• search
 • Live TV
మంచిర్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

'బావా.. అందుకే నాపై పగ తీర్చుకుంటున్నారు': గుండెను పిండేసేలా.., వివాహిత ఆత్మహత్య

|
  గుండెను పిండేసేలా.., వివాహిత ఆత్మహత్య | Oneindia Telugu

  మంచిర్యాల: 'బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.' ఇదీ ఆత్మహత్యకు ముందు ఓ వివాహిత ఆవేదన.

  అదనపు కట్నపు వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. తనతో పాటు నాలుగేళ్ల కూతురిని కూడా ఉరివేసి చంపేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు బాధితురాలు రాసిన లేఖ కంటతడి పెట్టించేలా ఉంది.

   ఎవరీ వివాహిత:

  ఎవరీ వివాహిత:

  మంచిర్యాల పట్టణానికి చెందిన కేసిరెడ్డి మోహన్‌రెడ్డి-పద్మ దంపతుల కుమారుడు రామకృష్ణారెడ్డికి, సమీపంలోని ఊరు శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డి-అరుణ దంపతుల కూతురు విజ్జూలతకు 2012లొ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో విజ్జూలత కుటుంబం రూ.15లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలు బాగానే చేశారు.

   పెట్రోల్ బంకులో పనిచేస్తున్న భర్త:

  పెట్రోల్ బంకులో పనిచేస్తున్న భర్త:

  వివాహం జరిగిన ఏడాదికి రామకృష్ణారెడ్డి-విజ్జూలతలకు క్రిషిక జన్మించింది. ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఆమె చదువుతోంది. ఇకపోతే మోహన్‌రెడ్డి తండ్రికి ఊరు శ్రీరాంపూర్‌ సమీపంలో ఐఓసీ పెట్రోల్‌బంక్‌ ఉంది. ఇందులోనే పనిచేస్తున్న రామకృష్ణారెడ్డి.. నెలవారీ ఖర్చులకు గాను రూ.7వేలు జీతంగా తీసుకుంటున్నాడు.

   అత్తింటి వేధింపులు:

  అత్తింటి వేధింపులు:

  కూతురు పుట్టిన ఏడాది నుంచి విజ్జూలతకు అత్తమామలు, ఆడపడుచు నుంచి అదనపు కట్నం వేధింపులు తీవ్రమయ్యాయి. చీటికిమాటికీ సూటిపోటి మాటలతో మనసు బాధపెట్టడం, భర్త ముందే అవమానించేలా మాట్లాడటం.. ఇంత జరుగుతున్నా.. భర్త నోరు మెదకపోవడం ఆమెను తీవ్రంగా కలత చెందేలా చేసింది.

  మామ మోహన్ రెడ్డి కూడా విజ్జూలతను వేధించినట్టు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదే క్రమంలో గతంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినట్టు తెలుస్తోంది. చివరిసారిగా పదిరోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరగా.. విజ్జూలతను తిరిగి అత్తగారింటికి పంపించారు. ఆపై వేధింపులు మరింత తీవ్రతరం కావడంతో విజ్జూలత ఆత్మహత్యే శరణ్యం అనుకుంది.

   భర్తకు ఫోన్ చేసి:

  భర్తకు ఫోన్ చేసి:

  ఆత్మహత్యకు ముందు భర్త రామకృష్ణారెడ్డికి విజ్జూలత ఫోన్ ద్వారా సమాచారం అందించింది. బుధవారం అత్తమామలు హైదరాబాద్ వెళ్లడంతో ఇంట్లో కూడా ఎవరూ లేరు. కూతురిని చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్తకు చెప్పడంతో అతను హుటాహుటిన పరిగెత్తాడు. కానీ అతను ఇంటికి చేరుకునేలోపే వేర్వేరు గదుల్లో భార్య కూతురు ఫ్యాన్లకు వేలాడుతూ కనిపించారు.

   సూసైట్ నోట్:

  సూసైట్ నోట్:

  'బావా.. మీ అమ్మానాన్నలకు నేనంటే ఇష్టంలేదు. నీకు మీ అమ్మానాన్నే కావాలి. కనీసం భార్యని మీ అమ్మా నాన్న అనే మాటలేవీ పట్టించుకోవు. నీకు మీ వాళ్లు ఒక కోటీశ్వరుల అమ్మాయితో పెళ్లి చేస్తారు. చేసుకో. అది కూడా మీ అక్కకు ఇష్టమైన సంబంధం చేసుకో.'

  'ఆమెకు ఇష్టం లేకపోతే వచ్చేదాన్ని కూడా ఇలాగే టార్చర్‌ చేస్తారు. నిన్ను కూడా టార్చర్‌ చేస్తారు. నేను ఒక పెద్ద తప్పు చేశాను. అది నేను ఇప్పుడు ప్రెగ్నెంట్‌ కావడం. ఇది కూడా మీ అమ్మకు ఇష్టం లేదు. ఆమెకు ఎన్ని పనులు చేసినా అంతే.. గిన్నెలు కడగకపోతే పోలీస్‌ ఆంటీ ఇంటికి పోయి చెప్పుతుంది. అన్ని పనులూ చేసి ఒకనాడు కడుపునొస్తుందని కూర్చున్నా..'

  'ఆ ఒక్కరోజే గిన్నెలు కడగలేదు. నువ్వు మీ అమ్మ మాట దాటకు సరే. కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. మీ నాన్నకేమో ఇంకా కట్నం కావాలని ఉంది. మీ అమ్మానాన్నలకు మా నాన్నంటే ఇష్టం లేదు. అందుకే నా మీద పగ తీర్చుకుంటున్నారు. నా కూతురు తల్లిలేని పిల్ల కావద్దనే ఆమెను కూడా చంపేస్తున్నా. నువ్వు మీ అమ్మానాన్నలతో.. ముఖ్యంగా మీ అక్కతో సంతోషంగా ఉండు. పెళ్లి అయినప్పటి నుంచి నీవు రూ.7 వేలు శాలరీ కింద పనిచేస్తున్నావు. నేను చనిపోగానే.. నీకు మీ అమ్మ నాన్న, అక్క శాలరీ పెంచుతారు' అంటూ సూసైడ్ నోట్ లో పేర్కొంది.

  English summary
  A married woman committed suicide in Mancherial town due to the dowry harassments of their husband family
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more