వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విస్ట్: ఐదోసారి కిడ్నాప్ చేశాడు, ఇంకా దొరకని గద్వాల యువకుడు శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ

ఢిల్లీలో గద్వాలకు చెందిన యువకుడు అక్కాల శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. కిడ్నాపర్‌ను అతడున్న ప్రాంతాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేకపోతున్నారు.అయితే నిందితుడు డబ్ములు సంపాదించాలనే పక్కా ప్రణాళికల

By Narsimha
|
Google Oneindia TeluguNews

గద్వాల: ఢిల్లీలో గద్వాలకు చెందిన యువకుడు అక్కాల శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ ఇంకా లభ్యంకాలేదు. కిడ్నాపర్‌ను అతడున్న ప్రాంతాన్ని పోలీసులు ఇంకా గుర్తించలేకపోతున్నారు.అయితే నిందితుడు డబ్ములు సంపాదించాలనే పక్కా ప్రణాళికలతోనే ఓలా సంస్థలో చేరాడు.నాలుగుసార్లు కిడ్నాప్‌కు ప్రయత్నించి ఐదోసారి విజయం సాధించినట్టు పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

గద్వాల జోగుళాంబ జిల్లాకు చెందిన అక్కాల శ్రీకాంత్‌గౌడ్‌ను ఈ నెల 6వ, తేదిన ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. అయితే శ్రీకాంత్‌గౌడ్ ఆచూకీ కోసం ఆయన బందువులు ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది.

పోలీసులు కూడ నిందితుడికోసం గాలింపు చర్యలను చేపట్టారు. అయితే నిందితుడు పక్కా ప్రకారంగా వ్యవహరిస్తున్నాడు. తన ఆచూకీ లభించకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. దీని కారణంగా నిందితుడిని పోలీసులు ఇంకా గుర్తించలేకపోతున్నారు.

అంతేకాదు అత్యంత పకడ్బందీగా వ్యవహరించడాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు తప్పుడు చిరునామాలతో ధృవీకరణపత్రాలను పొందాడు.అయితే వీటి ఆధారంగా వెతికినా ప్రయోజనం లేకుండాపోయింది.

ఐదోసారి కిడ్నాప్ సక్సెస్

ఐదోసారి కిడ్నాప్ సక్సెస్

ఢిల్లీలో గద్వాల యువకుడు అక్కాల శ్రీకాంత్‌గౌడ్‌ను కిడ్నాప్ చేసిన ఓలా డ్రైవర్ అంతకుముందు నాలుగుసార్లు కిడ్నాప్‌కు ప్రయత్నించాడు. అయితే ఐదోసారి మాత్రం ఆయన విజయంసాధించాడు. ఈ నెల 4వ,తేదిన డ్రైవర్ ఓలా సంస్థలో విధుల్లో చేరాడు. విధుల్లో చేరిన రెండురోజులకే ఆయన తన వ్యూహన్ని అమలుచేశాడు. ఈ నెల 6వ, తేదిన శ్రీకాంత్‌గౌడ్‌ను డ్రైవర్ కిడ్నాప్ చేశాడు. ఓలా సంస్థలో చేరడానికి ముందే అతను నాలుగుసార్లు కిడ్నాప్‌ ప్రయత్నాలుచేసి విఫలమయ్యారు. నాలుగుదఫాలు ఈ ప్రయత్నాల్లో విజయం సాధించలేదు.అయితే ఓలా సంస్థలో చేరిన తర్వాత ఆయన విజయం సాధించినట్టుగా పోలీసులు గుర్తించారు.

Recommended Video

Watch : Delhi DTC AC bus caught fire near Vikas Marg
పకడ్బందీ ప్లాన్‌తో కిడ్నాప్

పకడ్బందీ ప్లాన్‌తో కిడ్నాప్

శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేసిన ఓలా డ్రైవర్ అత్యంత పకడ్బందీగా వ్యవహరించాడని పోలీసులు గుర్తించారు. ఆధార్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు అతను ఇచ్చిన అన్ని ఆధారాల్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా పోలీసులు తేల్చారు. అంతేకాదు శ్రీకాంత్‌ను కొద్దిరూరం తీసుకెళ్ళిన తర్వాత ఓలా క్యాబ్‌ను వదిలేసి మరోవాహనంలో అతడిని తీసుకెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. దీంతో క్యాబ్‌కు జిపిఎస్ ఉన్నా ఉపయోగంలేకుండా పోయింది. కనీసం కిడ్నాపర్ ఎవరనే సమాచారం కూడ పోలీసులకు అంతుపట్టడం లేదు.

కిడ్నాప్‌కు ముందు ఏడుగురు వ్యక్తులతో మాట్లాడిన డ్రైవర్

కిడ్నాప్‌కు ముందు ఏడుగురు వ్యక్తులతో మాట్లాడిన డ్రైవర్

శ్రీకాంత్‌ను కిడ్నాప్ చేయడానికి ముందు ఏడుగురు వ్యక్తులతో డ్రైవర్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించినా కూడ ప్రయోజనం లేకుండాపోయింది. శ్రీకాంత్‌గౌడ్ చిన్నాన్న నారాయణగౌడ్ ఢిల్లీలోని పోలీస్‌స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నాడు. కానీ, ప్రయోజనం లేకుండాపోయింది. కాల్‌డేటా ఆధారంగా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 15 బృందాలతో నిందితుడికోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఒక్క డిసిపితోపాటు ఆరుగురు ఏసీపీలు, 120 మంది ఎస్‌ఐలు, 1200మంది పోలీసులు రంగంలోకి దిగారు. తెలంగాణకు చెందిన ఏసీపీ రాహుల్ ఈ కేసు విచారణకోసం ఢిల్లీకి వెళ్ళాడు.

క్యాబ్ షేరింగ్‌కు బ్రేకులు

క్యాబ్ షేరింగ్‌కు బ్రేకులు

యాప్‌ల సహయంతో షేరింగ్ విధానంలో క్యాబ్‌ను బుక్ చేసుకొనే వెసులుబాటు ఇక మీదట ఢిల్లీవాసులకు ఉండకపోవచ్చు. అక్కడి రవాణశాఖ సీనియన్ అధికారులు ఈ మేరకు సిటీ ట్యాక్సీ స్కీమ్ 2017‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. మోటారు వాహనాల చట్టం1988 ప్రకారం క్యాబ్ షేరింగ్‌ను అనుమతించడం లేదని , దీన్ని సవరించకుండా ఈ విధానం కొనసాగించడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకసారి ప్రయాణికుడి ఎక్కించుకొన్న తర్వాత గమ్యస్థానం చేరేవరకు క్యాబ్‌ను ఆపే అవకాశం ఇకపై ఉండదని అధికారులు చెబుతున్నారు.

English summary
Delhi police investigating the kidnap of Gadwala-based doctor Akkala Srikanth Goud suspect that there could be more than one person involved. Police has collected leads and is working on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X