నగ్నంగా చిందులేసిన యువతి: పోలీసులు దుస్తులు వేసినా.., చివరకు ఇంటికి
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో నగ్నంగా చిందులేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహ్మత్ నగర్ పోలీస్ అవుట్ పోస్టు సమీపంలోని పార్కు వద్ద బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

గమనించిన మహిళా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెకు దుస్తులు వేశారు. ఆ తర్వాత కొద్ది సేపటికే వేసిన బట్టలను కూడా చించేసుకుంది. దీంతో మరోసారి పోలీసులు ఆమెకు దుస్తులు వేశారు.

కాగా, కూకట్‌పల్లికి చెందిన తన ప్రియుడు భరత్ తనను మోసం చేశాడని ఆ యువతి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంటానంటూ యువకుడికి ఫోన్ చేసినట్లు వెల్లడించింది. ఆ తర్వాత యువతి ఈ విధంగా ప్రవర్తించినట్లు పోలీసులు తెలిపారు. యువతికి మద్యం మత్తు దిగే వరకు ఆశ్రయం ఇచ్చిన పోలీసులు.. ఆ తర్వాత ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు.
ప్రేమోన్మాదికి యావజ్జీవం
ప్రేమించానంటూ వేధింపులకు గురిచేసి చివరికు కిరాతంగా యువతి గొంతుకోసి హత్య చేసిన ప్రేమోన్మాదికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వారాసిగూడకు చెందిన ఆరెపల్లి వెంకట్(25), బౌద్ధనగర్ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమోన్మాదంతో 2018 ఆగస్టు 7న ఆర్ట్స్ కళాశాల రైల్వే స్టేషన్ పక్కన గల పోలీస్ క్వార్టర్స్‌లో గొంతుకోసి హత్య చేశాడు. కాగా, కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నారాయణ వాదించారు. విచారణ అనంతరం బుధవారం నాంపల్లిలోని రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి.. దోషికి జీవిత ఖైదుతోపాటు రూ. 10వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.