వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్పిడిపై తెలిసీ తెలియక సందేహాలు: ఇలా చేయండి..

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంగళవారం రాత్రి నుండి రూ.500/- (ఐదు వందల రూపాయల నోటు) రూ.1000 (వెయ్యి రూపాయల నోటు) చెలామణిలో నుండి భారత ప్రభుత్వము తీసివేశారు. కానీ నోట్ల విలువ తీసివెయ్యలేదు. కానీ కొందరు ఈ నోట్లు చెల్లవు అని ప్రచారం చేస్తున్నారు. ఇవి పుకార్లు మాత్రమే ..డిసెంబరు ౩౦ వ తారీఖు దాకా ఈ నోట్లు బ్యాంకులలొ ఇచ్చి కొత్త నోట్లుగా మార్చుకోవచ్చు. మరోసారి గమనించండి.

మీడియాకూ అవగాహనా లోపం

నోటు చెలామణిలో కొద్దిగా మార్పు చేశారు కానీ.. ఈ నోట్ల విలువను ఏమీ మార్చలేదు. జాతీయ స్థాయి మీడియాలు సైతం తెలిసీ, తెలవక ఆసత్యలు ప్రచారం చేయడంతో గత రాత్రి కొంత మేర ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కానీ సామాన్య ప్రజలకు వచ్చిన నష్టం మాత్రం ఎమీలేదు.. అయితే కోట్ల కొద్దీ నల్ల డబ్బు ఉన్న వారి గురించి ప్రభుత్వమే చూసుకుంటుంది.. ఇబ్బందులు పడితే, మంచాన పడితే.. వాళ్లే పడతారు.

కానీ సామాన్యులకు మాత్రం వచ్చిన నష్టం ఎమీలేదు...కాకుంటే బుధవారం ఒక్క రోజు కొంత మేర ఇబ్బంది ఉంటుంది. భారతదేశ భవిష్యత్తు కొసం ఈ ఒక్క రోజు సామాన్యుడు ఇబ్బందులు పడక తప్పదు. అదీ నిత్యవసర వస్తువులు..పెట్రోలు బంక్‌ లు.. ప్రయాణాలు.. ఆస్పత్రి వంటి వాటిలో మాత్రం కాదు.. అక్కడ మాత్రం మీ వద్ద ఉన్న సోమ్మును వాడుకోవచ్చు

బ్యాంకుకు వెళ్లి జమ చేయవచ్చు..

అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి... మీ సోమ్ము బ్యాంకులో ఉంటే..అటోమేటిక్‌ గా గురువారం నుంచి మీకు కొత్త నోట్లే వస్తాయి. అలాగే డబ్బు ఇంట్లో ఉంటే మాత్రం గురువారం ఉదయం బ్యాంకుకు గానీ, పోస్టాఫీసుకు గానీ వెళ్లి మీ ఆకౌంట్ లో వేసుకొని.. ఏటీంఎంల ద్వారా భారత ప్రభుత్వం చెలామణిలోకి తెచ్చిన నోట్లును తీసుకొని వాడుకోవచ్చు. మీ కు బ్యాంకులో ఆకౌంట్ లేకపోతే.. మీ అధార్‌..కార్డ్‌, రెండు పాస్‌ పోర్ట్ ఫోటోలు, తీసుకొని వెళ్లి నూతన ఆకౌంట్ తెరుచుకోని దానిలో డబ్బును వెసుకోవచ్చు.

Doubts created on exchange of Notes cleared

మీరు ఈ నోట్లు పొరపాటున కూడా ఏ భయంతోను, నాశనం చేసుకోవద్దు తక్కువకి ఎవరికీ ఇవ్వవద్దు. ఈ విషయాన్ని తోటి వారికి కూడా చెప్పండి. నోట్లు మనం మార్చుకోవటంలో కాస్త ఇబ్బంది ఉండవచ్చు. అదే ప్రజలు చేయవలసిన త్యాగం. నిజానికి ఇది త్యాగం కాదు. ప్రజల బాధ్యత. సరైన అవగాహనతో నడవండి... తెలియని వారికి తెలియ చెప్పి, మీ కర్తవ్యం నెరవేర్చండి.

ఎటిఎం కేంద్రాల వద్ద రద్దీ

నల్లధనం నిరోధానికి ప్రధాని మోదీ శ్రీకారం చూట్టారు. అందులో భాగంగా రూ.500, 100 నోట్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించారు. బుధవారం బ్యాంక్ సేవలతోపాటు ఏటీఎంలు కూదా పనిచేయవని మోదీ పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో ఏటీఎం కేంద్రాల వద్ద వినియోగదారులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏటీఎం సెంటర్ల వద్ద భారీ క్యూ కనిపిస్తోంది.

రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేయడంతో రూ.100 నోట్లు ఎక్కువగా తీసుకునేలా ఏటీఎంలలో మళ్లీ మళ్లీ కార్డులు పెట్టి వినియోగదారులు ప్రయత్నిస్తున్నారు. పలుచోట్ల ఏటీఎంలలో డబులు అయిపోవడంతో వినియోగదారులు ఇబ్దందులు పడుతున్నారు. మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ నోట్లు కేవలం కాగితాలుగా మారాయి. ఈ నేపధ్యంలో 500, వెయ్యి రూపాయలు ఉన్న ప్రజలు ఆ నోట్లను ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. నల్ల కుబేరులపై మోదీ ఉక్కుపాదం మోపారని పలువురు అభివర్ణించారు. మోదీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్వం వ్యక్తం అవుతోంది.

మరోవైపు రూ.500, వెయ్యి నోట్ల రద్దు కావడంతో రూ.100, 50 నోట్ల భారీ డిమాండ్ పెరిగింది. అయితే మార్కెట్లలో ఎక్కువగా పెద్ద నోట్ల చలామణి అవుతుండడంతో వంద, యాబై నోట్ల దొరకని పరిస్థితి నెలకొంది. తమ దగ్గర ఉన్న పెద్ద నోట్లను వెంటనే ఖర్చు చేసి చిల్లర తీసుకుంటున్నారు. మరోవైపు ప్రజల వద్ద ఉన్న పెద్ద నోట్లను పెట్రోలు బంకుల్లో స్వీకరిస్తున్నప్పటికీ, వారి వద్ద వంద నోట్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో పలు బంకులను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంకుల్లోకి వస్తున్న వారు రూ. 1000 నోటిచ్చి వంద లేదా రెండొందలకు పెట్రోలు కొట్టమని అడుగుతుంటే, మిగతా చిల్లర ఇచ్చుకోలేక బంకుల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ పెట్రోల్ బంక్ అసోసియేషన్ అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ స్పందిస్తూ, వాహనదారులు రూ. 500కు పెట్రోలు కొట్టించుకోవాలని సలహా ఇచ్చారు. బంకులకు వచ్చి చిల్లర మాత్రం అడగవద్దని చెప్పిన ఆయన, బంకుల సిబ్బంది సైతం తమ సమస్య చెప్పి కస్టమర్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని కోరారు.

English summary
Common man should not worry to exchange or deposit his Rs 500 and 1000 notes. The doubts are because not undersatnding properly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X