• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇవాంకా టూర్: డేగ కళ్ల నిఘా, సదస్సు ప్రాంగణం, బస అన్నీ.. యూఎస్ సెక్యూరిటీ చేతుల్లోకి...

By Ramesh Babu
|

హైదరాబాద్‌: ఈనెల 28 నుంచి మూడురోజులపాటు నగరంలో జరగనున్న గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పాల్గొంటున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు ముమ్మరం సాగుతున్నాయి.

రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..

ఇవాంకా కు సంబంధించిన భద్రతా చర్యల్లో భాగంగా అమెరికా నుంచి తెచ్చుకునే ఆయుధాలకు అనుమతి కోరుతూ అమెరికా భద్రతా విభాగం ఇప్పటికే మన కస్టమ్స్‌ అధికారులకు లేఖ కూడా రాసింది.

పోలీసుల అత్యుత్సాహం: బిచ్చగాళ్లనుకుని.., ఇవాంకా ట్రంప్ వస్తుంటే మాత్రం.. చూసుకోవక్కర్లా?

అటు అమెరికా భద్రతా విభాగం అయిన యూఎస్ సెక్యూరిటీ సర్వీసెస్‌తోపాటు మన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, , ఆక్టోపస్ కమాండోస్, గ్రేహౌండ్ సిబ్బంది.. హైదరాబాద్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోడీ, ఇవాంకాట్రంప్ సందర్శించే ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎంపిక చేసిన ప్రాంతాల్లో స్నిపర్ టీమ్‌‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు.

 అడుగడుగునా డేగ కళ్ల నిఘా...

అడుగడుగునా డేగ కళ్ల నిఘా...

నగరంలో ఇవాంకా పర్యటన సందర్భంగా పాత బస్తీలో 40 వేలకుపైగా సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. అలాగే అతిథులు బస చేసే హోటళ్ల వద్ద పోలీసు భద్రతను పటిష్ఠం చేస్తున్నారు. నెలరోజుల క్రితమే కొంతమంది అమెరికా పోలీసులు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక్కడే మకాం వేసి ఎస్పీజీ బలగాలతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలతో నిన్నట్నించే అంతర్గత సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్‌ నుంచి మాదాపూర్‌ వరకు, అటునుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌ వరకూ రిహార్సల్స్‌ కూడా నిర్వహించారు. భద్రతా చర్యలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్‌ కమిషనర్‌ సందీప్‌శాండిల్య సమీక్షిస్తున్నారు.

 ఒక్క ఐపీఎస్ అధికారి యూనిఫాంలో..

ఒక్క ఐపీఎస్ అధికారి యూనిఫాంలో..

ట్రంప్ కుమార్తె ఇవాంకా భద్రత విషయంలో అమెరికా భద్రతా విభాగం ముందునుంచీ అనేక సూచనలు చేస్తూ వస్తోంది. భద్రతా సిబ్బంది వద్ద ఆయుధాలు ఉంచరాదని, సమావేశ మందిరంలో తక్కువ సిబ్బందిని ఉంచాలనేవి వాటిలో ప్రధానమైనవి. ఇక, సమావేశ మందిరంలో ప్రతినిధులు కాకుండా సుమారు 50 మంది అత్యంత సుశిక్షితులైన సిబ్బంది భద్రతా విధుల్లో పాల్గొననున్నట్లు సమాచారం. వీరంతా సివిల్‌ డ్రెస్సుల్లోనే ఉంటారు. కేవలం ఒక్క ఐపీఎస్‌ అధికారి మాత్రమే పోలీస్‌ యూనిఫాంలో ఉండేందుకు అమెరికా అధికారుల నుంచి అనుమతి లభించింది. సమావేశ మందిరం బయట, సదస్సు జరిగే హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాల్లో వెయ్యి మంది పోలీసులు మోహరించనున్నారు.

 ప్రత్యేక వ్యక్తుల భద్రత వారిపైనే...

ప్రత్యేక వ్యక్తుల భద్రత వారిపైనే...

పోలీసులైనా సరే ఆయుధాలతో ఇవాంకా ట్రంప్ ముందుకు రాకూడదని అమెరికా పోలీసులు కండీషన్ పెట్టారనే అంశంపై ఓ డీసీపీ స్పందించారు. ఇటువంటి సదస్సుల్లో ప్రొటోకాల్‌కే ప్రాధాన్యం ఉంటుందని, ఆయుధాలు వాడరాదనే నిబంధన ఉండదన్నారు. అయితే ప్రత్యేక భద్రత ఉన్న వ్యక్తులకు సంబంధించి వారి ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పుడు.. భద్రత మొత్తం వారే చూసుకుంటారని, అలాంటి సమయంలో ఆయుధాలతో అవసరముండదని భావించి తామే వాటిని తీసుకెళ్లమని చెప్పారు. ప్రధాని, సీఎం భద్రతలకు కూడా ఇదే వర్తిస్తుందని ఆ డీసీపీ వ్యాఖ్యానించారు.

 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు...

సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు...

ఇవాంకా, ప్రధాని మోడీ రాకపోకలు సాగించే మార్గంలో సుమారు 20కిపైగా సమస్యాత్మక ప్రాంతాలు(బ్లాక్‌ స్పాట్స్‌)ను అధికారులు గుర్తించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఇవాంకా సుమారు 37 కి.మీ. రోడ్డుమార్గంలో ప్రయాణించనున్నారు. అక్కడ విస్తృతంగా సీసీ కెమెరాల ఏర్పాటు, తాత్కాలిక కంట్రోల్‌రూంతోపాటు సాంకేతికత, నిఘాకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇవాంకా.. చార్మినార్, లాడ్ బజార్, చౌహమల్లా ప్యాలెస్‌ను సందర్శించనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఒక్క తాజ్ ఫలక్‌నుమా ఏరియాలోనే దాదాపు 3500 మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగించనున్నారు. ఇక.. ఫలక్‌నుమా దగ్గర్లోని ఫాతిమా నగర్, ఫరూఖి నగర్, అల్ జుబేల్ కాలనీలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసే పనిలో పడ్డారు పోలీసులు.

 తొలిరోజు డిన్నర్‌ ఫలక్‌నుమాలోనే...

తొలిరోజు డిన్నర్‌ ఫలక్‌నుమాలోనే...

ట్రంప్ కుమార్తె ఇవాంకా తొలిరోజు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో, రెండో రోజు గోల్కొండలో డిన్నర్‌ చేయనున్నారు. తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఇవాంకా, ప్రధాని మోడీతోపాటు మొత్తం 1400 మంది ప్రతినిధులు 60 బస్సుల్లో ఫలక్‌నుమా ప్యాలె స్‌కు చేరుకుని అక్కడ డిన్నర్‌ చేయనున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్ లో నిజాం వంశీయుల కాలం నుంచి వస్తున్న ప్రత్యేక డిన్నర్‌ టేబుల్‌పై ఇవాంకా డిన్నర్‌ చేయనున్నారు. ఈ టేబుల్ పై ఒకేసారి 101 మంది భోజనం చేయొచ్చు. ఇవాంకా, ప్రధానితోపాటు మరికొందరు ప్రముఖులు ఇక్కడ విందు ఆరగించనున్నారు. ఇదే తరహాలో గోల్కొండలోనూ ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

 హోటళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు...

హోటళ్ల వద్ద ప్రత్యేక బందోబస్తు...

ఇవాంకా ట్రంప్ బస చేయనున్న వెస్టిన్‌ హోటల్‌ను కూడా అమెరికా ఇంటెలిజెన్స్‌ అధికారులు సదస్సుకు మూడు రోజుల ముందుగానే పూర్తిగా తమ అధీనంలోకి తీసుకోనున్నట్లు సమాచారం. ఇంకా అమెరికా నుంచి వచ్చే దాదాపు 500 మంది, ఇతర దేశాల నుంచి వచ్చే మరో 500 మందితోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే దాదాపు 400 మంది ప్రతినిధులు పార్క్‌ హయత్‌, గ్రాండ్‌ కాకతీయ, తాజ్‌ కృష్ణ, తాజ్‌ దక్కన్‌, నోవాటెల్‌, ఇతర ఫైవ్‌ స్టార్‌, సెవెన్‌ స్టార్‌ హోటళ్లలో బస చేయనున్నారు. వీరు బస చేసే అన్ని హోటళ్ల వద్ద పోలీసు అధికారులు అత్యంత పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

English summary
Anti-Naxal 'Greyhound' and anti-terror 'Octopus' commandos will be deployed to carry out combing operations and for area domination around Falaknuma Palace on November 27 and the day after for the high profile visit of US President Donald Trump's daughter Ivanka Trump and Prime Minister Narendra Modi. Special Protection Group and US Secret Services are working in tandem to decide on deployment of snipers at vantage points to fortify Falaknuma Palace, the venue of the official dinner.Cops will also conduct door-to-door searches in three colonies in vicinity of Falaknuma — Fathima Nagar, Farooqi Nagar and Al Jubail Colony. The proposed visits of Ivanka to Charminar, Laad Bazar and Chowmahalla Palace are yet to get security clearance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more