హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో భారీ వర్షం: అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వరదనీరు, కారులో నిద్రిస్తున్న డ్రైవర్ మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

పార్కింగ్ చేసిన కారులోకి వరదనీరు వెళ్లి వ్యక్తి మృతి

​హైదరాబాద్‌: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌ నగరంలో బీభత్సం సృష్టించింది. అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయ్యాయి. రోడ్ల మీద మోకాలు లోతులో నీళ్లు చేరడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం అర్థరాత్రి భారీ వర్షం పాతం(3 సెం.మీ) నమోదైంది.

Dry spell ends, Hyderabad receives 3 cm rainfall

అంబర్‌పేట్‌లో 48 మి.మీటర్లు, నారాయణగూడ 31.8, నాంపల్లి 27.8, ఎల్బీ నగర్‌ 22.5, జాబ్లీహిల్స్‌ 16 మి. మీటర్ల వర్షంపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సెల్లార్‌లోకి వరద నీరు: కారులో నిద్రిస్తున్న డ్రైవర్ మృతి

కాగా, శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షం ఓ యువకుడి ప్రాణం తీసింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి కూకట్‌పల్లిలోని జయనగర్‌లో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి భారీగా వరదనీరు చేరుకుంది. సెల్లార్‌లో పార్కింగ్ చేసిన కారులో నిద్రించిన గోపీ అనే యువకుడు వరదనీరు రావడంతో అందులోనే మృతి చెందాడు.

Dry spell ends, Hyderabad receives 3 cm rainfall

శనివారం తెల్లవారుజామున గమనించిన అపార్ట్‌మెంట్ సిబ్బంది, అక్కడ నివాసం ఉండేవారు సెల్లార్‌లోని నీటిని తోడేసి.. కారులోని గోపీ మృత దేహాన్ని బయటికి తీశారు. ఉదయం డ్యూటీ ఉండటంతోనే అతడు కారులు పడుకున్నట్లు తెలుస్తోంది. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేయడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. సదరు అపార్ట్‌మెంట్ పక్కనే చెరువు ఉందని తెలిపారు.

English summary
Breaking a dry spell, Hyderabad received 3 cm of rainfall on Friday under the influence of a cyclonic circulation that has formed over the West Central Bay of Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X