వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీ మృతి: తెలుగు మాట్లాడొద్దు, వాదనకు దిగొద్దు.. ఇలా చేయండి

అమెరికాలో హెచ్చు మీరుతున్న జాతి విద్వేషం నేపథ్యంలో అక్కడున్న తెలుగు సంఘాలు తెలుగువారిని అప్రమత్తం చేస్తున్నాయి. మనం జాగ్రత్తలో మనం ఉందామని చెబుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: అమెరికాలో హెచ్చు మీరుతున్న జాతి విద్వేషం నేపథ్యంలో అక్కడున్న తెలుగు సంఘాలు తెలుగువారిని అప్రమత్తం చేస్తున్నాయి. మనం జాగ్రత్తలో మనం ఉందామని చెబుతున్నాయి.

విదేశీయులతో గొడవలు వద్దని, అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో భయం సహజమేనని చెబుతున్నారు. తానా, టాటా, ఆటా వంటి సంస్థలు తెలుగువారిని అప్రమత్తం చేస్తున్నాయి.

కూచిబొట్ల శ్రీనివాస్ హత్యను ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) తీవ్రంగా ఖండించింది. మనమంతా ఒక్క తాటి పైన ఉండాలని ఆటా పిలుపునిస్తోంది.

<strong>టెక్కీ శ్రీనివాస్ భార్య సూటి ప్రశ్న: 'ట్రంప్‌కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'</strong>టెక్కీ శ్రీనివాస్ భార్య సూటి ప్రశ్న: 'ట్రంప్‌కేం సంబంధం, ఇంతకుమించి మాట్లాడను'

'Don't talk regional languages in US'

అక్రమ వలసదారులను వెనక్కి పంపాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలతో ఆ దేశంలో ఉంటున్న విదేశీయులకు ఆందోళన సహజమేనని, జాతి విద్వేషం కారణంగా కాల్పులు జరుపుతారన్న భయమూ ఉంటుందని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మన జాగ్రత్తలో మనం ఉందామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రతినిధులు తెలుగురాష్ట్రాల వారికి సూచించారు.

కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్య నేపథ్యంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటున్న తెలుగు వారిని భయపడొద్దంటూ స్థానిక తానా శాఖల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

మాతృభాషలు బహిరంగంగా మాట్లాడవద్దు

అమెరికాలోని బహిరంగ ప్రదేశాల్లో హిందీ లేదా ఇతర భారతీయ మాతృభాషలను ఎవరూ మాట్లాడవద్దని, అవే మిమ్మల్ని కొన్నిసార్లు ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదముందని అక్కడ నివసిస్తున్న తెలుగువాళ్లను సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

<strong>తెలుగు టెక్కీలను వీసాలపై అడిగాడు: తర్వాత కాల్చాడు</strong>తెలుగు టెక్కీలను వీసాలపై అడిగాడు: తర్వాత కాల్చాడు

బహిరంగ ప్రదేశాల్లో ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనే దానికి సంబంధించిన కొన్ని సూచనలు తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్ (టీఏటీఏ) జనరల్‌ సెక్రటరీ విక్రమ్‌ జంగమ్‌ చెప్పారు.

వాదనకు దిగవద్దు

అమెరికాలో ఉండే ఎన్నారైలు, మరీ ముఖ్యంగా తెలుగువాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ కొన్ని సూచనలు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఎవరితోను వాదనకు దిగవద్దని, కొంతమంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తారని, వాటిని సాధ్యమైనంత వరకు నివారించాలని, ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోవాలని సూచించారు.

ఎక్కువ శాతం మంది తెలిసినవాళ్ల దగ్గర మాతృభాష మాట్లాడటానికి ఇష్టపడతారని, కానీ అలా చేయవద్దని, బహిరంగ ప్రదేశాల్లో ఇంగ్లీషులోనే మాట్లాడుకోవాలని, కొన్ని ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం, అక్కడ ఉండటం చేయవద్దని, ఏదైనా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ఆలస్యం చేయకుండా 911కి ఫోన్‌ చేసి సహాయం కోరాలని సూచిస్తున్నారు. భద్రతా సిబ్బంది సహాయం చేస్తారన్నారు.

మీరున్న ప్రదేశం అనుమానాస్పదంగా ఏమైనా అనిపిస్తే అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. వీధుల్లో తెలియని అమెరికన్లతో ఎక్కువగా మాట్లాడవద్దని, ఆ ప్రదేశానికి, వ్యక్తులకు దూరంగా వెళ్లడమే సరైన మార్గమని చెబుతున్నారు.

English summary
The killing of Srinivas Kuchibhotla in a shooting incident in the US has shocked his family, while the parents of his friend, who was injured, plan to rush abroad to be by his side.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X