వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ వ‌నంలో దారి త‌ప్పిన దానం..! గ‌మ్యం తెలియ‌క తిక‌మ‌క‌..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : తెలంగాణ రాఫ్ట్ర స‌మితి పార్టీలోకి ఎంత తోపు నాయ‌కుడు వెళ్లినా నామ మాత్ర‌పు పాత్ర‌పోషించాల్సిందే..! అప్ప‌టి వ‌ర‌కూ ఆ పార్టీలో కీల‌క నేత‌గా చ‌క్రం తిప్పినా, గులాబీ కండువా క‌ప్పుకోగానే కోడెనాగు ప‌డ‌గ‌మీత తెల్ల ఈత‌ర కొమ్మ పెట్టిన‌ట్టు చ‌ల్ల‌బ‌డిపోవాల్సిందే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ లో కీలక నేత‌లుగా ఎదిగి టీఆర్ఎస్ పార్టీ వెళ్లిన నాయ‌కులే కాకుండా ఇత‌ర పార్టీల నుండి వెళ్లిన నాయ‌కులు కూడా అస‌లు పార్టీలో ఉన్నారా? లేరా అన్న‌ట్టు ఉండిపోతారు. గులాబీ తీర్థం పుచ్చుకోగానే చాలా మంది నేత‌ల చురుకుద‌నం మోడువారిపోతుంది. టీఆర్ఎస్ పార్టీలోకి చేరేముందు ఒక లెక్క, చేరిన త‌ర్వాత కేసీఆర్ లెక్క అన్న‌ట్టు వ్య‌వ‌హారం ఉంటుంద‌ని చాలా సంఘ‌ట‌న‌లు రుజువు చేసాయి.

పార్టీలో చేరేముందు ఒక లెక్క‌..! చేరిన త‌ర్వాత కేసీఆర్ లెక్క‌..!!

పార్టీలో చేరేముందు ఒక లెక్క‌..! చేరిన త‌ర్వాత కేసీఆర్ లెక్క‌..!!

ఎంత తోపైనా అదికార పార్టీలో చేరితే అణిగి ఉండాల్సిందే..! పార్టీలో చేరేముందు ఒక లెక్క‌..చేరిన త‌ర్వాత కేసీఆర్ లెక్క‌..!! ఎలాంటి హామీతో అదికార పార్టీలో చేరారో అవ‌న్నీ కూడా కండువా క‌ప్పుకున్న మ‌రుక్ష‌ణం మ‌టుమాయం అయిపోతాయి. చాలా మంది ఎమ్మెల్యేల‌ను, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధుల‌ను పార్టీలో చేర్చుకున్నాక హామీల సంగతి త‌ర్వాత., అస‌లు త‌గిన ప్ర‌ధాన్య‌త కూడా దొర‌క‌ద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న దానం నాగేంద‌ర్ గులాబీ పార్టీలోకి వెళ్లి తన రాజ‌కీయ ప్ర‌స్థానాన్నే అయోమ‌యంలోకి నెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. నాగేంద‌ర్ ఏ హామీతో గులాబీ కండువా క‌ప్పుకున్నారు..? ఇప్పుడు ఎదురౌతున్న ప‌రిస్థితులు ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

కేసీఆర్ ఎత్తుకు చిత్తైన దానం..! టిక్కెట్ ఎక్క‌డో తేల్చ‌ని గులాబీ బాస్..!

కేసీఆర్ ఎత్తుకు చిత్తైన దానం..! టిక్కెట్ ఎక్క‌డో తేల్చ‌ని గులాబీ బాస్..!

దానం నాగేంద‌ర్ ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారిందనే చ‌ర్చ ప్ర‌గ‌తిభ‌వ‌న్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతోంది. కేసీఆర్ వేసిన ఎత్తుకు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడ‌ట దానం. ఎంతైనా కేసీఆర్ వ్యూహ‌ర‌చన ప్ర‌త్య‌ర్థి వ‌ర్గంపై పైచేయి సాధించేందుకు వేసే ఎత్తుగ‌డ‌లు అర్ధం చేసుకోవ‌టం చాలా క‌ష్టం. అందుకే అన్ని పార్టీలు ఏకం కావాల్సి వ‌చ్చింది. అయినా ఏదోమూల‌న అంద‌రిలోనూ భ‌యం. ఎందుకంటే, కేసీఆర్ త‌న మాట‌ల‌తో మంత్రం వేసి జ‌నాన్ని త‌న‌వైపు తిప్పుకోగ‌ల స‌మ‌ర్థ‌త ఉన్న నేత‌. అటువంటి నాయ‌కుడిని నోటికొచ్చిన‌ట్టు తిట్టి, నానాయాగీ చేస్తే ఊరుకుంటాడా..? అందుకే దానం నాగేంద‌ర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని బోదించి, గాలాబీ పార్టీలో స‌ముచిత స్థానం క‌ల్పిస్తాన‌ని న‌మ్మించి త‌న‌వైపు లాక్కున్నాడు చంద్ర‌శేఖ‌ర్ రావు. ఆ త‌ర్వాత క‌థ ష‌రా మామూలే..

సిటీలో ఏ సీటు ఏద‌డిగినా ఇచ్చేందుకు రెఢీ..! ఒక్క ఖైరాతాబాద్ త‌ప్ప‌..!!

సిటీలో ఏ సీటు ఏద‌డిగినా ఇచ్చేందుకు రెఢీ..! ఒక్క ఖైరాతాబాద్ త‌ప్ప‌..!!

అదీ ఎన్నిక‌ల ముందు సీటు నీకే అంటూ తాయిలం వేసి మ‌రీ దానం నాగేంద‌ర్ ను త‌మ పార్టీలోకి లాక్కున్నాడు చంద్ర‌శేఖ‌ర్ రావు. అంతే.. ఇదంతా త‌న మీద ప్రేమ‌, త‌న స‌మ‌ర్థ‌త‌పై న‌మ్మ‌కం అంటూ దానం నాగేంద‌ర్ గులాబీ కండువా క‌ప్పుకోగానే ఒడ‌సిప‌ట్టి తాళం బిగించాడు కేసీఆర్. ఇంకేముంది, మొద‌టిసీటు త‌న‌కేనంటూ పొంగిపోయిన దానం.., త‌న‌ పేరు 105 మందిలో లేక‌పోవ‌టంతో ఉల‌క్కిప‌డ్డాడ‌ట పాపం దానం. ఆయ‌న‌కు సీటిస్తే మేమేం చేయాలంటూ ఇప్ప‌టికే ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గంపై గంపెడాశ‌లు పెట్టుకున్న నేత‌లంతా కేసీఆర్ వ‌ద్ద మొర‌పెట్టుకున్నార‌ట‌. అందుకే గోషామ‌హ‌ల్‌, జూబ్లీహిల్స్‌, అంబ‌ర్‌పేట అంటూ దానం నాగేంద‌ర్ కు మూడు అవ‌కాశాలు ఇచ్చార‌ట‌. ఎందుకంటే, ఆ మూడింటిలో ఎక్క‌డ గెలిచినా చారిత్రాత్మ‌కం అవుతుంది కాబ‌ట్టి.

పార్టీలో చేరిన త‌ర్వాత మాట‌లుండ‌వ్..! అన్నీ కేసీఆర్ చూసుకుంటాడు..!!

పార్టీలో చేరిన త‌ర్వాత మాట‌లుండ‌వ్..! అన్నీ కేసీఆర్ చూసుకుంటాడు..!!

ఎందుకంటే, జూబ్లీహిల్స్ ఆల్రెడీ మాగంటి గోపీనాధ్ ఉన్నాడు. గోషామహ‌ల్ బీజేపీ కోట‌. అంబ‌ర్‌పేట కిష‌న్‌రెడ్డి ఇలాఖా, ఇక మిగిలింది ఉప్ప‌ల్‌.. ఇవ‌న్నీ దానం నెగ్గేందుకు క‌ష్ట‌మైన ప్రాంతాలు కాద‌ని ఖైర‌తాబాద్ ఇస్తే టీఆర్ఎస్ కేడర్ ఝ‌ల‌క్ ఇస్తుంది. ఇక పీజేఆర్ కూతురు విజ‌యారెడ్డి వ‌ర్గం చుక్క‌లు చూపుతుంది. ఇటువంటి నేప‌థ్యంలో దానం ప్లేసు ఎక్క‌డ‌నేది తెలియ‌కుండా ఉంది. ఎక్క‌డ సీటు కేటాయించినా దానం గెల‌వ‌గ‌ల‌డంటూ ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వ‌ర‌కూ ఓకే కానీ ఇప్పుడు కారుపై వ్య‌తిరేక‌త ఉన్న స‌మ‌యంలో అదీ, సొంత‌గూటిలోనే ఇటు వైరివ‌ర్గంతో నెగ్గి, అటు ఎన్నిక‌ల్లో గెల‌వ‌గ‌ల‌డా అనేది దానం నాగేంద‌ర్ పై ఉన్న సందేహం.

English summary
in telangana still keeping danam nagender into confusion. kcr not declaring danam nagender constituency. danam nagender in dialama that from which constituency he has to contest in next elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X