వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రేవంత్‌కు ఎందుకంత ప్రాధాన్యత? ఆ మచ్చ మనకెందుకు?’: చేరికపై కాంగ్రెస్‌లో రచ్చ

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ నేతలు మాత్రం కొందరు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ వస్తున్న వార్తలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇక కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ నేతలు మాత్రం కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

రేవంత్‌కు ప్రాధాన్యతివ్వొద్దు..

రేవంత్‌కు ప్రాధాన్యతివ్వొద్దు..

ఈ నేపథ్యంలోనే కొందరు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే అరుణ, కోమటిరెడ్డి, బదర్స్, దామోదర లాంటి వారు మాత్రం రేవంత్ రెడ్డికి అధిక ప్రాధాన్యం ఇవ్వద్దని కాంగ్రెస్ పెద్దలకు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ప్రచార బాధ్యతలు గానీ, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి గానీ ఇవ్వవద్దని వారు కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జీ కుంతియాకు చెప్పినట్లు సమాచారం.

షరతుల్లేని చేరికే..

షరతుల్లేని చేరికే..


ఈ నేపథ్యంలో కుంతియా స్పందిస్తూ రేవంత్ రెడ్డిది షరతుల్లేని చేరికేనని స్పష్టం చేశారు. అంటే రేవంత్ రెడ్డికి ఏ పదవి ఇవ్వకుండానే పార్టీలో చేర్చుకుంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, తనతోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరేవారే జాబితాను కూడా రేవంత్.. కాంగ్రెస్ పెద్దలకు అందజేసినట్లు సమాచారం.

వ్యతిరేకులతో రేవంత్ భేటీలు..

వ్యతిరేకులతో రేవంత్ భేటీలు..

ఇది ఇలా ఉండగా, తనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు. గురువారం రోజు కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణను కలిసిన రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. తన చేరికపైనే కీలకంగా చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా శుక్రవారం కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలను రేవంత్ కలవనున్నారు.

కాంగ్రెస్‌కు రేవంత్ అవసరం లేదు..

కాంగ్రెస్‌కు రేవంత్ అవసరం లేదు..

కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అవసరం లేదని.. రేవంత్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ అవసరముందని పార్టీ అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు వివరించినట్లు తెలిసింది. కుంతియాను గురువారం తెలంగాణ నేతలు కలిసి తమ వాదనను వినిపించారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైనట్లేనని తెలుస్తోంది.

నేనే సూచించా..

నేనే సూచించా..

కాగా, కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ వీహెచ్‌ మాత్రం రేవంత్‌ను కాంగ్రెస్‌లో చేరాలని తానే సూచించానన్నారు. రాహుల్ తో రేవంత్ భేటీ వాస్తవమేనంటున్న వీహెచ్ కాంగ్రెస్ లో చేరితే రేవంత్ తో పాటు పార్టీకి కూడా లాభం చేకూరుతుందన్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరితే మొదట్లో కాస్త ఇబ్బందులు వచ్చినా ఆ తర్వాత అన్నీ సర్దుకుంటాయన్నారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా రేవంత్‌ రాకను స్వాగతిస్తానన్నారు.
తమ పదవులకు గండం అనుకునే వాళ్లే రేవంత్‌రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ మచ్చ మనకెందుకు?

ఆ మచ్చ మనకెందుకు?

అయితే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే రేవంత్‌రెడ్డి చేరికపై తనకేమీ తెలియదని మరోసారి స్పష్టంచేశారు. అయితే రేవంత్‌రెడ్డి పార్టీలో చేరితే కాంగ్రెస్ కే మంచిదని కొందరు వాదిస్తుంటే.. కొత్తగా వచ్చే వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని మరికొందరు అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు. అంతేగాక, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ పార్టీలోకి వస్తే ఆ మచ్చ కాంగ్రెస్‌కు అంటుకుంటుందని వాదిస్తున్నారు.

మరోసారి ఢిల్లీకి..

మరోసారి ఢిల్లీకి..

ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. సోమ లేదా మంగళవారాల్లో ఢిల్లీ వెళ్తారంటున్న రేవంత్ సన్నిహితులు‌ మళ్లీ రాహల్‌గాంధీతో భేటీకానున్నట్లు చెబుతున్నారు. వరంగల్‌ లేదా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి కాబోయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం.

English summary
Some Telangana Congress leaders said to their high command that don't give more importance to MLA Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X