• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డ్రగ్స్ కేసు: ముగిసిన ముమైత్ విచారణ, తిరిగి బిగ్ బాస్ షోకు? రేపు ‘మాస్ మహరాజా’

By Ramesh Babu
|

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఐటెం సాంగ్స్ గర్ల్ ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. సుమారు ఆరున్నర గంటలపాటు ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. హైకోర్టు నిబంధన మేరకు సాయంత్రం 5 గంటల లోపలే అధికారులు తమ విచారణ ముగించారు. విచారణ ముగియగానే ముమైత్ తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు.

బిగ్ బాస్ షో ప్రతినిధులతో కలిసి పూణే నుంచి హైదరాబాదు చేరుకున్న ముమైత్... వారితో కలిసి ఉదయం 9.30 గంటలకే సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం సిట్ కార్యాలయంలోకి వెళ్లేటప్పుడు కూడా ముమైత్ ఖాన్ చాలా కూల్ గా కనిపించారు.

వెళ్లేముందు కూల్.. లోపల మాత్రం..

వెళ్లేముందు కూల్.. లోపల మాత్రం..

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా గురువారం ఐటెం సాంగ్స్ గర్ల్ ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు విచారించారు. విచారణకు వెళ్లే సమయంలో కూల్ గా కనిపించిన ముమైత్ ఖాన్ విచారణ సందర్భంగా అధికారులు ప్రశ్నల వర్షం కురిపించడంతో ఉక్కిరిబిక్కరి అయ్యారు. ఉదయం నుంచి కెల్విన్ తో సంబంధాలు, డ్రగ్స్ వినియోగం, సరఫరా, పార్టీ లైఫ్ వంటి విషయాలపై ముమైత్ ఖాన్ నుంచి పలు వివరాలు రాబట్టారు.

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ముమైత్

ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన ముమైత్

ముంబై కేంద్రంగా చాలకాలంగా పనిచేశారు కదా.. ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయా? డ్రగ్స్ సరఫరా చేసే వారు మీ ద్వారానే హైదరాబాద్ టాలీవుడ్ పెద్దలకు పరిచయం అయ్యారా? మీరు డ్రగ్స్ తీసుకునే వారా? లేక అమ్మకాలేమైనా జరిపారా? పబ్‌లకు వెళ్లే అలవాటు ఉందా? ఖాళీ సమయాల్లో వారంతాల్లో ఎక్కడ గడిపేవారు? పూరి, చార్మితో పరిచయం ఎప్పటినుంచి ఉంది? పోకిరి సినిమాతోనే పూరికి మీరు క్లోజ్ అయ్యారా?

తెలుగు సినిమా ఇండ్రస్టీకి రాకముందు మీరు ఏం చేసేవారు? హైదరాబాద్‌ని విడిచి ముంబాయికి ఎందుకు వెళ్లారు? అంటూ సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది.

ఇవే ఆ ప్రశ్నలు...

ఇవే ఆ ప్రశ్నలు...

ముమైత్ ఖాన్ విచారణ సందర్భంగా డ్రగ్ డీలర్ కెల్విన్ తో పరిచయం గురించి ఇంకా ఇతర నటులతో ఉన్న పరిచయాల గురించి సిట్ అధికారులు ఎక్కవగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో ఎలా పరిచయం? కేవలం సినిమా పంక్షన్స్‌లో మాత్రమే కెల్విన్‌తో కలిసేవారా? ఐటమ్ సాంగ్స్‌లో నటించే మీరు.. చిత్ర యూనిట్‌తో బ్యాంకాక్, విదేశాలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? నెలకోసారి జరిగే గోవా ఫెస్టివెల్స్‌లో ఏం తీసుకోనేవారు? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు వీకెండ్ లో ఎక్కువగా ఎవరి పబ్‌లకు వెళ్లేవారు? తరుణ్, నవదీప్ పబ్‌లకు ఎన్నిసార్లు వెళ్లారు? రెండేళ్లుగా ముంబాయిలో ఉంటూ హైదరాబాద్‌లో షూటింగ్ ల కోసమే వచ్చేవారా? హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉన్నారు?

మళ్లీ ‘బిగ్ బాస్ షో’కు ముమైత్?

మళ్లీ ‘బిగ్ బాస్ షో’కు ముమైత్?

హైకోర్టులో హీరోయిన్ ఛార్మీ పిటీషన్ వేసిన నేపథ్యంలో సిట్ అధికారులు అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించడం మానేశారు. గురువారం నాటి విచారణలో కూడా ముమైత్ ఖాన్ నుంచి వారు ఎలాంటి రక్త నమూనాలు సేకరించనట్లు తెలుస్తోంది. విచారణ ముగియగానే ముమైత్ తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగారు. మళ్లీ తిరిగి ఆమె బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరినీ కలవకుండా, కనీసం ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు.

రేపు సిట్ ముందుకు ‘మాస్ మహరాజా’...

రేపు సిట్ ముందుకు ‘మాస్ మహరాజా’...

డ్రగ్స్ కేసులో విచారణకు శుక్రవారం హీరో రవితేజ హాజరుకానున్నరు. రవితేజ, డగ్ర్స్ డీలర్ కెల్విన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. కెల్విన్ ఫోన్ లో హీరో రవితేజ నంబర్ అధికారులకు దొరికింది. జీషాన్ తో రవితేజకు ఆరేళ్ల నుంచి పరిచయం ఉందని, అతడే రవితేజను కెల్విన్ కు పరిచయం చేశాడని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం హీరో రవితేజ సిట్ అధికారుల విచారణకు హాజరుకావడం కీలకంగా మారింది.

కీలక అంశాలు వెలుగులోకి..?

కీలక అంశాలు వెలుగులోకి..?

సిట్ నోటీసులు జారీ చేసినవారిలో రవితేజ పేరు వెలుగు చూడడంతో టాలీవుడ్ నిర్ఘాంతపోయింది. ఈ మధ్యే కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన రవితేజ తమ్ముడు భరత్ పలు సందర్భాల్లో డ్రగ్స్ వివాదంలో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో రవితేజ పేరు చెడగొడుతున్నాడంటూ భరత్ పై విమర్శలు కూడా వెలువడ్డాయి. అయితే కెల్విన్, జిషాన్ ల విచారణలో షాక్ అయ్యే అంశాలు వెలుగు చూశాయి. వీరిద్దరి విచారణలో కూడా రవితేజ పేరు వెలుగు చూసింది. విచారణలో భాగంగా.. హీరో రవితేజకు డ్రగ్స్ తానే సరఫరా చేసినట్లు జిషాన్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా, డ్రగ్ డీలర్ కెల్విన్ కు రవితేజను పరిచయం చేసింది కూడా తానే అని చెప్పడంతో ఈ కేసులో హీరో రవితేజను కీలకమైన వ్యక్తిగా సిట్ అధికారులు అనుమానిస్తున్నారు . శుక్రవారం నాటి విచారణలో రవితేజ నుంచి మరిన్ని కీలక అంశాలు వెలుగుచూసే అవకాశాలున్నట్లు వారు భావిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bigg Boss Telugu contestant and actress Mumaith Khan on Thursday morning appeared before the special investigation team (SIT) of the Telangana Prohibition and Excise Department in Hyderabad that is probing a drug racket. Khan is the eighth person from the Telugu film industry to appear before the SIT, which has summoned 12 persons, including directors and actors, for questioning in the case. Khan reached Hyderabad SIT office today morning after she was served with a notice by the excise department as part of the ongoing investigation into Tollywood's involvement in the drug racket. By everning 5 Mumaith's enquiry was completed. Again she is going to Big Boss Show, it seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more