హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అప్పీల్ చేసుకుంటున్నాం: డ్రగ్స్ కేసులో కేసీఆర్‌కు ఇండస్ట్రీ తరపున పవన్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుపై ప్రముఖ టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసుపై ప్రముఖ టాలీవుడ్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కేసు విచారణ జరిగిన 10రోజులను సినీ ఇండస్ట్రీకి చీకటి రోజులుగా వర్ణిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు రాసిన లేఖలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

సినీ ఇండస్ట్రీ తరపున మీకు(సీఎం కేసీఆర్‌కు) అప్పీల్ చేసుకుంటున్నామని పవన్ పేర్కొన్నారు. 'తెలుగు సినిమా 2000 కోట్ల రూపాయలు దాటిన సంతోషంలో.. ఒక దర్శకుడికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన ఆనందంలో.. తెలుగు పరిశ్రమ వెలిగిపోతున్న సమయంలో.. మమ్మల్ని కమ్మిన గ్రహణం మాదక ద్రవ్యాల కేసు'అని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తమ లేఖలో పేర్కొంది.

ఈ మాదక ద్రవ్యాల కేసుని వెలుగులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఈ సమస్యను సున్నితంగా పరిష్కరించాలని తెలుగు మూవీ ఇండస్ట్రీ తమ లేఖలో పేర్కొంది. క్రమశిక్షణ లేని వారిపై చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వానికి సహకరిస్తామని స్పష్టం చేసింది.

డ్రగ్స్ కేసులో 12మంది టాలీవుడ్ ప్రముఖులు నోటీసులందుకుని.. ఎక్సైజ్ శాఖ సిట్ అధికారుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ప్రముఖ హీరో రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, సుబ్బరాజు, చార్మి, ముబైత్ ఖాన్, నవదీప్, తరుణ్, తనీష్, నందు, చిన్నా, శ్యాం కే నాయుడు, శ్రీనివాసరావు సిట్ ముందు హాజరయ్యారు.

English summary
Popular Telugu film actor and Jana Sena party chief Pawan Kalyan on Wednesday night took to Twitter and forwarded an appeal to Telangana Chief Minister K Chandrasekhar Rao, over the ongoing investigation into a massive drug racket busted in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X