• search
 • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా నియంత్రణకు రంగంలోకి దిగిన డ్రోన్లు.... వాటితో ఏం చేస్తున్నారో తెలుసా !!

|

కరోనాపై దేశం పోరాటం చేస్తుంది. కరోనాను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో 229కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.ఇక తెలంగాణా రాష్ట్రంలో ఇంతగా కరోనా ప్రబలటానికి వెనుక ఢిల్లీలో మర్కజ్ సమావేశ మూలాలు ఉన్నట్టు గుర్తించారు అధికారులు . ఇక కరీంనగర్ జిల్లాలో ఇండోనేషియా నుంచి వచ్చిన వారితో మొదలైన కరోనా కలకలం ఇంకా కొనసాగుతుంది. నిన్నటికి నిన్న నాలుగు కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాను కరోనా వణికిస్తుంది. ఈ సమయంలోనే అధికార యంత్రాంగం ప్రజల ఆరోగ్య రక్షణకు డ్రోన్లను రంగంలోకి దించింది .

అక్కడ వినూత్న ప్రయోగం .. ఇంటికే సరుకులు ..100 రూపాయలకే 12 రకాల కూరగాయలు

డ్రోన్ల సాయంతో వైరస్ ప్రభావిత ప్రాంతాలు శానిటైజేషన్

డ్రోన్ల సాయంతో వైరస్ ప్రభావిత ప్రాంతాలు శానిటైజేషన్

తాజాగా పెరుగుతున్న కేసులతో ఈ రెండు జిల్లాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. కరీంనగర్‌లో ముకరంపూరా ప్రాంతంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇండోనేషియా వారికి ఆశ్రయం కల్పించిన ఒక స్థానికుడు ఈ ప్రాంత వాసి. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావటంతో ఎలాంటి వైరస్‌ లేకుండా చేయటానికి అధికారులు అత్యాధునిక డ్రోన్‌లను ఉపయోగించారు. వాటి ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు.

కరీంనగర్‌ తో పాటు వరంగల్‌లో ప్రయోగం

కరీంనగర్‌ తో పాటు వరంగల్‌లో ప్రయోగం

కరీంనగర్‌ తో పాటు వరంగల్‌లో కూడా డ్రోన్‌ సహయంతో శానిటైజేషన్ చేస్తున్నారు. కరీంనగర్‌లో ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా ఆస్పత్రి, బస్టాండ్‌ ,ముకరంపురా, కశ్మీర్ గడ్డ ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో స్ప్రే చేశారు అధికారులు. ఇక వరంగల్ లో కూడా మండీ బజార్ , బొక్కల గడ్డ, అలంకార్ , ఉజిలీ బేస్ ,వంటి ప్రాంతాలలో శానిటైజేషన్ చేస్తున్నారు. మానవ సామర్ధ్యం కన్నా అత్యంత ఎక్కువ సామర్ధ్యం ఉన్న డ్రోన్ లను ఉపయోగించి సాధ్యమైనంత త్వరగా శానిటైజ్ చేస్తున్న పరిస్థితి .

  PM Urges People To Light Diyas For 9 Minutes On April 5 At 9 PM
  డ్రోన్ తో ఒకేరోజు 20 కిలోమీటర్ల ప్రాంతంలో స్ప్రే చేసేందుకు

  డ్రోన్ తో ఒకేరోజు 20 కిలోమీటర్ల ప్రాంతంలో స్ప్రే చేసేందుకు

  సాధారణంగా ఒక వ్యక్తి చేసే పనికి 50 రెట్ల పనిని ఈ డ్రోన్‌ల సాయంతో చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. అందుకే వీటిని వినియోగిస్తున్నారు. వీటి సాయంతో ఒకేరోజు 20 కిలోమీటర్ల ప్రాంతంలో స్ప్రే చేసేందుకు వీలుంటుంది. డ్రోన్‌ ద్వారా రసాయనాలను స్ప్రే చేస్తున్న అధికారులు నిఘా కెమెరాలను, స్పీకర్లను పెట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకుని శానిటైజ్ చెయ్యటం అందరినీ ఆకర్షిస్తుంది . ఇప్పటిదాకా చైనా, దక్షిణ కొరియా ఉపయోగిస్తున్న డ్రోన్‌ టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రంలోనూ ఉపయోగించటం గమనార్హం .

  English summary
  Along with Karimnagar, drone-assisted sanitization is also being done in Warangal. In Karimnagar, especially the District Collectorate, Municipal Corporation, District Hospital, Bus stand, Mukarampura and Kashmir gadda , sprayed sanitizers with the help of drones, officials said. Also in Warangal, sanitization is done at Mandi Bazaar, Bokka Guda, Alankar, Ujili Base, etc. A situation that sanitizes as fast as possible using drones that are more capable than human capability.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more