హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రంక్ అండ్ డ్రైవ్: కారు ప్రమాదంలో సస్పెండైన బాసర టెంపుల్ మాజీ ఉద్యోగి మృతి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో మరో డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 78లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో ఓ కారు చెట్టును ఢీకొనడంతో ఒకరు మరణించగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

సిటీలో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్: నిర్వాహకులు, ఢిల్లీ, రష్యా యువతుల అరెస్ట్సిటీలో ఇంటర్నేషనల్ సెక్స్ రాకెట్: నిర్వాహకులు, ఢిల్లీ, రష్యా యువతుల అరెస్ట్

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌కు చెందిన వివేక్‌రాజ్‌, పృథ్వీరాజ్‌, చెన్నకేశవలతో పాటు బాసర ఆలయ ఉద్యోగి విశ్వజిత్‌(బాసర ఆలయ ప్రధాన అర్చకుడి అల్లుడు) కలిసి శుక్రవారం రాత్రి కారులో మణికొండకు వెళ్లారు. అక్కడ మద్యం సేవించి వారు రాత్రి 2గంటల ప్రాంతంలో ఫిల్మ్‌నగర్‌లోని బాటా వద్ద టిఫిన్‌ చేశారు. అక్కడ నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 78లోని వివేక్‌ ఇంటికి బయలు దేరారు.

 మద్యం మత్తులో..

మద్యం మత్తులో..

మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతామన్న సమయంలో వివేక్‌ అతివేగంగా కారును నడిపాడు. దీంతో వాహనం అదుపుతప్పి ఫుట్‌ఫాత్‌ను తాకి పల్టీలు కొట్టింది. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న చెట్టుకు కారు వెనుక భాగం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో విశ్వజిత్‌(33) తీవ్రంగా గాయపడి కారు డోర్‌లో ఇరుక్కుపోయాడు.

 విశ్వజిత్ మృతి

విశ్వజిత్ మృతి

స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సమాచారం ఇచ్చారు. విశ్వజిత్‌ను అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. సంఘటనలో స్వల్పగాయాలైన చెన్నకేశవ, వివేక్‌లను 108 ద్వారా టోలీచౌక్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం బర్కత్‌పురలోని సీసీషరాఫ్‌ ఆస్పత్రికి తరలించారు.

 సీటు బెల్టు పెట్టుకోవడంతో..

సీటు బెల్టు పెట్టుకోవడంతో..

సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవడం, బెలూన్‌లు తెరచుకోవడంతో పృథ్వీరాజ్‌కు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. జరిగిన ఘనటపై జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 విగ్రహ తరలింపు వివాదంలో సస్పెండైన విశ్వజిత్

విగ్రహ తరలింపు వివాదంలో సస్పెండైన విశ్వజిత్

కాగా, కారు ప్రమాదంలో మృతి చెందిన విశ్వజిత్ బాసర సరస్వతీ ఆలయంలో ప్రధాన అర్చకుడి మేనల్లుడు. విశ్వజిత్ బాసర ఆలయంలోని విగ్రహ తరలింపు వివాదంలో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో కొద్ది రోజుల ఆయనతోపాటు మరో ఇద్దరు సస్పెండ్ అయ్యారు.

English summary
One killed and Three injured in a car accident, occurred in Jubilee hills in Hyderabad on Saturday earliy morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X