వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారా..! తాట తీస్తారు జాగ్రత్త..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : ఐటీ సంస్థల్లో పనిచేసే మహిళల భద్రతకు పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఐటీ ఉద్యోగినులను ఎవరైనా లైంగికండా వేదిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన మార్గాలను అణ్వేషిస్తున్నారు పోలీసులు. ఐటీ కంపెనీల్లో మహిళా ఉద్యోగులకు మార్గదదర్శక్‌లు అండగా ఉన్నారని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల బారిన పడుతున్న బాధిత మహిళలకు రక్షణ కల్పిస్తున్నారు. వారి పనితీరును రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ప్రశంసించారు. నేరేడ్‌మెట్‌లోని కమిషనరేట్‌లో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో మార్గదర్శక్‌లతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీఎస్సీ ఐటీ కంపెనీల్లో మహిళల భద్రతకు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా లైంగిక వేధింపులకు గురవుతున్న బాధిత మహిళలకు అండగా ఉండటానికి, వారి తరఫున పోలీసులతో మాట్లాడి ఫిర్యాదుతోపాటు, నిందితులపై చర్యలు తీసుకునేలా కృషి చేయడానికి ప్రతి కంపెనీలో కొందరు మహిళా ఉద్యోగులను ఎంపిక చేసి మార్గదర్శక్‌లుగా నియమించారు.

dont tease lady IT employees.!Rachakonda commissionarate so serious..!!

ఇక ఉద్యోగం చేసే ప్రదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా బాధిత మహిళలు మార్గదర్శక్‌ల సహకారంతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వీరి సహకారంతో అనేక కేసులు వెలుగులోకి వచ్చాయని సీపీ తెలిపారు. పనితీరు కనబర్చిన మార్గదర్శక్‌లకు ధ్రువపత్రాలు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు, సైకాలజిస్టులు, భూమిక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు మహిళా చట్టాలు, కొత్తగా వచ్చిన మార్పులు, బాధితులు పోలీసులను సంప్రదించాల్సిన తీరు, షీటీమ్స్‌ పనితీరుతోపాటు ఉమెన్‌ సేఫ్టీ, ట్రాఫిక్‌, సైబర్‌ సెక్యూరిటీపై మరింత అవగాహన కల్పించారు. ఎస్సీఎస్సీ జనరల్‌ సెక్రటరీ కృష్ణ ఏదుల, జాయింట్‌ సెక్రటరీ, ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ అధికారి ప్రత్యూష శర్మ, మార్గదర్శక్‌ లీడర్‌ పద్మప్రియ, షీటీమ్స్‌ ఏడీసీపీ సలీమ, భూమిక స్వచ్చంద సంస్థ నిర్వాహకులు సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

English summary
There are guidelines for female employees in IT companies and care for women suffering from sexual abuse at work places. Mahesh Bhagwat appreciated Marg darshak's efforts performance. The meeting was organized by the Society for Cyberabad Security Council (SCSC) at the Commissionerate at Naredmett.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X