• search
  • Live TV
సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

10, 20కి చీరలు.. అవన్నీ ట్రిక్కులు.. మీ ప్రాణాలకు ప్రమాదం అక్కలు (స్పెషల్ స్టోరీ)

|

పెద్దపల్లి : ఆఫర్లంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. ధర తక్కువ అంటే అవసరమున్నా, లేకున్నా కొనేస్తారు. అది మానవ నైజం. అలా కేవలం 10, 20 రూపాయలకే చీరలు ఇస్తామంటే ఇంకేమన్నా ఉందా. పనులన్నీ మానుకుని పోలోమంటూ ఆ షాపుల ముందు వాలిపోతారు మహిళలు. అయితే అదంతా వ్యాపారుల మాయజాలమని తెలియక తిప్పలు పడతారు. తాజాగా పెద్దపల్లిలో 20 రూపాయలకే చీర ఇస్తామంటూ ఓ బట్టల దుకాణం నిర్వాహకులు ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దాంతో తొక్కిసలాట జరిగి ఇబ్బందులకు గురయ్యారు. ఆఫర్లంటూ వ్యాపారులు చేస్తున్న చీప్ ట్రిక్కులపై వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కథనం.

ఆయన రాజ్యసభ పేదోడా?.. 'సంతోషా' నికి మిడ్ మానేరు భూములా?ఆయన రాజ్యసభ పేదోడా?.. 'సంతోషా' నికి మిడ్ మానేరు భూములా?

 20కే చీర.. తోపులాట

20కే చీర.. తోపులాట

పెద్దపల్లిలో 20 రూపాయలకే చీర ఇస్తామనే ప్రకటన తొక్కిసలాటకు దారి తీసింది. ఓ బట్టల దుకాణం నిర్వాహకులు చేసిన మార్కెటింగ్ మాయాజాలానికి మహిళలు తిప్పలు పడ్డారు. అవన్నీ ట్రిక్కులు అని తెలియక బారులు తీరి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు. పెద్దపల్లిలో నివసించే స్థానికులే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఆ దుకాణం దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

దుకాణం తెరిచేంత వరకు సహనంతో దాదాపు కిలోమీటర్ మేర క్యూ కట్టిన మహిళలు.. షాపు తెరిచాక ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఒకరిని ఒకరు తోసుకోవడంతో తోపులాటకు దారి తీసింది. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన నిర్వాహకులు విఫలమై చివరకు దుకాణం మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 3 రూపాయల చీర లేదు.. 300 కూలీ పోయే..!

3 రూపాయల చీర లేదు.. 300 కూలీ పోయే..!

వరంగల్‌లోనూ ఇదివరకు ఇలాంటి సిట్యువేషన్ కనిపించింది. 2018, సెప్టెంబర్ చివరి మాసంలో వరంగల్ చౌరస్తాలోని ఓ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఇలాంటి చీప్ ట్రిక్ ప్రయోగించారు. కేవలం 3 రూపాయలకే చీర అంటూ.. అది కూడా మూడు రోజులు మాత్రమే ఆఫరంటూ జనాలను ఊరించారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఆ చీరలు ఇస్తామంటూ ప్రకటించారు. దాంతో వరంగల్ నుంచే కాకుండా చుట్టుపక్కల నుంచి పెద్దఎత్తున జనాలు తరలివచ్చారు.

మూడు రూపాయల చీర ఆఫర్‌తో ఆ ప్రాంతమంతా మహిళలతో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుకాణం తెరవక ముందే భారీ సంఖ్యలో క్యూ కట్టారు. షాపు తెరిచి తెరియగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. వాళ్లను కంట్రోల్ చేయడం కుదరలేదు. దాంతో దుకాణం మూసేశారు. 3 రూపాయలకు చీర ఇస్తామని పిలిచి.. మాకు 300 రూపాయల కూలీ పోయేలా చేస్తారా అంటూ కొందరు శాపనార్థాలు పెట్టారు.

చీప్ పబ్లిసిటీ స్టంట్.. సందట్లో సడేమియాలా దొంగలు

చీప్ పబ్లిసిటీ స్టంట్.. సందట్లో సడేమియాలా దొంగలు

సిద్దిపేటలో కూడా ఇలాంటి చీప్ పబ్లిసిటీకి తెర తీశారు పెద్ద బట్టల దుకాణపోళ్లు. ఫిబ్రవరి రెండో వారంలో కేవలం 10 రూపాయలకే చీర అంటూ ఆఫర్ ప్రకటించింది సీఎంఆర్ షాపింగ్ మాల్. చీరల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగి వాళ్లు కట్టుకున్న చీరలు చినిగిపోయిన పరిస్థితి కనిపించింది. క్యూ కట్టిన మహిళలంతా ఒక్కసారిగా తోసుకురావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరవై మంది వరకు గాయాలపాలయ్యారు.

సందట్లో సడేమియాలా దొంగలు రెచ్చిపోయారు. మహిళల మెడల్లో నుంచి నగలు ఎత్తుకెళ్లారు. దాదాపు ఐదు తులాల వరకు బంగారు ఆభరణాలు చోరీకి గురయినట్లు వార్తలొచ్చాయి. ఆ 10 రూపాయల చీర దొరక్క.. కట్టుకున్న చీర చినిగిపోయి.. మెడలో నగలు కూడా మాయం కావడం గమనార్హం.

ఈ లెక్కలు చూడండి.. లాజిక్కు తెలుసుకోండి

ఈ లెక్కలు చూడండి.. లాజిక్కు తెలుసుకోండి

ఇలాంటి పిచ్చి పిచ్చి ఆఫర్లతో జనాలు చిన్న లాజిక్ మిస్సవుతున్నారు. డబ్బులు ఊరికే రావు అనే ఓ జ్యువెల్లర్స్ యాడ్‌కు ప్రత్యామ్నాయంగా.. ఎన్నో పేరడీ క్లిప్పులు వచ్చినా.. జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. వాస్తవానికి వందల రూపాయల ధర పలికే చీరను.. వాళ్లు అతి తక్కువ ధరలకు ఎలా ఇస్తారు.. ఎందుకిస్తారు. దుకాణం పెట్టుకున్నోడు నష్టపోడు కదా. ఒకవేళ ఇచ్చారనుకుందాం. 200 రూపాయల చీరను వేయి మందికి అమ్మితే.. 2 లక్షలు వస్తాయి. అవే చీరలను 20 రూపాయలకు అదే వేయి మందికి ఆఫర్ మీద అమ్మితే.. 20 వేల రూపాయలు వస్తాయి. అంటే లక్షా 80 వేలు మాత్రమే వాళ్లకు నష్టం. అదే ప్రముఖ దినపత్రికలో ఫుల్ పేజీ యాడ్ ఇవ్వాలంటే లక్షల్లో ఉంటుంది. ఇక్కడే అసలు ట్రిక్కు ఉపయోగిస్తున్నారు వ్యాపారస్తులు.

ఆఫర్ పేరుతో తమ దుకాణానికి వేయి మంది వచ్చారంటే.. వారి బంధుమిత్రులకు, ఇరుగుపొరుగుకు అలా అంతా కలిపి దాదాపు లక్ష మంది వరకు ఆ షాపు గురించి పబ్లిసిటీ వస్తుంది. అదే పేపర్‌లో ఫుల్ పేజీ యాడ్ ఇస్తే ఎంతమంది చూడగలుగుతారు. ఇక టీవీల్లో యాడ్స్ ఇస్తే కచ్చితంగా ఆ ప్రకటన వచ్చే సమయానికి జనాలు చూస్తారా లేదా అన్నది సంశయమే. ఇక 200 రూపాయల చీరలు ఇవ్వకుండా.. లో క్వాలిటీ చీరలు ఇస్తే షాపు వాళ్లకు ఇంకా అధిక లాభమే కలుగుతుంది తప్ప నష్టం ఏమాత్రం ఉండదు.

 చీప్ చీరల కోసం క్యూ ఎందుకు..! మీ డబ్బులతో మంచి చీరలు..!

చీప్ చీరల కోసం క్యూ ఎందుకు..! మీ డబ్బులతో మంచి చీరలు..!

ఇక 10, 20 రూపాయలకు ఇచ్చే చీరలు అంత నాణ్యతగా ఉండవు. ఒక్కసారి కట్టుకుంటే చాలు.. ఆ చీర చినిగి చాటవుతుంది. కొంతమంది తాము చేసే పనులు వదులుకుని అక్కడ క్యూ కడతారు. తీరా చీర దొరకక తిట్టుకుంటూ పోతారు. ఒకవేళ రోజు కూలీ 300 రూపాయలు వస్తుందనుకుంటే.. అవే డబ్బులతో మంచి చీర కొనుక్కోవచ్చు కదా.. అటు ఆ 10,20 రూపాయల చీర దొరక్కపోగా.. ఇటు కూలీ పోయి ఎంత నష్టం జరుగుతుంది. ఈ సింపుల్ లాజిక్ గ్రహిస్తే.. ఎంత తోపు షోరూమ్ వాడు ఇలాంటి చెత్త ఆఫర్లు పెట్టినా జనాలు వెళ్లకుండా ఉంటారేమో.

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్.. ముగ్గురు అధికారులకు జైలు..!తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు మరో షాక్.. ముగ్గురు అధికారులకు జైలు..!

English summary
Saree Show Room owners playing cheap tricks with offering sarees for low cost as ten and twenty rupees. That is publicity stunt not an public welfare angle. Show room owners reduce the marketing cost and they got free publicity with this low cost saree offers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X