వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Dubbaka bypoll results : దుబ్బాకలో బీజేపీ దూకుడు ..భవిష్యత్ ఎన్నికలపై గులాబీ గుబులు

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఎన్నికల ఫలితాలపై టిఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పట్టుకుంది . దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సిద్ధిపేట లోని ఇందూరు ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దూకుడు చూపిస్తున్నారు. దివంగత నేత సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత వెనుకంజలో ఉన్నారు .నియోజకవర్గ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామం పోతారంలో కూడా టీఆర్ఎస్ పార్టీ వెనుకంజలో ఉంది. అక్కడ బీజేపీ ఆధిక్యంతో ముందుకు దూసుకుపోతోంది.

Recommended Video

Dubbaka Bypoll Result: BJP candidate leads with 2684 votes | Oneindia Telugu

గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ ఫోకస్ .. గెలుపు గుర్రాలకే టికెట్లు , ఆ హామీలే ప్రచారాస్త్రాలుగ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై బీజేపీ ఫోకస్ .. గెలుపు గుర్రాలకే టికెట్లు , ఆ హామీలే ప్రచారాస్త్రాలు

ఇప్పటివరకు ఆధిక్యంలో బీజేపీ .. మంత్రి హరీష్ కు టెన్షన్

ఇప్పటివరకు ఆధిక్యంలో బీజేపీ .. మంత్రి హరీష్ కు టెన్షన్

మొదటి రౌండ్ నుండి ఆధిక్యం చూపిస్తూ వస్తున్న బిజెపి నాలుగో రౌండ్లోనూ ఆధిక్యాన్ని కొనసాగించింది . మొత్తం ఇప్పటి వరకూ లెక్కించిన 4 రౌండ్ల లోనూ బీజేపీ ఆధిక్యాన్ని కొనసాగించడంతో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు టెన్షన్ పడుతున్నారు. ఒకపక్క మంత్రి హరీష్ రావు దుబ్బాక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు బిజెపికి అనుకూలంగా రావడంతో హరీష్ కు టెన్షన్ పట్టుకుంది.

టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన ... కాంగ్రెస్ పోటీలో చాలా దూరంగా

టీఆర్ఎస్ నేతల్లో ఆందోళన ... కాంగ్రెస్ పోటీలో చాలా దూరంగా

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన టిఆర్ఎస్ పార్టీలో వ్యక్తమౌతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు ఉప ఎన్నిక ఫలితం తేలనున్న నేపద్యంలో కొనసాగుతున్న కౌంటింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ధీటుగా తలపడిన టీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రజా తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బిజెపి, టిఆర్ఎస్ పార్టీల సమీపంలో కూడా లేకుండా వెనుకబడింది.

టీఆర్ఎస్ పై వ్యతిరేకత .. బీజేపీ అభ్యర్థిపై సింపతీ వర్కవుట్ అవుతుందా ?

టీఆర్ఎస్ పై వ్యతిరేకత .. బీజేపీ అభ్యర్థిపై సింపతీ వర్కవుట్ అవుతుందా ?

గతంలో పలుమార్లు పోటీచేసి ఓటమిపాలైన రఘునందన్ రావు పై సింపతి దుబ్బాక ప్రజాతీర్పు లో స్పష్టంగా కనిపిస్తోంది. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ పైన దుబ్బాక ప్రజల్లో ఉన్న అసంతృప్తి కూడా ఈ ఫలితాలకు కారణంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇంకా 19 రౌండ్ ల లెక్కింపు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఓటరు దేవుళ్ళ తీర్పు అధికార పార్టీకి అనుకూలంగా వస్తుందా రాదా అన్న ఆందోళనలో టిఆర్ఎస్ అధినాయకత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 టీఆర్ఎస్ ఓడిపోతే భవిష్యత్ ఎన్నికలపై తీవ్రమైన దెబ్బ

టీఆర్ఎస్ ఓడిపోతే భవిష్యత్ ఎన్నికలపై తీవ్రమైన దెబ్బ

ఒకవేళ టిఆర్ఎస్ పార్టీ విజయ సాధించకుంటే, ఈ ఫలితాల ప్రభావం ముందు ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ను కనిపించే ప్రమాదం ఉన్నట్లు గా తెలుస్తోంది. ఏది ఏమైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ కు దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ఇదే విధంగా కొనసాగితే దుబ్బాక లో టిఆర్ఎస్ ఓటమి ఖాయం అని భావిస్తున్నారు. ఇక అదే గనుక జరిగితే భవిష్యత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు కావడంతో తద్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

English summary
If the TRS party does not win the Dubaka by-election, the impact of these results seems likely to be felt in the forthcoming MLC elections as well as the Greater Hyderabad Municipal Corporation elections. However, the Dubaka by-election result has left the ruling TRS reeling. If the current trend continues in the same way, the TRS defeat in Dubaka is expected to be permanent. Political analysts say that if the same happens, the TRS party will Face tough fight in future elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X