఆర్ ఎద్దేవా చేశారు.

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పైన కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు. ఆయన పెద్ద మనిషిగా వ్యవహరిస్తారనుకున్నానని, కానీ డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చిందా చెప్పాలని ప్రశ్నించారు.

సిపిఐ నేత నారాయణ గురించి మాట్లాడుతూ... 'నాకు నిన్నటి నుంచి రంది పట్టుకుంది. ఇంకో పెద్దమనిషి సీపీఐ నారాయణ ఉన్నడు. ఆయన హైదరాబాద్‌లో తెరాస సొంతంగా మేయర్‌ పదవి దక్కించుకుంటే చెవి కోసుకుంటా అన్నడు. నారాయణా.. దయచేసి హైదరాబాద్‌లో 5న ఉండకు. ఎవరైనా వచ్చి నీ చెవి కోస్తే, ఈఎన్‌టీ ఆసుపత్రి లో చేర్పించాలి.' అని కెసిఆర్ అన్నారు.

'హైదరాబాద్‌ను వదలను బొమ్మాళీ.. అంటున్నాడు చంద్రబాబు. నిన్ను ఎవరు వదలమన్నారు.. ఇంకో 15 హెరిటేజ్‌ దుకాణాలు పెట్టుకో.. లైసెన్సులు కావాలంటే ఇప్పిస్తా.. మా వదిన భువనేశ్వరి దగ్గరకు మా కార్యకర్తలు వెళితే మీకే ఓటేస్తానని చెప్పారు. అది తెలియని చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు. అమరావతి వచ్చి నేనక్కడే ఉంటానంటే అవుతుందా?' అని కెసిఆర్ అన్నారు.

ఈ ఎన్నికల కోసం నా కొడుకు కేటీఆర్‌ నగరమంతా తిరిగాడని, పార్టీ ప్రచార బాధ్యతను భుజాలకెత్తుకుని నడిపించాడని, నగరాన్ని అభివృద్ది చేసేందుకు తన వద్ద ఉన్న మున్సిపల్‌ శాఖను ఆయనకు అప్పగిస్తానని కెసిఆర్ చెప్పారు.

కెసిఆర్`

కెసిఆర్`

చంద్రబాబు కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమ దోపిడీదారు అని కెసిఆర్ ధ్వజమెత్తారు. ఈ రోజు వారి సేవలను మా ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని, హైదరాబాద్‌కు వచ్చి, ప్రశాంతతను చెడగొట్టకని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

కెసిఆర్

కెసిఆర్

చంద్రబాబు మాటల్లో పడితే ఇబ్బందుల్లో పడతామని, నగరానికి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏం ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు గుంజుకున్నారన్నారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్‌కు మంచినీళ్లు కావాలని, 200 కిలోమీటర్ల నుంచి అవి వస్తున్నాయని, ఏదైనా జరిగి పైపులైన్‌కు ఏమైనా అయితే నగరానికి నీళ్లు ఎక్కడ నుంచి తేవాలని, చంద్రబాబు ఏమైనా చేయగలడా అని ప్రశ్నించారు.

కెసిఆర్

కెసిఆర్

ఇలాంటి ఆపదలు వచ్చినా నివారించటానికి మా ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. 40టీఎంసీల సామర్థ్యంతో రెండు భారీ జలాశయాలు నెలకొల్పుతున్నాం. వర్షం పడితే హైదరాబాద్‌ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరుతున్నాయి.

కెసిఆర్

కెసిఆర్

హైటెక్‌సిటీ అంటే అర్థం.. కార్లన్నీ బోట్లుగా మారడమా అని ఎద్దేవా చేశారు. ఈ నగరాన్ని సంస్కరించాలంటే రూ.22వేల కోట్లు ఖర్చు పెట్టాలని, ఈ పనులు ఎవరు చేయాలి? రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాలన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు కదా? పట్టువదలక పేదల కోసం పాటుపడే పార్టీ టిఆర్ఎస్ మాత్రమే అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకొస్తున్నామని, యథాలాపంగా ఓటువేసి ఆగమాగం కావద్దన్నారు. అమెరికాలో డల్లాస్‌ కంటే గొప్పది కావాలని, కేసీఆర్‌ మొండోడు అని, అన్నది తప్పక చేస్తాడన్నారు.

కెసిఆర్

కెసిఆర్

లంచం ఇవ్వకుండా మున్సిపల్‌ అనుమతి తెచ్చుకునే రోజులు రావాలని, చంద్రబాబు మాట్లాడితే చాలు.. మనసంతా ఇక్కడే ఉంది అంటున్నాడని, తమ 18నెలల పాలనలోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

బీహార్‌ ముఖ్యమంత్రి తెలంగాణలోని సంక్షేమ పథకాల్ని అక్కడ పెడతామని చెబుతున్నారని, చంద్రబాబు మాయోపాయాలు చేసి శాంతంగా ఉన్న తెలంగాణలో కలకలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని, ఆయన మాటలు వింటే ఇబ్బందులు తప్పవని, మన నగరాన్ని మంచిగా తీర్చిదిద్దుకుంటామన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

తెలంగాణ వస్తే కరెంటు కోతలో చీకటి అవుతుందన్నారని, ఇప్పుడు 24 గంటలపాటు రెప్పపాటు ఆటంకం లేకుండా కరెంటు ఇస్తున్నామని, పరిశ్రమలకు కూడా రోజంతా ఇస్తున్నామని, ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పెట్టామన్నారు.

 కెసిఆర్

కెసిఆర్

హాస్టల్‌ పిల్లలకు సన్నబియ్యం ఇచ్చామని, పేదలకు ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నామని, హైదరాబాద్‌లో పేదలందరికి వాటినిచ్చే బాధ్యత తనదే అన్నారు. ప్రాజెక్టులు కట్టుకోవాలని, మంచినీళ్లు తెచ్చుకోవాలని, హైదరాబాద్‌లో ఇంకా సదుపాయాలు లేవని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

60 ఏళ్లు అధికారం చెలాయించింది ఎవరని, కాంగ్రెస్‌, టిడిపి గురించి మీకు తెలియంది కాదన్నారు. ఆనాడు తెలంగాణ కోసం ఎట్లా పోరాటం చేశామో.. ఇప్పుడు కూడా అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. చంద్రబాబు ఆంధ్రా సీఎం, ఇక్కడేమీ చేయలేడని, ఇక్కడ అధికారంలో ఉన్నది టిఆర్ఎస్ ప్రభుత్వమని కెసిఆర్ అన్నారు.

English summary
Chief Minister K Chandrasekhar Rao trained his guns on his AP counterpart Chandrababu Naidu in the backdrop of the latter staking claim for the development of Hyderabad and appealed to voters in GHMC polls not to be misled by Mr. Naidu’s propaganda as he distorted facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X