హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత .. నలుగురి ముఠా అరెస్ట్ , కోటి విలువచేసే డ్రగ్స్ స్వాధీనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ లో డ్రగ్స్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. అత్యంత ప్రమాదకరమైన హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు డ్రగ్స్ మాఫియా. ఎప్పటికప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాఫియా పట్టుబడుతున్నా వీరిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి, డ్రగ్స్ మాఫియా కి చెక్ పెట్టడంలో విఫలమవుతున్నారు సంబంధిత శాఖల అధికారులు.

భారీగా పట్టుబడిన హెరాయిన్ , కొకైన్ ... నలుగురు అరెస్ట్

ఇక తాజాగా హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఎస్‌ఓటీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా కొకైన్, హెరాయిన్ డ్రగ్స్ లభ్యమయ్యాయి. వీటి విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌కు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా తమ కార్యకలాపాతను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ నిర్వహిస్తోందని పోలీసులు వెల్లడించారు.
ఇక వీరి వెనుక ఎవరున్నారు? వీరు ఈ డ్రగ్స్ ని ఎవరెవరికి విక్రయిస్తున్నారు? ఏయే ప్రాంతాల్లో వీరి కార్యకలాపాలు సాగిస్తున్నారు? వీరి వెనుక ఉన్న బడా నేతలు ఎవరు? అసలు వీరి ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ సేకరిస్తున్నారు? హైదరాబాద్ నగరంలో ఎంతమంది డ్రగ్స్ మాఫియా లీడర్లు ఉన్నారు ? వంటి అన్ని కోణాల్లోనూ సంబంధిత శాఖ అధికారులు, మరియు పోలీసులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది.

Drugs seized in Hyderabad... four members arrest , seized Drugs worth one crore

ఇటీవల ఒక విదేశీ మహిళ నుండి కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఇటీవల ఓ విదేశీ మహిళ కొకైన్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడింది .స్టూడెంట్స్‌ని టార్గెట్‌గా చేసుకుని డ్రగ్స్ దందా చేస్తున్న ఓ విదేశీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళను ఘనా దేశస్తురాలిగా గుర్తించారు. ఆమె నుంచి 50 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక తాజాగా మరో నలుగురు ముఠా ను పట్టుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో స్టూడెంట్స్ టార్గెట్ గా డ్రగ్స్ మాఫియా చెలరేగి పోతూనే ఉంది. డ్రగ్స్ మాఫియా పై ఉక్కు పాదం మోపడానికి అటు పోలీసులు, ఇటు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, నార్కోటిక్స్ అధికారులు ఎంతగా ప్రయత్నం చేసినా చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరిస్తూనే ఉంది. పోలీసుల కళ్లు గప్పి స్టూడెంట్స్ కు డ్రగ్స్ సరఫరా జరుగుతూనే ఉంది. డ్రగ్స్ మాఫియాపై ఉక్కు పాదం మోపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించకుండా పూర్తిగా ఈ మాఫియాఆట కట్టించాలి.

English summary
Drugs mafia has been engaged in their activities and Hyderabad has been stunned. Drugs Mafia is supplying Drugs as they targetted the Students in Hyderabad. Converting the young people to drug addicts.Today 4 mafia members was taken into custody by the police. Police seized cocaine and heraine from them and the drugs worth one crore rupees .The police are investigating the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X