రేవంత్ రెడ్డి మంత్రాంగం: బీజేపీకి షాక్ - తీసేసిన తహశీల్దార్లా హరీశ్ రావు - దుబ్బాకలో కాంగ్రెస్ ఎంపీ
పోలింగ్ తేదీ తగ్గర పడుతున్నకొద్దీ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార టీఆర్ఎస్ చెమటోడ్చాల్సిన పరిస్థితి ఒకవైపు.. సర్వశక్తులు ఒడ్డుతోన్న కాంగ్రెస్ మరోవైపు.. యాంటీ టీఆర్ఎస్ ఓటు తమదేనన్న నమ్మకంతో బీజేపీ.. ఇలా ఎవరికివారే భిన్నవ్యూహాలతో ముందుకు సాగుతుండగా.. కీలక నేతల జంపింగులు అన్ని పార్టీలకు సవాలుగా మారాయి. ఈ క్రమంలోనే సోమవారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పీకే వల్ల భారీ డ్యామేజ్: సొంత రాష్ట్రంలో పాత్రపై బీజేపీ విమర్శలు - దిమ్మతిరిగేలా ఎదురుదాడి

బీజేపీకి భారీ షాక్...
దుబ్బాక అసెంబ్లీకి ఉప ఎన్నికలో అందరికంటే ముందుగా ప్రచారం ప్రారంభించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రాబబుల్ విన్నర్ గా చర్చల్లో నిలిచారు. కానీ సొంత పార్టీ నుంచే ఆయనపై తీవ్ర వ్యతిరేకత రావడం, కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస రెడ్డిని బరిలోకి దింపిన తర్వాత లైమ్ లైట్ నుంచి దూరంగా జరిగినట్లయింది. రఘునందన్ రావుపై రేప్ కేసును ఉదహరిస్తూ, అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని దుబ్బాక బీజేపీ సీనియర్ నేత తోట కమలాకర్ రెడ్డి ప్రశ్నించగా, ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఇప్పుడు అదే కమలాకర్ రెడ్డి తన మద్దతును కాంగ్రెస్ అభ్యర్థికి అందించడం ద్వారా బీజేపీకి భారీ షాకిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నెరపిన మంత్రాంగం సఫలమైంది.
ఆ విషయంపై గట్టిగా ప్రచారం చేయండి - మెసేజ్ క్లియర్గా వెళ్లాలి - సీఎం జగన్ కీలక ఆదేశాలు

కమలాకర్ ఇంటికి రేవంత్..
దుబ్బాక నియోజకవర్గ కీలక నేతగా, తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడిగా కొనసాగి, ఇటీవలే బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన తోట కమలాకర్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా కమలాకర్ కు రేవంత్ సూచించారు. భేటీ అనంతరం మీడియాతో రేవంత్ మాట్లాడుతూ, టీఆర్ఎస్ పై పోరులో కమలాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని, దుబ్బాకలో బీజేపీ జెండాను మోసిన నాయకుడిని కాదని... ఒకే వ్యక్తికి మూడోసారి అవకాశం ఇచ్చారని విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవాలంటే యువ నాయకులు అవసరమని, అందుకే కాంగ్రెస్ లో చేరాలని కమలాకర్ ను అడిగానని చెప్పారు. అంతేకాదు,

తీసేసిన తహశీల్దార్లా హరీశ్
దళితులకు మూడెకరాల భూమి మొదలుకొని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల దాకా ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని, ఉద్యమకారులకు అన్యాయం చేసి, తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు ఇచ్చారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ను ఓడించడానికి ప్రజలంతా ఏకమవుతున్నారని, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతోనే ఆ మార్పు ఫలితాలు వస్తాయన్నారు. టీఆర్ఎస్ లో హరీశ్ రావు పరిస్థితి తీసేసిన తహశీల్దార్ మాదిరి తయారైందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.