వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్

|
Google Oneindia TeluguNews

సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. టికెట్ ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించిన మాధవనేని రఘునందన్ రావుకు వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే హైకమాండ్ కు ఫిర్యాదు చేయడం కీలకంగా మారింది. సుదీర్ఘ సస్పెన్స్ తర్వాత మంగళవారం రాత్రి రఘునందన్ ను తమ అభ్యర్థిగా బీజేపీ ఖరారు చేసింది. అయితే, పార్టీలో గొడవలు మాత్రం అంతకంతకూ పెరిగాయి..

దున్నపోతుపై వచ్చి దుమ్మురేపాడు - క్రేజీ కాదు, సెంటిమెంట్ - రాజకీయ చైతన్యంలో బీహార్ ప్రత్యేకత తెలుసా?దున్నపోతుపై వచ్చి దుమ్మురేపాడు - క్రేజీ కాదు, సెంటిమెంట్ - రాజకీయ చైతన్యంలో బీహార్ ప్రత్యేకత తెలుసా?

రేపిస్టుకు టికెటా?

రేపిస్టుకు టికెటా?

గత రెండు పర్యాయాలు దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యంకాగా, ఈసారి కూడా టికెట్ తనదేననే ధీమాతో రఘునందన్ అందరికంటే ముందే ప్రచారం ప్రారంభించారు. చివరికి హైకమాండ్ కూడా అతని పేరునే ఖరారు చేయడంతో అసమ్మతి నేతలు భగ్గుమన్నారు. రఘునందన్ రావుపై రేప్ అభియోగాలు ఉన్నాయని, అలాంటి వ్యక్తికి టికెట్ ఇస్తే బీజేపీకి తీరని నష్టం కలుగుతుందని, పార్టీ ప్రతిష్ట దిగజారిపోతుందని సీనియర్ నేత తోట కమలాకర్ రెడ్డి అన్నారు. అంతేకాదు..

టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడు..

టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడు..

‘‘దుబ్బాక టిక్కెట్‌ విషయంలో బీజేపీ పునరాలోచించుకోవాలి. రేపిస్టు రఘునందన్ రావుకు టికెట్ ఇచ్చారు. పార్టీ చీఫ్ బండి సంజయ్ దుబ్బాకలో ఏమని ప్రచారం చేస్తారు? ఇతను కాకుండా మరో నేతకు అవకాశం కల్పించాలి'' అని కమలాకర్ రెడ్డి అన్నారు. అయితే కమలాకర్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నేతలు మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలకు అమ్ముడు పోయి కమలాకర్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా తోట కమలాకర్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించినట్లు ప్రకటన కూడా వెలువడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ.. రఘునందన్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కమలాకర్ రెడ్డి ఈ మేరకు ఆరోపణలు చేశారు.

మొన్న రూ.40 లక్షలు.. నేడు రూ.2లక్షలు..

మొన్న రూ.40 లక్షలు.. నేడు రూ.2లక్షలు..

అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రలోభాల పర్వం జోరుగా సాగుతున్నది. ఈనెల 5వ తేదీ రాత్రి హైదరాబాద్ శివారులోని శామీర్‌పేట సమీపంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌టాక్స్‌ సమీపంలో ఎస్‌ఓటీ పోలీసులు రూ.40 లక్షల నగదును పట్టుకున్నారు. ఆ డబ్బు బీజేపీ నేత రఘునందన్ కు చెందిందిగా భావిస్తున్నట్లు బాలానగర్ డీసీపీ పద్మజ మీడియాకు చెప్పారు. భూంపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని అక్బర్‌పేట చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ కారులో తరలిస్తున్న రూ. 2 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. కారులో డబ్బులు తరలిస్తున్న వ్యక్తిని ములుగు జిల్లా సింగరకుంటపల్లికి చెందిన సీహెచ్ రాజేందర్‌గా పోలీసులు గుర్తించారు. ఇది కూడా ఎన్నికల కోసమేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Recommended Video

Kishan Reddy Slams CM KCR For His Comments On Centre

రెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూరెండో భార్యగా స్వీకరించాడు: బీజేపీ మహిళా కార్యకర్త సంచలనం - రాసలీలల్లో ఇంకొందరు నేతలంటూ

English summary
Tota Kamalakar Reddy, a bjp leader of dubbaka assembly constituency opposed Raghunandan Rao's candidature, Kamalakar Reddy commented that bjp would lose if it gave a ticket to such a person. minuits after his comments, Kamalakar Reddy has been suspended from the BJP. Meanwhile, police seized Rs 40 lakh believed to belong to Raghunandan Rao. in an other incident, a car in Siddipet on Wednesday, Rs. 2 lakhs were also seized by the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X