• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అనవసరంగా కోర్టుకెక్కారా: పూరీని ఎందుకు లాగారు, చార్మి తొందరపడ్డారా?

|

హైదరాబాద్: డ్రగ్ కేసులో విచారణ కోసం హాజరయ్యే విషయంలో హైకోర్టుకు వెళ్లి సినీ నటి చార్మి తొందర పడ్డారా? అంటే అవుననే అంటున్నారు. హైకోర్టులో ఆమెకు పెద్దగా ఊరట లభించిందమీ లేదు.

షాకింగ్, బిగ్ షాట్స్ పేరు చెప్పిన నవదీప్: విదేశీ డ్రగ్ మాఫియాతో లింక్, అగ్రహీరోలు, హీరోయిన్లు

చార్మి విచారణ గడువు రోజు (బుధవారం) పూర్తికాకుంటే మరో రోజు పిలవాలని సిట్‌కు సూచించింది. సిట్‌ విచారణలో తనతో పాటు లాయర్‌ను అనుమతించాలన్న ఛార్మి విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

అసలు హైకోర్టుకు ఎందుకు వెళ్లారనేది ప్రశ్న?

అసలు హైకోర్టుకు ఎందుకు వెళ్లారనేది ప్రశ్న?

చార్మి అసలు హైకోర్టుకు ఎందుకు వెళ్లారనేది ప్రశ్నే అని చాలామంది అంటున్నారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పు తర్వాత ఎక్సైజ్ శాఖ స్పందించింది. చార్మి అనవసరంగా కోర్టుకు వెళ్లారని అభిప్రాయపడ్డారు. చార్మిని తాము నిందితురాలు అనలేదని, వివరణ కోరినట్లు చెప్పారు.

అనవసరంగా వెళ్లారనేందుకు ఇవీ కారణాలు అంటున్నారు

అనవసరంగా వెళ్లారనేందుకు ఇవీ కారణాలు అంటున్నారు

పూరీ జగన్నాథ్, తరుణ్, నవదీప్‌లను సుదీర్ఘంగా విచారించారు. వారి ఓకే అని చెప్పాకనే రాత్రి వరకు, అర్ధరాత్రి వరకు విచారించినట్లు సిట్ స్పష్టం చేసింది. చార్మీ మహిళ కాబట్టి సుదీర్ఘ విచారణకు అవకాశం లేదు. తొలుత అధికారులో ఆమెను రాత్రి వరకు విచారించరు. విచారణలో ఇబ్బంది పెట్టే అంశాలు ఉండవు. ఎందుకంటే విచారణను మొత్తం వీడియో తీస్తున్నట్లు అధిరులు స్పష్టం చేశారు. అధికారులు హద్దు మీరితే వీడియోలో స్పష్టంగా ఉంటుంది.

బలవంతపు సేకరణపై

బలవంతపు సేకరణపై

బలవంతంగా రక్త నమూనాలు సేకరిస్తున్నారనేది చార్మి ప్రధాన ఆరోపణ. కానీ దీని పైనా అధికారులు స్పష్టత ఇచ్చారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు ప్రతి ఒక్కరి నుంచి తాము శాంపిల్స్ సేకరించలేదని చెప్పారు. పూరీ జగన్నాథ్, తరుణ్‌ల నుంచి మాత్రమే శాంపిల్స్ తీసుకున్నట్లు చెప్పారు. నటుడు నవదీప్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరిస్తే తీసుకోలేదు. దానిని డైరీలో రాశారు. అలాగే, చార్మీ ఇవ్వనని చెప్పినా తాము బలవంతంగా తీసుకోమని అంటున్నారు.

పూరీ జగన్నాథ్‌ను ఎందుకు లాగారు?

పూరీ జగన్నాథ్‌ను ఎందుకు లాగారు?

పూరీ జగన్నాథ్ నుంచి బలవంతంగా శాంపిల్స్ సేకరించినట్లు చార్మీ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, పూరీ అనుమతితోనే తాము తీసుకున్నట్లు సిట్ అధికారులు చెప్పారు. పూరీ కూడా సోషల్ మీడియాలో సిట్ అధికారులపై అభాండాలు వేయలేదు. కానీ తనకు డ్రగ్స్ అలవాటు లేదని మాత్రం చెప్పారు. పూరీతో చార్మికి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దీంతో ఆయన ఆమెకు వ్యక్తిగతంగా చెప్పారా అనే చర్చ సాగుతోంది.

దర్యాఫ్తు బృందంలో మహిళా అధికారి

దర్యాఫ్తు బృందంలో మహిళా అధికారి

దర్యాఫ్తు బృందంలో మహిళా అధికారులు ఉండాలని చార్మీ పేర్కొన్నారు. విచారణ బృందంలో మహిళా అధికారి విజయలక్ష్మి ఉన్నట్లు అధికారులు ముందుగానే చెప్పారు. ఆమెకు కొంత ఊరటనిచ్చేలా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. న్యాయస్థానం చెప్పకపోయినా వాటిని అధికారులు ఫాలో అవుతారని అంటున్నారు. మహిళ కాబట్టి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ, విచారణ బృందంలో మహిళా అధికారి ఉండటం.. వీటిని సిట్ అధికారులు కూడా ఫాలో అయ్యే వారని అంటున్నారు. పైగా తన వెంట లాయర్ ఉండాలన్న చార్మి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.

డ్రగ్స్ కేసులో షాకింగ్

డ్రగ్స్ కేసులో షాకింగ్

డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో సినీ తారలు అలో వీరా జ్యూస్ తాగి వస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. డ్రగ్ తీసుకున్నట్లుగా తెలియకుండా ఉండేందుకు అలా చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా, డ్రగ్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actress Charmi Kaur has managed to get some relief in the massive drug scandal. The actress petitioned in Hyderabad High Court seeking women officials for interrogation her and requested for the presence of her lawyer during the questioning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more