హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రవితేజను అన్యాయంగా ఇరికిస్తున్నారు, షూటింగుల్లో ఇలా చెప్పేవారు'

డ్రగ్ కేసు నుంచి రవితేజ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు సిట్ కార్యాలయానికి తరలి వచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్ కేసు నుంచి రవితేజ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఆయన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విచారణ నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు సిట్ కార్యాలయానికి తరలి వచ్చారు.

రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?

ఎవరు, ఏమిటో తెలుసుకోకుండా ఆరోపణలా?

ఎవరు, ఏమిటో తెలుసుకోకుండా ఆరోపణలా?

తమ అభిమాన నటుడిపై ఆరోపణలు రావడం బాధాకరమని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు, ఏమిటి అనే విషయాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదన్నారు. తమకు తెలిసినంత వరకు ఆయన ఎలాంటి తప్పు చేయలేదన్నారు.

షూటింగుల సందర్భంగా సందేశాలిచ్చేవాడు

షూటింగుల సందర్భంగా సందేశాలిచ్చేవాడు

రవితేజ తప్పు చేయడనేది తమ ప్రగాఢ విశ్వాసమని, అందుకే తెలుగు రాష్ట్రాల నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి అభిమానులు తరలి వచ్చారని ఫ్యాన్స్ అన్నారు. రవితేజ షూటింగుల్లో ఉన్నప్పుడు అభిమానులు దగ్గరకు వెళ్తే మంచి సందేశాలు ఇచ్చేవారని తెలిపారు.

ఇలా చెప్పేవారు

ఇలా చెప్పేవారు

అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టవద్దని రవితేజ అభిమానులకు సూచించేవారని ఫ్యాన్స్ తెలిపారు. మంచి కార్యక్రమాలకు డబ్బును వినియోగించాలని చెప్పేవాడన్నారు. అలాంటి రవితేజ ఆరోపణలు బాధాకరమని చెప్పారు. కచ్చితంగా క్లీన్ చిట్‌తో బయటకు వస్తారన్నారు.

ఇరికిస్తున్నారని నినాదాలు

ఇరికిస్తున్నారని నినాదాలు

అంతకుముందు, ఉదయం సిట్ కార్యాలయం ముందు రవితేజ అభిమానులు ఆందోళన నిర్వహించారు. తమ హీరోను డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని నినాదాలు చేశారు. సిట్ విచారణపై నిరసన వ్యక్తం చేశారు. అభిమానుల సంఖ్య పెరుగుతుండడంతో సిట్ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు.

English summary
The Special Investigation Team (SIT) on Friday questioned Tollywood star Ravi Teja in connection with the Hyderabad drug case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X