వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంటైనర్ లో రెండున్నర కోట్లకు పైగా విలువ చేసే 1050 కేజీల గంజాయి తరలింపు .. హైదరాబాద్ లో పట్టివేత

|
Google Oneindia TeluguNews

ఏపీలోని విశాఖపట్నం ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటోంది. విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతం నుండి వివిధ రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయి స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడకుండా వివిధ మార్గాల ద్వారా గంజాయిని తరలిస్తారు.గతంలో బొగ్గు లారీలో, సిమెంట్ ఇటుకలు లారీలో, ఆలుగడ్డలు, చిలకడ దుంపలు , ఉల్లిగడ్డల లారీలలో గంజాయి అక్రమ రవాణా చేసిన పరిస్థితులున్నాయి.అంతెందుకు అంబులెన్సులను కూడా గంజాయి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు అంటే విశాఖ ఏజెన్సీ కేంద్రంగా గంజాయి దందా ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్నా పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్లు చేస్తే ఎవ్వర్నీ వ‌ద‌ల‌ను : ఎంపీ విజయసాయిరెడ్డి వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిత్యం విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో వాహన తనిఖీలు జరుగుతున్నప్పటికీ స్మగ్లర్లు పోలీసుల కళ్లుగప్పి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఓ కంటైనర్లో రెండున్నర కోట్లకు పైగా విలువ చేసే గంజాయిని పట్టుకున్నారు అంటే గంజాయి దందా ఎంత పెద్ద ఎత్తున సాగుతుందో తెలుస్తోంది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు, హైదరాబాద్ జోనల్ యూనిట్ సిబ్బంది సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో హైదరాబాద్ శివారులో భారీగా గంజాయిని పట్టుకున్నారు.

https://telugu.oneindia.com/news/visakhapatnam/mp-vijayasai-warn-never-leave-anybody-using-my-name-in-land-grabbings-274712.html

ఖాళీ ప్లాస్టిక్ ట్రేలను రవాణా చేసే ఓ వాహనంలో పలు బ్లాగులలో గంజాయి ని పెట్టి, ట్రే ల చాటున అక్రమ రవాణా చేస్తున్నారు. మొత్తం 1050 కేజీల గంజాయిని పట్టుకున్న అధికారులు దాని విలువ 2 కోట్ల 62 లక్షలు గా ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి మహారాష్ట్రకు ఈ గంజాయి సరఫరా అవుతోందని తెలుస్తోంది. గంజాయిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు, ఓ వ్యక్తిని అరెస్టు చేసి వివరాలు రాబట్టే పనిలో ఉన్నారు.

English summary
Recently, marijuana worth over Rs 2.5 crore was seized in a container in the suburbs of Hyderabad, which shows how large the cannabis trade is.Officials of the Directorate of Revenue Intelligence, Hyderabad Zonal Unit staff jointly conducted a search and seized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X