వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దిపేటలో ఉద్రిక్తత: స్వర్ణ లాడ్జి వద్ద టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల కొట్లాట -దుబ్బాక బైపోల్ నేపథ్యంలో

|
Google Oneindia TeluguNews

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంకొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీ నేతలు, శ్రేణులు కొట్లాటకు దిగారు. దుబ్బాక బైపోల్ పై సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని స్వర్ణ ప్యాలెస్ లాడ్జ్ దగ్గర టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.

కాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు మృతి -మరో22మంది విషమంకాబూల్ యూనివర్సిటీలో మారణహోమం -ఉగ్రదాడిలో 19మృతి విద్యార్థులు మృతి -మరో22మంది విషమం

ప్యాలెస్ లాడ్జ్‌లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారని తెలుకున్న బీజేపీ శ్రేణులు.. లాడ్జి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిఘటించారు. రెండు వర్గాలు తలపడడంతో తీవ్రంగా తోపులాట జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గంటపాటు ఈ హైడ్రామా కొనసాగింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.

 dubbaka bypoll: hours before polling, clash between trs, bjp activists, several arrested

అన్ని పార్టీలూ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠగా మారింది. ప్రచారంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో నడవటం, బీజేపీ అభ్యర్థులకు చెందినదిగా చెబుతోన్న కోట్లాది రూపాయలు పట్టుపడటం కలకలం రేపింది. బుధవారం జరగబోయే ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరుఅమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసా? -ఎలక్టోరల్ కాలేజ్ వివరాలివే -ఓట్లు నేరుగా వేయరు

బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ జరుగునుంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 98028 మంది పురుషులు, 100719 మహిళలున్నారు. ఎన్నిక నిర్వాహణకు 5,000 సిబ్బంది పనిచేస్తున్నారు. మొత్తం 315 బూత్ లను ఏర్పాటు చేసిన అధికారులు.. 89 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ జరుగనుంది. ప్రధాన పార్టీలతో కలిపి మొత్తం ఇరవై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈనెల 10న ఫలితం వెల్లడికానుంది.

English summary
hours before crucial by poll at dubbaka assembly constituency, clash erupts between trs and bjp activists at monday night. police arrested several persons. about 1.98 lack voters to cast their vote on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X