వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్కైబాబపై బెజవాడ దాడి: "ఎందుకోసం ఈ ర‌గ‌డ‌?"

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

స్కైబాబా పై బెజవాడ దాడి : నిరసన సెగ, విజయవాడలో ఉద్రిక్తత

హైదరాబాద్: విజ‌య‌వాడ బుక్ ఫెయిర్‌లో మిత్రుడు స్కైబాబ స‌భ‌ను అడ్డుకోని వేధించ‌డం స‌బ‌బు కాదని ప్రముఖ దళిత రచయిత డాక్టర్ పసునూరి రవీందర్ అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాంతాలుగా విడిపోయినా గ‌డిచిన మూడున్న‌రేళ్లుగా అన్న‌ద‌మ్ముల్లానే క‌లిసున్నాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.

కానీ, స్కైబాబ స‌భ‌ను అడ్డుకున్న తీరు విచారం క‌లిగిస్తున్న‌దని, దీన్ని క‌వులు, ర‌చ‌యిత‌లుగా మేం ఖండిస్తున్నామని ఆయన అన్నారు. "ఇది ప్ర‌జాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. ఒక ర‌చ‌యిత రాసిన ర‌చ‌న‌ల ప‌ట్ల అభ్యంత‌ర‌ముంటే, అది ఎట్లా త‌ప్పో నిరూపిస్తూ రాయాలి. చ‌రిత్ర‌లో రికార్డు చేయాలి. అంతేత‌ప్ప‌, భౌతిక దాడుల‌కు దిగ‌డం, స‌భ జ‌రుగ‌కుండా అడ్డుకోవ‌డం దేనిని సూచిస్త‌ది" అని అంటూ సభను అడ్డుకోవడానికి గల కారణాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు.

 క్విట్ తెలంగాణ పుస్తకం

క్విట్ తెలంగాణ పుస్తకం

"క్విట్ తెలంగాణ" అనే పుస్త‌కంలో ఆంధ్రా వారిని తిడుతూ బూతులు తిట్టిన వారిని ఎట్లా పిలుస్తారు. అట్లా రాసిన వారు ఎట్లా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌స్తారు? అని రాద్ధాంతం చేయ‌డం ఎందుకోసం? నిజానికి ఇది ఉద్య‌మ స‌మ‌యంలో రాసిన పుస్త‌కం. 12వంద‌ల మంది బిడ్డెలు బ‌లిదానాలు చేసుకున్నా స‌రే, నాటి కిరణ్‌కుమార్‌రెడ్డి స‌ర్కార్ తెలంగాణను రాకుండా అడ్డుకోవ‌డానికి కుట్ర‌లు చేసింది. ఈ దుర్మార్గం క‌వులు, ర‌చ‌య‌త‌లు, మేధావుల‌నే కాదు, యావ‌త్ తెలంగాణ స‌మాజాన్ని నిద్ర‌పోనివ్వ‌లేదు. ఆ స‌మ‌యంలో "ఉద్య‌మావేశం"తో రాసిన క‌విత్వాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తు చేయ‌డం దేనికోస‌మో ఆలోచించాలి. ఇలా త‌వ్వుకోవ‌డం అన‌వస‌ర‌పు గొడ‌వ‌ల‌కు, రాగ‌ద్వేషాల‌కు దారితీస్తుంది త‌ప్ప‌, ప్ర‌యోజ‌నం శూన్యం" అని పసునూరి రవీందర్ అన్నారు.

 అప్పుడే క్లారిటీ ఇచ్చాం

అప్పుడే క్లారిటీ ఇచ్చాం

ఈ విష‌యంలో... తెలంగాణ క‌వులుగా మేం తెలంగాణఉద్య‌మ‌ స‌మ‌యంలోనే ఒక క్లారిటీ ఇచ్చామని పసునూరి రవీందర్ చెప్పారు. "మేం ఆంధ్రా స‌ర్కారుకు వ్య‌తిరేకం త‌ప్ప‌, ఆంధ్ర ప్ర‌జ‌ల‌కు కాదు" అని క్లారిటీ ఇచ్చినట్లు తెలిపారు. "కాబ‌ట్టి క్విట్ తెలంగాణ క‌విత్వంలోని బూతులైనా నినాదాలైనా, డిమాండ్‌లైనా, హెచ్చ‌రిక‌లైనా తెలంగాణ‌ను దోచుకున్న ఆంధ్ర వ‌ల‌స‌వాద అగ్ర‌వ‌ర్ణ పెట్టుబ‌డిదారుల‌కే త‌ప్ప‌, సామాన్య ప్ర‌జ‌ల‌కు కాదు" అని అన్నారు.

 ఆయనను ఎలా పిలుస్తారని...

ఆయనను ఎలా పిలుస్తారని...

"ఆంధ్ర‌జ్యోతి సంపాద‌కులు కె.శ్రీ‌నివాస్‌ను ఎట్లా పిలుస్తారు? ఆంధ్రా మూలాల‌ను క‌లిగిన ఎడిట‌ర్లు లేరా? అని విజ‌య‌వాడ బుక్ ఫెయిర్ నిర‌స‌న కారులు అడుగుతున్నారు.

ఇది వారి స‌భ్య‌త‌కే వ‌దిలేస్తున్నాం. నిజ‌మే కె.శ్రీ‌నివాస్‌గారు తెలంగాణ ఉద్య‌మ‌కాలంలో ఉద్య‌మానికి మ‌ద్ధ‌తుగా నిల‌బ‌డ్డారు, విలువైన ర‌చ‌న‌లు చేశారు. ఒక మేథావిగా త‌నవంతు పాత్ర‌ను పోషించారు. వారు తెలంగాణకే కాదు, దేశంలో ఏ ప్రాంతానికైనా, ఏ స‌మూహానికైనా అన్యాయం జ‌రిగినా బాధితుల ప‌క్షాన నిలిచే ప్ర‌జాస్వామ్య‌వాది. తెలంగాణ‌లో పుట్టినంత మాత్రాన ఆంధ్రాకు పిల‌వ‌ద్ద‌న‌డం ఏం తెలుగు సంస్కార‌మో మిత్రులు ఆలోచించాలి" అని పసునూరి రవీందర్ అన్నారు.

నేను అలా అనలేదని...

నేను అలా అనలేదని...

"ఇక నేను విజ‌య‌వాడ‌లో నా మిత్రుడు వేంప‌ల్లె ష‌రీఫ్ క‌థ‌ల పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌ స‌భ‌లో మాట్లాడుతూ "ఆంధ్రాలో సాహిత్య‌మే లేదు" అన్నాన‌ని మిత్రులు మ‌రో ఆరోప‌ణ‌ చేస్తున్నారు.

ఇది ఎంత‌మాత్ర‌మూ స‌బ‌బు కాదు. ఒక‌వేళ నేను అట్లా మాట్లాడి ఉన్న ఆధారాలు ఏమైనా ఉంటే నిరూపించండి. లేదా ఆ స‌భ‌లో ఉన్న సాహిత్య పెద్ద‌లు పి.స‌త్య‌వ‌తి, ఖాద‌ర్‌మోహియుద్ధీన్‌, నండూరి రాజ‌గోపాల్ (చినుకు పత్రిక సంపాద‌కులు), నూక‌తోటి ర‌వికుమార్‌, ప్ర‌జాశ‌క్తి ల‌క్ష్మ‌య్య‌ వంటి వారిని చెప్ప‌మ‌నండి. లేకుంటే ఆ స‌భ పెట్టిన ర‌చ‌యిత వేంప‌ల్లె ష‌రీఫ్‌నే చెప్ప‌మ‌నండి. నేను ఒక అంబేద్క‌రైట్‌గా కులానికి సంబంధించిన చ‌ర్చ‌మాత్ర‌మే చేశాను త‌ప్ప‌, ప్రాంతీయ‌భేధాల జోలికిపోలేదు.
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న బుక్ ఫెయిర్‌కు ప‌సునూరి ర‌వీందర్‌ను కూడా పిల‌వ‌ద్దు. పిలిచినా రావొద్దు అన‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్న‌ది. నేనేం వ‌స్తా అని, న‌న్ను పిల‌వండి అని అడ‌గ‌లేదు" అని పసునూరి రవీందర్ తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.

 బూతులు తిట్టడానికి...

బూతులు తిట్టడానికి...

"బుక్ ఫెయిర్‌లో భాగంగా ఒక‌రోజు యువ‌పుర‌స్కార గ్ర‌హీత‌లంద‌రినీ పిలిస్తే, యువ‌త‌కు ప్రోత్సాహం ఉంటుంద‌ని ఆహ్వానించారు. పిలిచిన‌వారి ప‌ట్ల నాకు గౌర‌వం ఉండ‌డం వ‌ల్ల వ‌స్తాన‌ని చెప్పాను. అంతేత‌ప్ప మ‌ళ్లీ ఆంధ్రా పెట్టుబ‌డిదారుల‌ను బూతులు తిట్ట‌డానికి వ‌స్తాన‌ని నేను చెప్ప‌లేదు" అని పసునూరి రవీందర్ అన్నారు.

 ఏం జరుగుతుందో ఆలోచించాలి..

ఏం జరుగుతుందో ఆలోచించాలి..

"ఒక ప‌ని చేయ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతోందో ఆలోచించాలి. అలా ముందుచూపు లేక‌పోతే న‌ష్ట‌మే త‌ప్ప‌, మేలు జ‌రుగ‌దు. "రాష్ట్రాలు వేరైనా మ‌న ర‌క్త‌సంబంధ‌మొక్క‌టే"న‌ని తెలంగాణ వ‌చ్చిన త‌రువాత ఆంధ్రాలో నేను పాల్గొన్న అనేక స‌భ‌ల్లో స‌మావేశాల్లో చెప్పాను. ఇక ముందు కూడా చెబుతాను. కాబ‌ట్టి ఎప్పుడో రాసిన రాత‌ల్ని తీసుకొని ప‌దేప‌దే ర‌చ్చ‌చేయ‌డం వ‌ల్ల ప్రాంతీయ బేధాలు రెచ్చ‌గొట్ట‌బ‌డ‌తాయి. అది అంత మంచిది కాద‌ని నా అభిప్రాయం. ఈ గొడ‌వ‌ను ఇంత‌టితో వ‌దిలేయండి. అన్న‌ద‌మ్ముల్లా క‌లిసుందాం, ఆత్మీయ‌త‌ల్ని పంచుకుందాం!!" అని పసునూరి రవీందర్ చెప్పారు.

English summary
Telangana dalit writer Dr Pasunoori Ravinder reacted on proteest against Skybaba and clarified allegations made against him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X