వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూట్లతో వస్తే గ్రూప్ 2 పరీక్షలకు అనుమతివ్వం:పబ్లిక్ సర్వీస్ కమీషన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:నవంబర్ 11,13 తేదిల్లో గ్రూప్ 2 పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ప్రత్యేకంగా సూచనలను చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్.

గ్రూపు 2 1032 పోస్టులకు పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు నవంబర్ 11,13 తేదిల్లో రాతపరీక్షలను నిర్వహిస్తోంది పబ్లిక్ సర్వీస్ కమీషన్.రికార్డు స్థాయిలో 7,89.985 మంది దరఖాస్తు చేసుకొన్నారు. రాష్ట్రంలో 1,911 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిది పబ్లిక్ సర్వీస్ కమీషన్.

dont wear shoes go to write grops2 exam:tspsc

పోటీ ఎక్కువగా ఉన్న ఈ పరీక్షల్లో పకడ్బందీగా పరీక్షల నిర్వహాణకు గాను పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాట్లు చేస్తోంది.. పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రత్యేకంగా సూచలను విడుల చేసింది పబ్లిక్ సర్వీస్ కమీషన్.బూట్లు,నగలు,చెవి పోగులు, చేతి గడియారాలు ధరించి పరీక్షహాల్ లో కి రాకూడదని అభ్యర్థులను కోరింది.ఒకవేళ అలాంటి వాటిని ధరించి పరీక్షహాలులోకి వచ్చినా అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, లాగ్ టేబుల్స్, చేతి బ్యాగులు, పర్సులు, నోట్ బుక్స్, చార్టులు, రికార్డింగ్ పరికరాలకు అనుమతి లేదని పబ్లిక్ సర్వీస్ కమీషన్ తేల్చి చెప్పింది.

చేతి వేళ్ళపై గోరింటాకు, ఇంక్ వంటి లేకుండా చూసుకోవాలని సూచించింది.హాల్ టిక్కెట్టుతో పాటు గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమీషన్ సూచించింది.ఉదయం 9.45 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.45 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్షహాలులోకి అనుమతించనున్నట్టు ప్రకటించింది.తనిఖీ ప్రక్రియతో పాటు బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల వేలిముద్ర ఫోటో తీసుకొంటామని టిఎస్ పి ఎస్ పి సి ప్రకటించింది.

English summary
groups2 exams will be conduct nov 11,13 , 2016 said telangana public service commission.who attend this exams dont wear shoes said tspsc. jewellery,watches,ear rings,electronic gadgets,log books,hand books purse,recording instruments also said tspsc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X