వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే... తీవ్ర ఆందోళన ... అఖిలపక్ష బీసీ నాయకులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కోటాను తగ్గించకుండా ఎప్పటిలాగే కొనసాగించాలని తెలంగాణ బీసీ సంఘం అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలయ్యో రిజర్వేషన్‌లపై చర్చించేందుకు రాష్ట్రానికి చెందిన అఖిల పక్ష పార్టీల నేతలు సమావేశం అయ్యారు. కాగా ఈ సమావేశంలో కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ,తోపాటు తేజస, నేతలతోపాటు సినినటుడు సుమన్ పాల్గోన్నారు.

కాంగ్రెస్ పార్టీ నుండి పాల్గోన్న ఎమ్మల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సాకుతో తెలంగాణ సీఎం కేసిఆర్ బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తున్నాడని ఆయన అన్నారు.ప్రస్తుతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించి భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు కేసీఆర్‌ ప్రణాళిక రచిస్తున్నారన్నారు.ఇక రాష్ట్రంలో పలు కొత్త జిల్లాలు ఏర్పడిన అక్కడ రిజర్వేషన్లు అమలు కావడం లేదని అన్నారు.

dont reduce the BC reservation in the municipal elections :BC leaders

ఇక రానున్న ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తేనే భవిష్యత్ రాజకీయాల్లో నాయకులు పుట్టుకొస్తారని ప్రో.కోదండరాం అన్నారు.బీసీలకు 45 రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన సీఎం ప్రస్థుతం దాన్ని 34శాతానికి తగ్గిస్తున్నారని విమర్శలు చేశారు.ఇక సిని నటుడు సుమన్ మాట్లాడుతూ...కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు బీసీలందరికీ ఒకే రకమైన రిజర్వేషన్ ఉండేలా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీలు వివిధ రాష్ట్రాల్లో వివిధ రిజర్వేషన్లలో ఉన్నారని అన్నారు. దీంతో వారిలో గందరగోళం ఏర్పడిందని అన్నారు.

English summary
Telangana BC Alliance Party leaders have demanded the government to keep the BC reservation quota in Telangana Municipal Elections as usual.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X