• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాంగ్రెస్ గూటికి డీఎస్: కుమారుడు సంజయ్ తో కలిసి సోనియాగాంధీ సమక్షంలో.. ముహూర్తం ఫిక్స్

|
Google Oneindia TeluguNews

ధర్మపురి శ్రీనివాస్... మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇది చాలా మంది రాజకీయ నాయకులు ఊహించిందే. కొంతకాలంగా నిజామాబాద్ రాజకీయాలలో చర్చ జరుగుతున్న అంశమే. అయితే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న డిఎస్ కాంగ్రెస్ చేరికకు ముహూర్తం ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నడీఎస్

సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరనున్నడీఎస్

ప్రముఖ రాజకీయ నాయకుడు, టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్ జనవరి 24న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్ గూటికి చేరనున్నారని సమాచారం. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సీనియర్ నాయకుడు డీ. శ్రీనివాస్ చాలా కాలం పాటు వహించిన నిశ్శబ్దం తర్వాత, అనేక చర్చల తర్వాత తిరిగి తన సొంత పార్టీలోకి రావాలని నిర్ణయించుకున్నారు. డిసెంబరు 16న ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయిన ఆయన ఈ భేటీ అనంతరం మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు కృతనిశ్చయంతో ఉన్నారని ఊహాగానాలు వచ్చినా.. రాజ్యసభ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని మళ్ళీ ఒక్కడుగు వెనక్కు వేశారు.

అనేకమార్లు చర్చలు, సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ పార్టీ బాట పట్టిన డీఎస్

అనేకమార్లు చర్చలు, సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ పార్టీ బాట పట్టిన డీఎస్

ఇక తాజాగా డీ. శ్రీనివాస్ కు టీఆర్ఎస్ పార్టీపై విరక్తి పెరగడంతో రాజ్యసభ ఎంపీ పదవిని త్యాగం చేసేందుకు సిద్ధమైనట్లు భావిస్తున్నారు. చాలా కాలంగా నిజామాబాద్‌లో స్థానిక రాజకీయాల కారణంగా ధర్మపురి శ్రీనివాస్ మరియు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు మధ్య దూరం పెరిగింది. పొమ్మనకుండా డీఎస్ కు పొగబెట్టిన పరిస్థితిని సృష్టించారు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. అయినప్పటికీ చాలా కాలంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా స్తబ్దుగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ తాజాగా సోనియా గాంధీని కలవడానికి ముందు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పుడు శ్రీనివాస్ బీజేపీలో చేరతారని పుకార్లు బలంగా వినిపించాయి. కానీ ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోలేదు.

రాజ్య సభ సభ్యునిగా పదవీకాలం 2022 జూన్ తో పూర్తి

రాజ్య సభ సభ్యునిగా పదవీకాలం 2022 జూన్ తో పూర్తి

తెలంగాణ ఏర్పడే వరకు కాంగ్రెస్‌లో కొనసాగిన మాజీ మంత్రి 2015లో టీఆర్‌ఎస్‌లో చేరి.. గులాబీ పార్టీలో చేరిన వెంటనే ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన పదవీ కాలం ఈ ఏడాది జూన్‌తో ముగియనుంది. గత కొన్నేళ్లుగా టీఆర్‌ఎస్‌తో అనుబంధం ఉన్నప్పటికీ, శ్రీనివాస్ కాంగ్రెస్ హైకమాండ్‌తో టచ్‌లో ఉన్నారు.

ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. డీఎస్ అనారోగ్యం బారిన పడిన సమయంలో కూడా రేవంత్ రెడ్డి, కుసుమ్ కుమార్ లు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. గతంలో ఆంధ్ర ప్రదేశ్ పిసిసి చీఫ్‌గా రెండుసార్లు పనిచేసిన అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితానికి దగ్గరగా ఉన్న ప్రజా నాయకుడు కావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం స్వాగతిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ముహూర్తం రేడే, జనవరి 24 డేట్ ఫిక్స్

కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ముహూర్తం రేడే, జనవరి 24 డేట్ ఫిక్స్

ఈ క్రమంలోనే ఆయన జనవరి 24న, కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసిన తన పెద్ద కుమారుడు, నిజామాబాద్ మాజీ మేయర్ డి సంజయ్‌తో సహా తన అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్నారు డి శ్రీనివాస్. నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన డి.శ్రీనివాస్ , నిజామాబాద్ రాజకీయాలను ఎలా మలుపు తిప్పాలో తెలిసిన దిట్టగా, మంచి వ్యూహాకర్త గాను పేరుంది. డీఎస్ మళ్లీ సొంత గూటికి చేరాలని నిర్ణయించడం నిజామాబాద్ జిల్లాలో, కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి మార్పులకు కారణమవుతుందో వేచి చూడాలి.

English summary
TRS MP, D.Srinivas ready to join in Congress In the presence of Sonia Gandhi along with his son Sanjay on january 24 of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X