వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబ్బాకలో కాంగ్రెస్ ఓటమికి కారణం కాంగ్రెస్ పై వ్యతిరేకత కాదట ... వీహెచ్ , మధు యాష్కీ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

దుబ్బాక ఉప ఎన్నిక బరిలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది . దుబ్బాక ఉపఎన్నిక పోరులో కాంగ్రెస్ పార్టీ పోరాటంలో బాగా వెనుకబడింది. దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడంతో టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చినట్టు అయింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీలుగా మేమంటే మంటూ ఇంతకాలం పోటాపోటీగా ప్రచారం చేసుకున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీలో తాజా ఉప ఎన్నికలో బిజెపి దూసుకుపోవడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత షాక్ అనే చెప్పొచ్చు.

 ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అయింది : మధుయాష్కీ

ప్రజలలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అయింది : మధుయాష్కీ

దుబ్బాక ఉపఎన్నికలో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు అంతగా వ్యతిరేకత లేదని దుబ్బాక ఫలితంతో తెలిసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. దుబ్బాక లో కాంగ్రెస్ పార్టీకి 21,819 ఓట్లు పోల్ అయినట్లుగా తెలుస్తుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైన సందర్భంగా మాట్లాడిన మధుయష్కిగౌడ్ ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని ఉన్నారు.

రఘునందన్ రావు స్థానికత కూడా విజయానికి ఒక కారణం

రఘునందన్ రావు స్థానికత కూడా విజయానికి ఒక కారణం

దుబ్బాక ఎన్నికల ఫలితాలను బట్టి ప్రజల నాడి తేటతెల్లమైందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీనే ఒక దేవతగా భావిస్తారని, సోనియాగాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని టిఆర్ఎస్ నాయకులు కూడా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత లేదని చెప్పిన ఆయన శ్రీనివాస్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపినా ప్రజలు బిజెపికి ఓటు వేయడం వెనుక స్థానికత ప్రధాన కారణమంటూ మాట్లాడారు.

అభ్యర్థి ఎంపిక లో జరిగిన పొరపాటు పరాజయానికి ప్రధాన కారణం : వీహెచ్

అభ్యర్థి ఎంపిక లో జరిగిన పొరపాటు పరాజయానికి ప్రధాన కారణం : వీహెచ్

స్థానికుడైన రఘునందన్ రావు ముందు నుంచి నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడం ఆయనకు కలిసి వచ్చిందని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు.

ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై స్పందించిన వి.హనుమంతరావు అభ్యర్థి ఎంపిక లో జరిగిన పొరపాటు పరాజయానికి ప్రధాన కారణమంటూ మాట్లాడారు. పార్టీలో మొదటి నుంచి జెండా మోసిన వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలు మార్చే వారికి ప్రాధాన్యత ఇవ్వడం వల్లే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

హరీష్ రావు స్ట్రాటజీ తోనే కాంగ్రెస్ కు భారీ దెబ్బ : సంపత్ కుమార్

హరీష్ రావు స్ట్రాటజీ తోనే కాంగ్రెస్ కు భారీ దెబ్బ : సంపత్ కుమార్


హరీష్ రావు ప్రధానంగా బిజెపిని టార్గెట్ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీకి పడకుండా చేశారని, మొదటి నుండి శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఆయన వ్యూహాత్మకంగానే వ్యవహరించారని,ఆయన శ్రీనివాస్ రెడ్డి గురించి ఎక్కువగా మాట్లాడకపోవటంతో ప్రధాన ప్రత్యర్ధిగా రఘునందన్ అన్న టాక్ వచ్చిందని అన్నారు. అందువల్లే బిజెపి ఓటమి పాలైందని కాంగ్రెస్ పార్టీ నేత సంపత్ కుమార్ చెబుతున్నారు. దుబ్బాక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. ఇక టిఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అయిందని, అభ్యర్థి స్థానికత బిజెపిని గెలిపించింది అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.

English summary
Congress party leaders expressing their defeat in the Dubaka by-election. Madhuyashki Gowd, a senior Congress leader, said that the Congress party was aware of the dubious result that there was not much opposition from the people. VH said the mistake in the selection of the candidate was the main reason for the defeat. Sampath Kumar said that the Congress was dealt a heavy blow with the Harish Rao strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X