• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

డిస్పోజబుల్ కప్పులో టీ తాగుతున్నరా..! ఐతే రోగాలను కొని తెచ్చుకున్నట్టే..!!

|

హైదరాబాద్ : టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. పేపర్ కప్పులో టీ తాగి, కప్పును తాపీగా నలిపేసి పెదాలను చప్పరించుకుంటూ వెళ్లేంత వరకూ మాత్రమే మనకు తెలుసు. వేడివేడి టీ లోపలకు వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుందని చాలా మందికి తెలియదు. తెలిస్తే వెంటనే డిస్పోసబుల్ కప్పులను నిషేదించి పరీక్షలకోసం దావాఖానాకు పరుగెత్తే పరిస్థితి ఉంటుంది. అసలు డిస్పోసబుల్ కప్పుల వల్ల ఇంత అర్థాంతరంగా ముంచుకొచ్చిన ముప్పేంటి అనుకుంటున్నారా..? అయితే ఈ స్టోరీ చదివేయండి..!

మామూలు పింగాణీ కప్పులే ముద్దు..!!

మామూలు పింగాణీ కప్పులే ముద్దు..!!

పేపర్ కప్పులో టీ వద్దు..! మామూలు పింగాణీ కప్పులే ముద్దు..!!

'టీ' మన దేశంలో ప్రజలకి మొదట లేవగానే కావాల్సిన పానీయం. ఇక టీ ప్రియుల రోజూ 'టీ'తో తమ రోజును ప్రారంభించి, అలా అలా లెక్క లేనన్ని తాగేస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. పనిలో ఒత్తిడి ఉన్నా, కాస్త తల నొప్పిగా ఉన్నా, రోడ్డుపై ఎవరన్నా కలిసినా ఇలా మనకు తెలియకుండానే మనం టీ తాగేస్తూ ఉంటాము. అయితే ఈ టీ కప్పుతో ప్రాణానికి ముప్పు ఉందని, తాజాగా జరిపిన పరిశోధనలలో తెలిసింది. అయితే అన్ని కప్పులతో కాకపోయినా, ముఖ్యంగా థర్మాకోల్ కప్పులు (డిస్పోసబుల్ కప్స్) వల్లే ఆరోగ్యానికి హాని ఉందని నిపుణులు తమ పరిశోధనలో తెలిపారు.

  దోమల బారినుండి మనల్నిమనం రక్షింకుందాం
   పేపర్ కప్పులతో అనేక వ్యాధులు..! తేల్చిన ఆరోగ్య నిపుణులు..!!

  పేపర్ కప్పులతో అనేక వ్యాధులు..! తేల్చిన ఆరోగ్య నిపుణులు..!!

  ఇక హోటల్ యజమానులు, టీ పాయింట్ వర్తకులు కూడా థర్మాకోల్ కప్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు కూడా. థర్మాకోల్ కప్పులు అయితే తాగిన తర్వాత కప్పును డస్ట్‌బిన్‌లో పడెయ్యవచ్చు. అదే గాజు గ్లాసులో, పింగాణీ కప్పులో అయితే, టీ తాగిన తర్వాత వాటిని కడగాలి. అందుకు వాటర్ కావాలి. ఇంకో మనిషి కావాలి. ఇవన్నీ ఎందుకొచ్చిన సమస్యలు అనుకుంటున్న వారూ ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారు.

   పేపర్ కప్పులో హానికరమైన మూలాలు..! పొట్టలో చేరిన తర్వాత అనేక సమస్యలు..!!

  పేపర్ కప్పులో హానికరమైన మూలాలు..! పొట్టలో చేరిన తర్వాత అనేక సమస్యలు..!!

  మనకు కూడా పింగాణీ కప్పులు సరిగా కడగరు అనే భావన ఉంటుంది. అలాగే టీ ఆర్డరిచ్చామా, తాగామా, డబ్బులిచ్చి వెళ్లిపోయామా... అంతవరకే పట్టించుకుంటాం. కానీ, వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ఏనాడూ ఆలోచించలేదు. డిస్పోసబుల్ కప్పుల్లో టీ తాగితే లేని పోని రోగాలు రావడం ఖాయమంటున్నారు డాక్టర్లు. నిజానికి ఆ కప్పులు థెర్మోకోల్‌తో తయారుచేస్తున్నవి కావు. పాలియస్టర్స్‌తో తయారు చేస్తున్నవి. అదో రకమైన ప్లాస్టిక్. అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమైనది. వేడి వేడి టీని, పాలియస్టర్ కప్పుల్లో పోసినప్పుడు ఆ కప్పుల్లో మూలకాలు కొన్ని టీలో కలుస్తాయి. అవి నేరుగా మన పొట్టలోకి వెళ్లిపోతున్నాయి. అవి రకరకాల రోగాలకు కారణం అవ్వడమే కాదు, చివరకు ప్రాణాంతకమైన కాన్సర్ కూడా వచ్చేందుకు కారణం అవుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. తరచుగా అలసట, దృష్టి లోపాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి.

   డిస్పోజబుల్ కప్పులతో చర్మ రోగాలు..! వద్దంటున్న డాక్టర్లు..!!

  డిస్పోజబుల్ కప్పులతో చర్మ రోగాలు..! వద్దంటున్న డాక్టర్లు..!!

  రోజూ థర్మోకోల్ కప్పుల్లో టీ తాగితే, చర్మ రోగాలు కూడా వస్తున్నాయని తెలిసింది. చర్మంపై ఎర్రటి మచ్చలు, నొప్పి, గొంతులో గరగర వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. రోజూ థర్మోకోల్ కప్పుల్లో టీ లేదా కాఫీ తాగితే, పొట్టలో లేనిపోని సమస్యలు వస్తున్నాయి. ఆ కప్పులను అంటిపెట్టుకొని ఉండే బ్యాక్టీరియా కూడా పొట్టలో చేరి, రకరకాల రోగాలు తెస్తోంది. ఈ కప్పుల్లో టీ లీకవ్వకుండా, ఆర్టిఫిషియల్ వాక్స్ (కృత్రిమ మైనం) పూస్తున్నారు. మనం టీ తాగినప్పుడు వాక్స్ కూడా పొట్టలోకి వెళ్లిపోతుంది. దాని వల్ల చిన్న పేగుల్లో ఇన్ఫెక్షన్లు వస్తాయి. జీర్ణప్రక్రియ వ్యవస్థ దెబ్బతింటుంది. సో... ఇకపై మనం ఆ కప్పుల్లో టీ ఇవ్వవద్దని చెప్పడమే మేలు. ఎప్పటిలాగే పింగాణీ కప్పులను కాస్త శుబ్రం చేసుకుని టీ ఆరగిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని కూడా తెలుస్తోంది. దానికి కావాల్సింది కాస్త బద్దకాన్ని వదిలించుకోవడమే..!

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Stress at work, a little headache, whoever we are on the road, we drink tea without knowing it. However, recent research has revealed that this cup of tea is a life threatening condition. However, experts say in their research that not all cups, especially the disposable cups are harmful to health.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more