వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పుడు రాలేదుగా, ఇప్పుడు మా ఊరికి రావొద్దు: రసమయికి షాకిచ్చిన యువకులు
సిరిసిల్ల: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు పలుచోట్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఈ జాబితాలో తాజా మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ చేరారు. ఆయనను పలువురు గ్రామస్తులు సిరిసిల్ల నియోజకవర్గంలో అడ్డుకున్నారు.
ముస్కాన్పేటలో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన వచ్చారు. రసమయిని పలువురు యువకులు అడ్డుకున్నారు. ఇటీవల అంబేడ్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాల ఆవిష్కరణకు యువకులు పిలిచినా రసమయి వెళ్లలేదని తెలుస్తోంది.

దీంతో ఆ యువకులు విగ్రహాల ఆవిష్కరణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మీలాంటి వారు మా ఊరికి రావొద్దని ఆందోళన చేశారు. రసమయి బాలకిషన్ గో బ్యాక్ అని నినాదాలు చేశారు.