హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాగ్నిజెంట్ కు టెక్కీల షాక్: ఉద్యోగులను తీసివేయకూదని కార్మికశాఖ ఆదేశం

పనిలో నుండి తీసివేయకూడదంటూ కాగ్నిజెంట్ యాజమాన్యానికి కార్మికశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పనిలో నుండి తీసివేయకూడదంటూ కాగ్నిజెంట్ యాజమాన్యానికి కార్మికశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఎనిమిది మంది కాగ్నిజెంట్ ఉద్యోగులు రాష్ట్ర కార్మికశాఖను ఆశ్రయించడంతో ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీచేశారు.

కాగ్నిజెంట్ నుండి పెద్ద ఎత్తును ఉద్యోగాల నుండి తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇటీవలనే కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజీవ్ మెహాతా ఉద్యోగులకు ఓ మెయిల్ పంపాడు.

<strong>టెక్కీలకు శుభవార్త: కాగ్నిజెంట్ లో ఉద్యోగాల కోతలేదు, కొత్తగా నియామకాలు: రాజీవ్</strong>టెక్కీలకు శుభవార్త: కాగ్నిజెంట్ లో ఉద్యోగాల కోతలేదు, కొత్తగా నియామకాలు: రాజీవ్

ఉద్యోగులను తొలగిండచడం లేదంటూ ఆ మెయిల్ లో ప్రకటించాడు. అంతేకాదు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు నిర్వహించనున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది.

<strong>ఇండియన్ టెక్కీలకు షాకిచ్చిన కాగ్నిజెంట్, కారణమిదే!</strong>ఇండియన్ టెక్కీలకు షాకిచ్చిన కాగ్నిజెంట్, కారణమిదే!

అయితే ఇప్పటికే కొందరికి కంపెనీ పింక్ స్లిప్ లను జారీ చేసిందనే ప్రచారం కూడ ఉంది.అయితే కొందరు ఉద్యోగులు ఈ విషయమై కార్మికశాఖను ఆశ్రయించారు.

ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కాగ్నిజెంట్ కు కార్మికశాఖ ఆదేశాలు

ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కాగ్నిజెంట్ కు కార్మికశాఖ ఆదేశాలు

ఏకపక్షంగా తమను ఉద్యోగాల నుండి తొలగించేందుకుగాను కాగ్నిజెంట్ ప్రయత్నిస్తోందని ఎనిమిదిమంది ఉద్యోగులు కార్మికశాఖను ఆశ్రయించారు. పనితీరు బాగోలేదనే పేరుతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకొందని ఉద్యోగులు పదిరోజుల క్రితం కార్మికశాఖను ఆశ్రయించారు.తీసివేతలు ఆపి వీరితో విడివిడిగా మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కార్మికశాఖాధికారులు కాగ్నిజెంట్ మేనేజ్ మెంట్ ను ఆదేశించాయి.

మరో అవకాశం కల్పించాలి

మరో అవకాశం కల్పించాలి

ఉద్యోగుల పనితీరుకు సంబంధించి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకుగాను మరో అవకాశాన్ని కల్పించాలని కాగ్నిజెంట్ మేనేజ్ మెంట్ కు కార్మికశాఖ ఆదేశాలు జారీ చేసింది.తమ ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని కార్మికశాఖ కాగ్నిజెంట్ మేనేజ్ మెంట్ ను హెచ్చరించింది.సమస్యను పరిష్కరించుకోకపోతే నష్టమని హితవు పలికింది. ఉద్యోగులు మరోసారి తమకు ఫిర్యాదుచేస్తే పారిశ్రామిక వివాదాల చట్టం కింద చర్యలు తీసుకొంటామని కార్మికశాఖ హెచ్చరించింది.

తొందరపడి రాజీనామా చేయవద్దు

తొందరపడి రాజీనామా చేయవద్దు

తొందరపడి రాజీనామా చేయకూడదని కాగ్నిజెంట్ ఉద్యోగులకు కార్మికశాఖ సూచించింది.కంపెనీ బలవంతంగా ఉద్యోగులను తొలగించినప్పుడు తమకు ఫిర్యాదుచేయాలని ఉద్యోగులకు సూచించింది.అయితే కాగ్నిజెంట్ నుండి పెద్ద ఎత్తును ఉద్యోగులపై వేటు పడుతోందనే ప్రచారం సాగుతున్న తరుణంలో కార్మికశాఖ తీసుకొన్న నిర్ణయం ఒక రకంగా ఉద్యోగులకు మేలు చేసేదిగా ఉంది.

ఐటీ ఉద్యోగులకు ఊరట

ఐటీ ఉద్యోగులకు ఊరట

కాగ్నిజెంట్ ఉద్యోగులకు కార్మికశాఖ నుండి ఊరట లభించడంతో మరిన్ని ఐటీ కంపెనీల ఉద్యోగులు కూడ కార్మికశాఖను ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. ఇది ఐటీ ఉద్యోగులకు పెద్ద ఊరట. తీసివేతల భయం ఉన్న ప్రతి ఐటీ ఉద్యోగి ఇక నిర్భయంగా కార్మికశాఖ అధికారులను ఆశ్రయించవచ్చని ఐటీ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే కార్మికశాఖ దగ్గర చుక్కెదురైనా, ఉద్యోగుల తొలగింపు కోసం ఐటీ కంపెనీలు కొత్తగా మరిన్ని వ్యూహాలు అనుసరించే అవకాశం లేకపోలేదు.

English summary
Don't cut off employees ordered Labour department to Cognizant. Eight employees approached to labour department ten days back, please give them another opportunity for employees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X