హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ మాఫియాపై సర్కారు సీరియస్: సిట్ ఏర్పాటు, స్కూల్ పిల్లల నుంచి కాలేజీ..

హైదరాబాద్‌ నగరంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలో నిజానిజాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేసింది.డ్రగ్స్‌ కేసులో 11మందిని విచ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నగరంలో సంచలనం రేపుతున్న డ్రగ్స్‌ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలో నిజానిజాలను తేల్చేందుకు ఇద్దరు అధికారులతో సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ వెల్లడించారు. డ్రగ్స్‌ కేసులో 11మందిని విచారించామని ఆయన తెలిపారు.

హైదరాబాదులో డ్రగ్ రాకెట్: 21 మంది విఐపిలకు లింక్స్, వారిలో సినీ నిర్మాతలు?హైదరాబాదులో డ్రగ్ రాకెట్: 21 మంది విఐపిలకు లింక్స్, వారిలో సినీ నిర్మాతలు?

డ్రగ్స్‌ బాధితుల్లో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తేలిందని, వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడినట్లు సబర్వాల్‌ పేర్కొన్నారు. మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలో డ్రగ్స్‌ మూలాలను ఏరిపారేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

Drug bust: School kids high on LSD

పూర్తిస్థాయి దర్యాప్తుకు తక్షణమే సిట్‌ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. అలాగే డ్రగ్స్‌ పంపిణీదారులు, మధ్యవర్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు స్కూల్‌, కాలేజీ విద్యార‍్థులు డ్రగ్స్‌ బారినపడటంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో డ్రగ్స్‌ ఆనవాల్లు కనిపించకూడదని, కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాగ్రా, ఈ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ప్రధాన నిందితుడు కెల్విన్ మస్క్రెన్హాస్(29), మొహమ్మద్ అబ్దుల్ వాహెద్(20), అతడి సోదరుడు మొహమ్మద్ అబ్దుల్ ఖుడుస్(29)లను సోమవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారికి న్యాయస్థానం 14రోజుల పాటు రిమాండ్‌ విధించింది. కాగా నిందితుల విచారణలో అనేక సంచలనాత్మక అంశాలు వెలుగుచూశాయి. అనేక మంది బడా ఉద్యోగులు, సినీ నిర్మాతలు, పలు కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు డ్రగ్స్‌ సరఫరాదారులకు కస్టమర్లుగా ఉండటం అధికారులను విస్మయానికి గురిచేసింది.

చికాగో నుంచి కొరియర్ ద్వారా..

డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్.. చికాగో నుంచి కొరియర్ ద్వారా ఇక్కడకు తెప్పించి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. నాలుగు ఇంటర్నేషనల్ స్కూల్స్ కు చెందిన 9, 10తరగతుల విద్యార్థులు, 8 ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు, సినీ నిర్మాతలు, ఎమ్మెన్సీ కంపెనీల నిర్వాహకులు కూడా ఈ డ్రగ్స్ ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. డ్రగ్స్ సూత్రధారి కెల్విన్‌తో 1200మంది వీఐపీలతో సంబందాలున్నాయని గుర్తించారు. కెల్విన్ అరెస్టుతో ఒక్కొక్కటిగా నిజాలు బయటపడుతున్నాయి.

నా కొడుకు డ్రగ్స్ విక్రయించడు: కెల్విన్ తండ్రి బెర్నార్డ్

తన కొడుకు డ్రగ్స్ తీసుకుంటాడు కానీ, విక్రయించడని డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ తండ్రి బెర్నార్డ్ తెలిపారు. మంగళూరులో తన కొడుకు బీబీఎం చదువుతున్నాడని చెప్పారు. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నాడనేది అవాస్తవమని అన్నారు. అంతేగాక, పోలీసులు తమ ఇంట్లో తనిఖీలు చేసి కొంత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని కూడా బెర్నార్డ్ వెల్లడించడం గమనార్హం.

English summary
Excise officials on Sunday busted a three-member gang peddling drugs, including LSD, exposing the dark underbelly of the city where several school students were among their clientele. They recovered 700 dots of LSD worth Rs 20 lakh and 35gm of MDMA worth Rs 1.4 lakh from the peddlers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X