వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్ 3న దుబ్బాక ఉపఎన్నిక - ఈసీ షెడ్యూల్- అమల్లోకి కోడ్ - జీహెచ్ఎంసీ పోల్స్ పైనా ఫోకస్

|
Google Oneindia TeluguNews

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 56 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 3, నవంబర్ 7 తేదీల్లో ఉప ఎన్నికల పోలింగ్ ఉంటుందని, వీటి ఫలితాలు బీహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల ఫలితాలతోపాటే నవంబర్ 10న వెల్లడవుతాయని ఈసీ పేర్కొంది. అందులో భాగంగా..

డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఫ్యామిలీలు - రకుల్ ప్రీత్‌కు ఉన్నదేంటి?: టీడీపీ నేత దివ్యవాణి సంచలనండ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఫ్యామిలీలు - రకుల్ ప్రీత్‌కు ఉన్నదేంటి?: టీడీపీ నేత దివ్యవాణి సంచలనం

అమలులోకి కోడ్..

అమలులోకి కోడ్..

ఈసీ ప్రకటించిన షెడ్యూల్ లో తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అనివార్యమైన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబరు 9న విడుదలవుతుందని, నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేస్తామని ఈసీ పేర్కొంది. షెడ్యూల్ విడుదలతో మంగళవారం నుంచే దుబ్బాకలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లయింది.

ఇదీ దుబ్బాక షెడ్యూల్..

ఇదీ దుబ్బాక షెడ్యూల్..

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ అక్టోరబ్ 9న ప్రారంభం అవుతుంది. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 16. ఆ తర్వాతిరోజైన అక్టోరబ్ 17న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉప సంహరణకు చివరి తేది అక్టోబర్ 19. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 10న కౌంటింగ్ నిర్వహిస్తారు.

పవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల మాసికం - జైలు భయంతోనే జగన్ ఆ పని - బుద్ధి తక్కువై పొత్తు: సీపీఐ నారాయణపవన్ కల్యాణ్ మూడుపెళ్లిళ్ల మాసికం - జైలు భయంతోనే జగన్ ఆ పని - బుద్ధి తక్కువై పొత్తు: సీపీఐ నారాయణ

ఊపందుకున్న ప్రచారం..

ఊపందుకున్న ప్రచారం..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంటింటి ప్రచారంపై నిషేధం కొనసాగుతుండటంతో దుబ్బాకలో నేతలు అతి జాగ్రత్తగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున సోలిపేట తనయుడు లేదా భార్యకు టీఆర్ఎస్ టికెట్ దక్కొచ్చని తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ పేరును ఖరారు చేయకముందే రఘునందన్ రావు ప్రచారంలో మునిగిపోయారు. కాంగ్రెస్ తరఫున నలుగురైదుగురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం పోటీ చేసే అవకాశం లేకపోలేదు. తాజాగా నోటిఫికేషన్‌ రావడంతో నేతలు మరింత దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు.

Recommended Video

Watch New AICC Telangana Incharge Manickam Tagore Meets Party Leaders | Oneindia Telugu
గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడంటే..

గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడంటే..

దుబ్బాక ఉప ఎన్నికతోపాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్‌ రెండో వారంలో గ్రేటర్ బల్దియా ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. నిజానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గ్రేటర్ కార్యవర్గ పదవీకాలం ఉన్నా, ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్ భావిస్తుండటంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

English summary
election commission of india (ECI) announces date of Bypolls to one Lok Sabha and 56 assembly seats across the country. telangana's dubbaka constituency by election to be held on 3rd november. the poll body also focus on greater hyderabad municipal corporation elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X