'సినీ స్టార్స్‌ను గంటల కొద్దీ విచారిస్తున్నారు సరే, వారి మాటేమిటి'
హైదరాబాద్: సంలచలనం సృష్టిస్తోన్న డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం చిన్న చేపల్ని పట్టుకొని తిమింగలాల్ని వదిలేస్తోందని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు.
చదవండి: చార్మీ సహా అందరికీ అకున్ గట్టి జవాబు, అందుకే సినీ స్టార్స్ పేర్లు!
దేశ, విదేశాల నుంచి డ్రగ్స్‌ను తెస్తున్న వారిని పట్టుకొనే సమర్థత రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు లేదని అభిప్రాయపడ్డారు. సినీ తారలను గంటల కొద్దీ విచారిస్తున్న అధికారులు పెద్దల పేర్లు బయటకు వచ్చినప్పటికీ వారికి నోటీసులు ఇస్తున్న దాఖలాల్లేవన్నారు.

ఈ అంశంలో పటిష్ఠ చర్యలు తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని శాఖల సహకారం తీసుకోవాలన్నారు. సిబిఐకి అప్పగించాలన్నారు.
చదవండి: డ్రగ్ రాకెట్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్‌కు ఝలక్
రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖుల బంధువుల పబ్‌లపై దాడులు చేయడం లేదన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్‌తో పాటు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!