• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణలోనూ తప్పని పాలమూర్ వలసలు

By Swetha Basvababu
|

హైదరాబాద్: 'పాలమూర్ లేబర్'కు దేశంలోని పలు ప్రాంతాల్లో విపరీతమైన డిమాండ్.. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారినే పాలమూరు లేబర్ అని పిలుస్తారు. భవన నిర్మాణ రంగంతోపాటు కష్టసాధ్యమైన రంగాల్లో పనులు చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశేయోక్తి కాదు.

తెలంగాణ ఏర్పాటైన తర్వాత పాలమూరు - రంగారెడ్డి తదితర ఎత్తిపోతల పథకాలతో మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పించినా.. ఆచరణలో జరగుతున్నది మాత్రం అందుకు భిన్నం. గత ఏడాది ప్రారంభంలో సరిగ్గా వర్షాలకు కురవక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు మహబూబ్ నగర్ జిల్లా వాసులు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ద్వారా పాలమూరు కార్మికులకు ఉపాధి కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నా.. అధికారులు మాత్రం యంత్రాలతోనే పనులు పూర్తి చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తత్ఫలితంగా పాలమూరు ప్రజలు ఉపాధి కోసం ముంబై, పుణె, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లడం సహజ సిద్ధ పరిణామంగా మారిందంటున్నారు.

మనుమల కోసం ఊళ్లలోనే వృద్ధులు

మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేట్ బ్లాక్‌లోని మెకా హనుమాన్ తండా వాసి శివ నాయక్ కొడుకులు రాజేందర్, పుల్లెందర్, భాస్కర్ తమ భార్యలతోపాటు ఉపాధి కోసం ముంబై, పుణె తదితర ప్రాంతాలకు వలస వెళుతూ ఉంటారు. వీరు ముగ్గురు తమ పిల్లలను తల్లిదండ్రుల వద్ద వదిలేసి వెళ్తారు. శివ నాయక్ (65) మాదిరిగానే పలువురు వ్రుద్ధులు తమ మనుమలు, మనుమరాళ్ల సంరక్షణ కోసం గ్రామాల్లోనే ఉంటారు.

Drought triggers flight of hardy ‘Palamur labour’ from south Telangana

'నేను ప్రతియేటా ఒకసారి మాత్రమే నా కొడుకులు, కోడళ్లను చూస్తుంటాను. వాళ్లు ఒకటి, రెండు నెలల పాటు ఇక్కడ ఉంటారు. వారు పని వెతుక్కుంటూ ముంబైకి గానీ, పుణెకు గానీ వెళ్లిపోతారు. నేను యువకుడిగా ఉన్పప్పుడు ఇదే చేశా. ఉపాధి వెతుక్కుంటూ నేనూ వెళ్లినట్లే నా పిల్లలూ వెళుతున్నారు' అని శివ నాయక్ తెలిపారు. కుటుంబం కాల చక్రం యధారీతిన తిరుగుతూనే ఉంటుందని శివ నాయక్ చెప్పారు.

కొద్దిమందికే హైదరాబాద్ పరిసరాల్లో భవన నిర్మాణ పనులు

మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లోని పలు గ్రామాలు, వాటి హామ్లెట్లలోని తండాల్లో నివసిస్తున్నపలు కుటుంబాల్లోని వ్యవసాయ కార్మికులు ఉపాధికోసం భారీగా వలస వెళుతుండటం సహజ పరిణామం. కేవలం ముంబై, పుణెలకు మాత్రమే కాక కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకూ వలస వెళుతుంటారు. వారిలో కొద్దిమందికి మాత్రం లక్కీగా హైదరాబాద్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగంలో పని లభిస్తుంది.

గమ్మత్తేమిటంటే ప్రతియేటా జిల్లా అధికారుల వద్ద ఎంత మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస వెళ్లారన్న విషయమై సంస్థాగతమైన సమాచారమేదీ లేదు. కార్మిక శాఖ వద్ద వారు తమ పేర్లు నమోదు చేసుకోనపపుడు వలస వెళుతున్న వారి వివరాలు తమ వద్ద ఎలా ఉంటాయని మహబూబ్ నగర్ కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ సయీద్ పేర్కొన్నారు. కార్మికశాఖ వద్ద ఉన్న అంచనాల ప్రకారం దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నుంచి ప్రతియేటా సుమారు 10 లక్షల మంది వలస వెళుతున్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రమే వలసలు ఎక్కువగా ఉంటాయని కార్మికశాఖ అధికారులు తెలిపారు. భారీగా వర్షాలు కురిస్తే మాత్రం వారంతా తిరిగి తమ గ్రామాలకు తిరిగి వస్తారని ఒక ప్రభుత్వాధికారి చెప్పారు.

సకాలంలో కురవని వర్షాలు.. కరుణించని కృష్ణా

ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా మహబూబ్ నగర్ జిల్లా కరువు భారీన పడింది. పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుంచి క్రుష్ణా నది నీటి జలాలు రాక మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయం దెబ్బ తిన్నది. తత్ఫలితంగా జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి - భీమా, కోయిల్ సారగ్ తదితర ఎత్తిపోతల పథకాల్లోకి నీరు రాలేదు. ఫలితంగా గత ఏడాది రెండు సీజన్లలో వ్యవసాయ పనుల్లేవు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్, మిషన్ భగీరథ పథకాల ద్వారా పనులు కల్పిస్తామని హామీలు గుప్పించింది. కానీ అధికారులు, కాంట్రాక్టర్లు మాత్రం యంత్రాలతోనే పనులు కానిచ్చేస్తున్నారని ధన్వాడ గ్రామ వాసి ఆనంద్ తెలిపారు.

ఇతర రాష్ట్రాల్లోనే కూలీ ఎక్కువ?

ఇతర రాష్ట్రాల్లో పని చేయడానికి వెళ్లిన వారి వద్ద కమిషన్లు తీసుకుంటారని నారాయణపేట్ వాసి ధీరా నాయక్ అనే కార్మికుడు తెలిపాడు. దక్షిణ తెలంగాణలో ప్రతిరోజూ కార్మికుడికి రూ.150 నుంచి రూ.200 వేతనం లభిస్తే, ముంబై, పుణెల్లో రూ.400 - 500 మధ్య ఉంటుంది. ముంబై, పుణెల్లో తమతో పని చేయించుకునేవారు కొంత అడ్వాన్స్‌తోపాటు ప్రయాణ ఖర్చులు కూడా ఇచ్చేవారని పేర్కొన్నారు. వలస కార్మికులు వెళ్లే చోటకు మహబూబ్ నగర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు వారిని తీసుకెళ్తాయి.

వలస వెళ్లే కార్మికుల సంఖ్యను బట్టి తాము బస్సు సర్వీసులు నడుపుతామని క్రుష్ణారెడ్డి అనే బస్సు డ్రైవర్ చప్పారు. టీఎస్ఆర్టీసీ బస్సులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ కూడా సర్వీసులు నడుపుతుంటాయి. ఆయా కార్మికులు చేసిన అప్పులు కూడా వారిని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేందుకు దారి తీస్తున్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి. పాత తరం వారు తమ పిల్లల విద్యాభ్యాసంపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. వలస కార్మికుల్లో అత్యధికులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించేందుకు తమ బంధువుల వద్ద వదిలి వెళతారని నారాయణ పేట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ బాలక్రుష్ణారెడ్డి తెలిపారు.

English summary
Palamur labour’ has a lot of demand in other parts of the country. The labourers hail from Mahbubnagar, the place once known as Palamur, and the name lives on through these migrant workers, who are known for their expertise in construction activities and hard work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X